OTT Crime Thriller: విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే!-vijay sethupathi vetrimaran viduthalai part 2 to stream on zee5 ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Crime Thriller: విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే!

OTT Crime Thriller: విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే!

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 22, 2024 05:50 AM IST

Viduthalai Part 2 OTT Platform: విడుదల పార్ట్ 2 సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఏదో ఖరారైంది. ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఏ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుందో వెల్లడైంది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.

OTT Crime Thriller: విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే!
OTT Crime Thriller: విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ వచ్చేది ఈ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోనే!

తమిళ స్టార్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన విడుదలై పార్ట్ 2 సినిమా ఈ శుక్రవారమే (డిసెంబర్ 20) థియేటర్లలో రిలీజైంది. వెట్రిమారన్ దర్శకత్వం వహించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం మంచి అంచనాలతో వచ్చింది. గతేడాది వచ్చిన విడుదలైకు సీక్వెల్‍గా అడుగుపెట్టింది. విడుదలై 2 మూవీ తెలుగులో విడుదల 2 పేరుతో రిలీజైంది. ఈ సినిమాకు ఎక్కువగా పాజిటివ్ టాక్ వస్తోంది. కాగా, విడుదలై 2 సినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్ వివరాలు బయటికి వచ్చాయి.

ఓటీటీ హక్కులు ఈ ప్లాట్‌ఫామ్‍వే

విడుదలై పార్ట్ 2 సినిమా ఓటీటీ హక్కులను జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ చిత్రం ఈ ప్లాట్‍ఫామ్‍లోనే స్ట్రీమింగ్‍కు రానుంది.

థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత విడుదలై 2 చిత్రం జీ5 ఓటీటీలోకి వస్తుందనే అంచనాలు ఉన్నాయి. జనవరి రెండో లేదా మూడో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రావొచ్చు. ఒకవేళ థియేట్రికల్ రన్ ఎక్కువ రోజులు బాగా కొనసాగిస్తే స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

విడుదలై 2 చిత్రంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రలు పోషించగా.. మంజు వారియర్, భవానీ శ్రీ, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, కిశోర్, బోస్ వెంకట్, హరీశ్ ఉత్తమన్ కీరోల్స్ చేశారు. స్టార్ డైరెక్టర్ వెట్రిమాన్.. ఈ మూవీని ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. తన మార్క్ సిద్ధాంతం, టేకింగ్‍తో ఈ చిత్రాన్ని తీసుకొచ్చారు.

విడుదలై 2 మూవీలో విజయ్ సేతుపతి నటనపై ఎక్కువగా ప్రశంసలు వస్తున్నాయి. మరోసారి అద్భుతంగా నటించారనే రెస్పాన్స్ వస్తోంది. ఇతర నటీనటుల పర్ఫార్మెన్స్‌పై కూడా పాజిటివ్ స్పందన వస్తోంది. ఈ మూవీలో ప్రీ-క్లైమాక్స్ అద్భుతంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం ఎక్కువగా సానుకూల స్పందన దక్కించుకుంటోంది. అయితే, కొన్ని సీన్లు సాగదీతగా, లాంగ్‍గా ఉన్నాయనే అసంతృప్తి కూడా కొందరి నుంచి వ్యక్తమైంది.

విడుదలై 2 కలెక్షన్లు

విడుదలై 2 సినిమా తొలి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.18 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. గతేడాది తొలి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్ మూవీకి మంచి ఓపెనింగ్ దక్కింది. ఆదివారం కూడా బుకింగ్స్ బాగానే జరిగాయి. సోమవారమే ఈ మూవీకి బాక్సాఫీస్ వద్ద అసలు పరీక్ష ఎదురుకానుంది.

విడుదలై 2 మూవీకి మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఆర్ఎస్ ఇన్ఫోటైన్‍మెంట్, గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై ఎల్రెడ్ కుమార్, వెట్రిమారన్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.

Whats_app_banner

సంబంధిత కథనం