Guppedantha Manasu March 6th Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ - మ‌ను ప్రేమ‌లో వ‌సుధార‌ - మ‌ర‌ద‌లి ప‌రువు తీసిన రాజీవ్-guppedantha manasu march 6th episode vasudhara doubts on manu and anupama past ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu March 6th Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ - మ‌ను ప్రేమ‌లో వ‌సుధార‌ - మ‌ర‌ద‌లి ప‌రువు తీసిన రాజీవ్

Guppedantha Manasu March 6th Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ - మ‌ను ప్రేమ‌లో వ‌సుధార‌ - మ‌ర‌ద‌లి ప‌రువు తీసిన రాజీవ్

Nelki Naresh Kumar HT Telugu
Mar 06, 2024 08:23 AM IST

Guppedantha Manasu March 6th Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో వ‌సుధార‌ను త‌న సొంతం చేసుకోవ‌డానికి రాజీవ్ మ‌రో కొత్త ప్లాన్ వేస్తాడు. వ‌సుధార‌, మ‌ను క్లోజ్‌గా దిగిన ఫొటోల‌ను కాలేజీ మొత్తం అంటిస్తాడు. వాటి ద్వారా వ‌సుధార ప‌రువు తీయాల‌ని అనుకుంటాడు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu March 6th Episode: మ‌ను, అనుప‌మ మ‌ధ్య‌ ముందు నుంచే ప‌రిచ‌యం ఉంద‌ని మ‌హేంద్ర‌తో పాటు వ‌సుధారలో కూడా అనుమానం మొద‌ల‌వుతుంది. వారిద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం ఏమిటో తెలుసుకోవాల‌ని వ‌సుధార ఫిక్స‌వుతుంది. కాలేజీకి వ‌చ్చిన ఏంజెల్‌ను మ‌ను గురించి నీకు ఏమైనా తెలుసా అని అడుగుతుంది. తెలుసు అని ఏంజెల్ స‌మాధాన‌మిస్తుంది. ఎవ‌ర‌త‌ను, అత‌డి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటూ ఏంజెల్‌పై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుంది వ‌సుధార‌.

ఇక్క‌డే ప‌రిచ‌యం...

. మ‌నును నువ్వే నాకు ప‌రిచ‌యం చేశావ‌ని, డీబీఎస్‌టీ కాలేజీలోనే అత‌డితో ప‌రిచ‌యం ఏర్ప‌డింద‌ని, అంతే త‌ప్ప అత‌డితో ఇంత‌కుముందు నాకు ప‌రిచ‌యం లేద‌ని వ‌సుధార‌తో అంటుంది ఏంజెల్‌.

మ‌ను గురించి వ‌సుధార, ఏంజెల్ మాట్లాడుకుంటుండ‌గా స‌డెన్‌గా అక్క‌డికి మ‌ను వ‌స్తాడు. అత‌డిని చూసి వ‌సుధార షాక‌వుతుంది. మీ గురించే మేము మాట్లాడుకుంటున్నామ‌ని మ‌నుతో అంటుంది ఏంజెల్‌. మా అత్త‌య్య అనుప‌మ మీకు ఎలా తెలుసు మ‌నును అడుగుతుంది ఏంజెల్‌. మ‌ను స‌మాధానం చెప్ప‌బోతుండ‌గా శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు. వ‌చ్చి రావ‌డంతోనే కాలేజీతో సంబంధం లేని కొత్త‌వాళ్లు వ‌స్తున్నారు. ఇది డీబీఎస్‌టీ కాలేజీనా...మ‌రో కాలేజీనా అని అనిపిస్తుంది అంటూ ఏంజెల్‌పై సెటైర్స్‌వేస్తాడు శైలేంద్ర‌.

శైలేంద్ర‌కు షాక్‌...

