Disease with Meat: మీరు వారంలో ఎక్కువసార్లు మాంసాహారం తింటారా? ఈ తీవ్రమైన వ్యాధి వచ్చే అవకాశం
Disease with Meat: మీకు పెద్ద జంతువుల మాంసం తినడం ఎక్కువ ఇష్టమైతే, ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ మాంసాలు ఆరోగ్యానికి అనేక విధాలుగా హానికరం మరియు క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.
నాన్ వెజ్ ప్రియులకు మాంసంతో వండిన ఆహారం నచ్చుతుంది. మాంసాహారం రుచికి ఎంతో మంది ఆకర్షితులవుతారు. ప్రతిరోజూ మాంసాహారం తినేవారు కూడా ఉన్నారు. మాంసంలో ఉండే పోషకాలు మన శరీరానికి అవసరం. అయితే అతిగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. మాంసంలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలు ఉంటాయి. కానీ మితిమీరి మాంసాహారం తినడం వల్ల తీవ్ర అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కూరగాయలు, పండ్లతో పోలిస్తే మాంసం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో చేటు జరుగుతుంది. ముఖ్యంగా మాంసాహారం అధికంగా తినేవారికి పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
మాంసాహారంలో ఎన్నో రకాలు ఉన్నాయి. చిన్న జీవుల నుంచి పెద్ద జంతువుల వరకు ఎన్నో రకాల నాన్ వెజ్ ఐటెమ్స్ ఉన్నాయి. అయితే పెద్ద జీవుల నుండి వచ్చే మాంసం వల్ల క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా పెంచుతుంది. ముఖ్యంగా రెడ్ మీట్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. రెడ్ మీట్ మాంసం తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. అంటే పొట్ట నొప్పి, మలబద్ధకం, వాంతులు, విరేచనాలు వంటివి వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. మాంసం వల్ల జీర్ణక్రియలో దీర్ఘకాలిక సమస్యలు పెద్ద పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.
ఫ్రెడ్‌హచ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధనలో రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని అధికంగా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తేలింది. అమెరికాలో చాలా మంది కొలొరెక్టల్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. 2024 సంవత్సరంలో, సుమారు ఒకటిన్నర మిలియన్ల మందికి పెద్దప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
పెద్దప్రేగు క్యాన్సర్ వల్ల పెద్దప్రేగులో కణితులు అభివృద్ధి చెందుతాయి. ఈ క్యాన్సర్ మొదలయ్యాక బయట పడటానికి సాధారణంగా 10 సంవత్సరాలు పడుతుంది. ఇది ఎక్కువగా 50 ఏళ్లు పైబడిన వారిలో వస్తుంది. పెద్దప్రేగు క్యాన్సర్ యువతలో అభివృద్ధి చెందుతోంది. పెద్దప్రేగు ప్రాంతంలో దీర్ఘకాలిక ఇన్ ఫ్లమేషన్ వల్ల పేగుల గోడలలో కణితులు పెరుగుతాయి. ఇది తీవ్రమైన క్యాన్సర్ గా మారుతుంది.
పెద్దప్రేగు క్యాన్సర్ లక్షణాలు
పెద్దప్రేగు క్యాన్సర్ ను సకాలంలో గుర్తించడం వల్ల చికిత్సను సులభతరం చేస్తుంది. ఎవరైనా ప్రేగు కదలికలో ఏదైనా మార్పు కనిపించినా, మలబద్ధకం, విరేచనాలు, మలవిసర్జన తర్వాత అసౌకర్యంగా అనిపించడం, మలంలో రక్తం పడడం, ఎల్లప్పుడూ కడుపులో నొప్పి అనిపించడం, అలసట, బరువు తగ్గడం, రక్తహీనత, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి.
పరిశోధన ప్రకారం, పెద్దప్రేగు క్యాన్సర్ మాత్రమే కాదు, మాంసం అధికంగా తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ప్రోటీన్ కోసం ప్రజలు మాంసం మీద ఆధారపడతారు. ప్రాసెస్ చేయని లేదా ప్రాసెస్ చేసిన రెడ్ మీట్ తింటే 46 శాతం డయాబెటిస్ వచ్చే అవకాశం పెరిగిపోతుంది.
రెడ్ మీట్ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రెడ్ మీట్‌ను నిరంతరం తింటే కొలెస్ట్రాల్, ఊబకాయం వచ్చే సమస్యలు పెరుగుతాయి. రెడ్ మీట్ జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను సృష్టిస్తుంది. ఎక్కువగా జీర్ణం కావడం కష్టంచ ఈ జీర్ణంకాని ఆహారాలు క్యాన్సర్ వంటి కారణాలకు కారణమవుతాయి
టాపిక్