అరికాలు, మడమ దిగువన తీవ్రమైన నొప్పి ఉంటే మీరు ప్లాంటర్ ఫాసిటిస్‌తో బాధపడుతున్నారని అర్థం. వాపు లేదా ఎరుపు రంగులో మారడం దీని లక్షణాలు.  తేలికపాటి అరికాలి ఫాసిటిస్ ఇంటి చికిత్సలు కూడా ఉన్నాయి.   

pexels

By Bandaru Satyaprasad
Jun 10, 2024

Hindustan Times
Telugu

ప్లాంటర్ ఫాసిటిస్ అంటే- ప్లాంటర్ ఫాసిటిస్ అనేది అరికాలి కణజాలం వాపు వల్ల వచ్చే ఒక సాధారణ మస్క్యులోస్కెలెటల్ డిజార్డర్. ఉదయం నిద్రలేచినప్పుడు, ఎక్కువసేపు నిలబడిన, కూర్చొన్న భరించలేని బాధ కలగవచ్చు.  

pexels

అరికాలి ఫాసిటిస్ లక్షణాలు 

pexels

 అరికాలి ఫాసిటిస్ లక్షణాలు

pexels

మడమ దగ్గర పాదాల దిగువ భాగంలో తీవ్రమైన నొప్పి,  ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకున్న తర్వాత మడమ నొప్పి రావడం,  ఎక్కువ సేపు నిలబడి పనిచేయడం లేదా వ్యాయామం తర్వాత తీవ్రమయ్యే నొప్పి, మడమ వాపు, పాదాల్లో దృఢత్వం తగ్గడం

pexels

ప్లాంటర్ ఫాసిటిస్ కారణాలు  

unsplash

 ప్లాంటర్ ఫాసిటిస్ కారణాలు 

unsplash

మితిమీరిన వినియోగం- పరుగు, నడవడం లేదా ఎక్కువసేపు నిలబడటంతో పాదాలపై ఒత్తిడి పెరిగి ప్లాంటర్ ఫాసిటిస్ స్థితికి దారితీయవచ్చు. 

unsplash

బయోమెకానికల్ కారకాలు- చదునైన పాదాలు అసాధారణ నడకకు కారణం అవుతాయి. దీంతో అరికాలి కణజాలంపై అధిక ఒత్తిడి ఉంటుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో తీవ్ర నొప్పికి దారితీస్తుంది.   

unsplash

వయస్సు- అరికాలి తంతుయుత కణజాలంలో మార్పులు 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో సర్వసాధారణం. పురుషుల కంటే స్త్రీలలో ఈ మార్పులు ఎక్కువ. ఈ వయసులో కణజాలం క్షీణించే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.   

unsplash

ఊబకాయం- అధిక శరీర బరువు అరికాలి కణజాలంపై భారాన్ని పెంచుతుంది. ఊబకాయం ఉన్నవారిలో అరికాలి కాల్కానియల్ బోన్ స్పర్ లేదా మడమ నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  

unsplash

ప్లాంటర్ ఫాసిటిస్ కు కొన్ని ఇంటి చిట్కాలతో ఉపశమనం కలుగుతుంది.   

unsplash

 మడమ నొప్పిని తీవ్రతరం చేసే పనులను మానుకోండి.  అరికాళ్ల మంట, నొప్పిని తగ్గించడానికి రోజులో తరచూ 15-20 నిమిషాలు ఐస్ ను అప్లై చేయండి.   

unsplash

అరికాలి కణజాలం కోసం వ్యాయామాలు, దిగువ కాలు కండరాలకు బలపరిచే వ్యాయామాలు చేయండి. తగిన మద్దతు, కుషనింగ్ అందించే బూట్లు వాడండి.   బరువు తగ్గడం వలన అరికాలి కణజాలంపై ఒత్తిడిని తగ్గిస్తుంది.

unsplash

మన శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి రాగులు.

Unsplash