మీ డిస్క‌ష‌న్స్‌లోనే నేను పార్టిసిపేట్ చేయ‌చ్చా అని వ‌సుధార‌ను అడుగుతాడు శైలేంద్ర‌. ఇలాంటి డిస్క‌ష‌న్స్ అంటే నాకు ఇష్టం అని శైలేంద్ర అంటాడు. మీతో డిస్క‌స్ చేయ‌డం మాకు ఇష్టం లేదు. మేము మాత్ర‌మే మాట్లాడుకుంటాం. మీరు వెళ్లొచ్చు అని శైలేంద్ర‌కు గ‌ట్టిగా రిప్లై ఇస్తుంది వ‌సుధార‌.

అయినా శైలేంద్ర అక్క‌డే ఉండ‌టంతో...వెళ్ల‌మ‌ని చెప్పినా ఇంకా ఇక్క‌డే ఉన్నావేంటి అని శైలేంద్ర‌ను గ‌ద్దిస్తుంది. ప‌రాయివాళ్ల‌ముందు న‌న్ను త‌క్కువ చేసి మాట్లాడ‌టం బాగాలేద‌ని శైలేంద్ర అంటాడు. నువ్వు ఏమైన్నా అనుకో నాకు సంబంధం లేద‌ని శైలేంద్ర‌తో అంటుంది వ‌సుధార‌. నేను రాజీవ్ క‌లిసి చేస్తున్న ప్లాన్‌తో మీ అంద‌రికి బొమ్మ క‌నిపించ‌డం ఖాయ‌మ‌ని మ‌న‌సులో అనుకుంటూ కోపంగా శైలేంద్ర అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

చ‌క్ర‌పాణికి వార్నింగ్‌...

మార్కెట్ నుంచి వ‌స్తోన్న చ‌క్ర‌పాణికి రాజీవ్ ఎదురుప‌డ‌తాడు. వ‌సుధార‌ను నాతో పెళ్లికి ఒప్పించ‌మ‌ని చ‌క్ర‌పాణిని నిల‌దీస్తాడు రాజీవ్‌. లేదంటే వ‌సుధార ప‌రువు మొత్తం తీసి రోడ్డున ప‌డేస్తాన‌ని చ‌క్ర‌పాణిని బెదిరిస్తాడు. రాజీవ్‌ను భ‌య‌పెట్టాల‌ని చ‌క్ర‌పాణి చూస్తాడు. కానీ అత‌డి బెదిరింపుల‌కు రాజీవ్ భ‌య‌ప‌డ‌డు. త‌న జేబులో నుంచి తాళిబొట్టు తీస్తాడు. వ‌సుధార మెడ‌లో క‌ట్టాల్సిన తాళి ఇది.

కానీ త‌న మెడ‌లో తానే తాళి క‌ట్టుకొని ఇదివ‌ర‌కు త‌ప్పించుకున్న‌ది. ఇప్పుడు వ‌సుధార మెడ‌లో ఈ తాళి ప‌డే టైమ్ వ‌చ్చింద‌ని రాజీవ్ అంటాడు. అలా జ‌ర‌గ‌క‌పోతే నా విశ్వ‌రూపం చూపిస్తాన‌ని హెచ్చ‌రిస్తాడు. ఇలాంటి విశ్వ‌రూపాలు చాలా చూశాన‌ని, ఇక్క‌డి నుంచి వెళ్లిపొమ్మ‌ని రాజీవ్‌తో అంటాడు చ‌క్ర‌పాణి.

రాజీవ్ వెళ్లిపోగానే వ‌సుధార‌కు ఫోన్ చేస్తాడు చ‌క్ర‌పాణి. కానీ రాజీవ్వెళ్లిపోకుండా మ‌ళ్లీ వెన‌క్కివ‌స్తాడు. చ‌క్ర‌పాణి చేతులో నుంచి ఫోన్ తీసుకుంటాడు. మీ నాన్న మంచివాడిలా మారిపోయి నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడ‌ని అనుకుంటున్నాన‌ని తిక్క‌తిక్క‌గా వ‌సుధార‌తో మాట్లాడుతాడు. వ‌సుధార కోప్ప‌డ‌టంతో ఫోన్‌ను చ‌క్ర‌పాణికి ఇచ్చేసి రాజీవ్ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు.

