Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు సీరియల్‌కు రిషి అందుకే దూరమయ్యాడా? హీరోగా ఫస్ట్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Guppedantha Manasu Rishi: గుప్పెడంత మనసు నుంచి రిషి తప్పుకోవడంతో సీరియల్ ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు. అతడి రీఎంట్రీ కోసం అసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రిషి హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ డెబ్యూ మూవీ కారణంగానే అతడు సీరియల్‌కు దూరమైనట్లు సమాచారం.
Guppedantha Manasu Rishi: ముఖేష్ గౌడ అనే పేరు వినగానే బుల్లితెర ఆడియెన్స్‌కు అతడు ఎవరో గుర్తుపట్టడానికి టైమ్‌పట్టొచ్చు. కానీ గుప్పెడంత మనసు రిషి అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. రిషి అంటేనే గుప్పెడంత మనసు...గుప్పెడంత మనసు అంటేనే రిషి అన్నంతగా మారిపోయాడు ముఖేష్ గౌడ. స్టార్ మాలో టెలికాస్ట్ అవుతోన్న గుప్పెడంత మనసు సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు రిషి.
లవ్‌స్టోరీకి బ్రేక్...
ఇటీవలే గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి తప్పుకున్నాడు.దాంతో రిషి, వసుధార లవ్‌స్టోరీకి బ్రేక్ పడింది. రిషి క్యారెక్టర్ చనిపోయాడంటూ చూపించారు. గుప్పెడంత మనసు సీరియల్‌కు బాగా పాపులారిటీ రావడానికి రిషి కూడా ఓ కారణం. అతడు తప్పుకోవడంతో సీరియల్ టీఆర్‌పీ రేటింగ్ బాగాపడిపోయింది.
దాంతో రిషి బతికే ఉన్నాడని వసుధార నమ్ముతున్నట్లుగా సీరియల్‌ను కంటిన్యూ చేస్తున్నారు. రిషి సీరియల్ నుంచి తప్పుకొని మూడు, నాలుగు నెలలు దాటినా అతడి క్యారెక్టర్ రీఎంట్రీ ఉంటుందని అప్పుడప్పుడు హింట్ ఇవ్వడం తప్పితే ఎప్పుడు తిరిగివచ్చేది మేకర్స్ ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అదిగో వస్తాడు...ఇదిగో వస్తాడు అంటూ టైమ్‌పాస్ చేస్తున్నారు.
సినిమాలపై ఫోకస్...
రిషి పూర్తిగా సీరియల్ నుంచి వైదలగలేదని, అనారోగ్య కారణాల వల్ల కొన్నాళ్లు సీరియల్‌కు బ్రేక్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది.ఆ విషయాన్ని సీరియల్ ద్వారానే ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. డైరెక్టర్ కూడా సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చాడు. సీరియల్‌కు రిషి బ్రేక్ తీసుకున్న మాట నిజమేకానీ అనారోగ్యం వల్ల కాదని సమాచారం. కొన్నాళ్లుగా సినిమాలపై ఫోకస్ పెట్టిన ముఖేష్ గౌడ అలియాస్ రిషి త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
గీతా శంకరం పేరుతో తెలుగులో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కోసమే అతడు గుప్పెడంత మనసు సీరియల్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. సీరియల్ కారణంగా సినిమా డేట్స్ సర్ధుబాటు కాలేదని, అందుకే సినిమా ముగిసే వరకు సీరియల్‌కు దూరంగా ఉండాలని అతడు నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.
విలేజ్ లవ్ స్టోరీ…
గీతాశంకరం మూవీలో ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. డీజే టిల్లు, బలగం ఫేమ్ మురళీధర్ గౌడ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. గీతా శంకరం మూవీ పోస్టర్స్‌ను రిషి ఇటీవల షేర్ చేశాడు. వర్కింగ్ స్టిల్స్ పంచుకున్నాడు.
సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల్లో తనకు ఉన్న క్రేజ్ ఈ మూవీకి ఉపయోగపడుతుందని రిషి భావిస్తోన్నాడు. మూవీ షూటింగ్ పూర్తయిన వెంటనే రిషి గుప్పెడంత మనసు సీరియల్‌లోకి రీఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. తె లుగులో గుప్పెడంత మనసుతో పాటు ప్రేమ్‌నగర్ సీరియల్‌లో నటిస్తున్నాడు ముఖేష్ గౌడ. కన్నడంలో కొన్ని సీరియల్స్‌లో నటిస్తున్నాడు.