అతిగా ఆకలిని అవుతోందా? ఇవి తింటే కంట్రోల్‍లో ఉంటుంది!
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Dec 22, 2024
Hindustan Times Telugu
కొందరికి తరచూ ఆకలిగా అనిపిస్తుంటుంది. దీంతో అవసరం కంటే ఎక్కువ ఆహారం తినేస్తుంటారు. ఇలా చేస్తుంటే బరువు పెరిగిపోతారు. అందుకే అతి ఆకలి మంచిది కాదు.
Photo: Pexels
కొన్ని రకాల ఆహారాలు తింటే తరచూ ఆకలి కావడం తగ్గుతుంది. అలాంటి ఐదు రకాల ఫుడ్స్ ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తింటే అతిగా ఆకలి కాదు. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఫైబర్ పుష్కలంగా ఉండే కూరగాయలు, పండ్లు, ఓట్స్, బీన్స్ లాంటివి డైట్‍లో తీసుకోవాలి.
Photo: Pexels
కోడిగుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. సంతృప్తిని కలిగించి ఆకలిని గుడ్లు తగ్గిస్తాయి. బరువు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
Photo: Pexels
బాదం, వాల్‍నట్స్, జీడిపప్పు లాంటి నట్స్‌లో ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ మెండుగా ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గిస్తాయి. కడుపు నిండిన ఫీలింగ్‍ను ఎక్కువసేపు ఉంచుతాయి.
Photo: Pexels
కాఫీలో ఉండే కెఫిన్ కూడా ఆకలిని తగ్గిస్తుంది. అందుకే అతిగా ఆకలేస్తుంటే కాఫీ తాగొచ్చు. అయితే, కాఫీని మోతాదు మేరకే తీసుకోవాలి. మరీ ఎక్కువ తాగకూడదు.
Photo: Pexels
బీన్స్, పప్పులు, శనగలు లాంటి కాయధాన్యాల్లో ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్, ఫైబర్ అత్యధికంగా ఉంటాయి. ఇవి తినడం వల్ల తరచూ ఆకలి అవడం తగ్గుతుంది.
Photo: Pexels
భార్యాభర్తల మధ్య ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఈ ఏడు మాటలు అస్సలు బయటకు రానివ్వకండి.