మ‌నుపై ఫైర్‌...

ఏంజెల్ కార్ స్టార్ట‌వ్వ‌క‌పోవ‌డంతో ఇబ్బంది ప‌డుతుంటుంది. తాను రిపేర్ చేస్తాన‌ని మ‌ను అంటాడు. నువ్వేమైనా మెకానిక్‌వా అంటూ అత‌డిపై అనుప‌మ సెటైర్ వేస్తుంది. మ‌ను కార్ రిపేర్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ప‌ట్టుప‌డుతుంది. క్యాబ్‌లో వెళ‌దామ‌ని ఏంజెల్‌తో చెబుతుంది.

మ‌ను టాపిక్ రాగానే అనుప‌మ సీరియ‌స్‌గా మారిపోవ‌డం ఏంజెల్ గ‌మ‌నిస్తుంది. మ‌ను ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారి ఎందుకు కోపంగా మారిపోతున్నావో చెప్పాల‌ని అనుప‌మ‌ను నిల‌దీస్తుంది ఏంజెల్‌. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఏదైనా రిలేష‌న్ ఉందా, ఇద్ద‌రికి గ‌తంలో ప‌రిచ‌యం ఉందా అని అడుగుతుంది. గొడ‌వ‌ల వ‌ల్ల విడివిడిగా ఉంటున్నారా చెప్ప‌మ‌ని అనుప‌మ గ‌ట్టిగా అడుగుతుంది ఏంజెల్‌.

టాపిక్ డైవ‌ర్ట్‌...

ఏమైనా ఉంటే నేనే చెప్పేదానిని క‌దా అని అనుప‌మ టాపిక్ డైవ‌ర్ట్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. మీ ఇద్ద‌రు ఏదో దాస్తున్నారు. అది మీ క‌ళ్ల‌ల్లో క‌నిపిస్తుంది. మీ గ‌తం ఏమిటో నాకు ఇప్పుడే తెలియాల‌ని ఏంజెల్ ప‌ట్టుప‌డుతుంది.

నేను ఒంట‌రిదానిని, నాకు ఏం గ‌తం లేద‌ని అనుప‌మ కోపంగా బ‌దులిస్తుంది. ఆమె మాట‌ల‌తో మ‌ను బాధ‌ప‌డ‌తాడు. ఈ డిస్క‌ష‌న్ ఇక అవ‌స‌రం అని అనుప‌మ స‌మాధాన‌మిస్తుంది. మీరు ఒక్క‌డి నుంచి వెళ్లొచ్చు అని కోపంగా మ‌నుతో అంటుంది అనుప‌మ‌. వారి మ‌ధ్య జ‌రుగుతోన్న డిస్క‌ష‌న్‌ను దూరం నుంచి వ‌సుధార చూస్తుంది.

వ‌సుధార‌, మ‌ను ఫొటోలు...

వ‌సుధార‌, మ‌ను క్లోజ్‌గా దిగిన ఫొటోల‌ను సీక్రెట్‌గా కాలేజీ మొత్తం అంటిస్తాడు రాజీవ్‌. కొత్త ప్రేమ జంట అని ఫొటోల‌పై రాస్తాడు. నీ ప‌రువు బ‌జారులో పెడుతున్నందుకు చాలా బాధ‌గా ఉంది. త‌ప్పు అని తెలిసిన త‌ప్ప‌డం లేద‌ని వ‌సుధార‌ను ఉద్దేశించి రాజీవ్ మ‌న‌సులో అనుకుంటాడు. మ‌ను అడ్డు త‌ప్పించి నిన్ను నా సొంతం చేసుకోవ‌డానికే ఇలా చేస్తున్నాన‌ని అంటాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner