Guppedantha Manasu February 9th Episode: వసుధార లైఫ్‌లోకి కొత్త విలన్ - రాజీవ్ టార్చర్ -కోడలికి అండగా మహేంద్ర
Guppedantha Manasu February 9th Episode:నేటి గుప్పెడంత మనసు సీరియల్ రిషిని తల్చుకొని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. రిషి తనను ఒంటరివాడిని చేసి జగతి దగ్గరకు వెళ్లిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తాను కూడా బతకలేనని అనుపమతో చెబుతాడు. చనిపోవాలని ప్రయత్నిస్తాడు.
Guppedantha Manasu February 9th Episode: వసుధార మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యిందని కాలేజీలో ప్రచారం చేస్తాడు శైలేంద్ర. ఎండీ సీట్‌ను తనకు అప్పగించాలని వసుధారను బెదిరిస్తాడు.జగతి, రిషి అడ్డు తొలగించినట్లుగానే మిగిలిన ఆత్మీయులను నీకు దూరం చేస్తానని వసుధారను భయపెడతాడు. శైలేంద్ర వార్నింగ్‌లకు వసుధార భయపడదు. శైలేంద్ర చెంప పగలగొడుతుంది. తన క్యాబిన్ మెడపట్టి గెంటిస్తానని అవమానిస్తుంది.
రిషి జ్ఞాపకాలు...
రిషి దూరమైన బాధను తట్టుకోలేకపోతాడు మహేంద్ర. మళ్లీ మందు తాగాలని నిర్ణయించుకుంటాడు. బాటిల్ ఓపెన్ చేసి మందు తాగబోతుండగా అనుపమ అడ్డుకుంటుంది. బాటిల్ లాగేసుకుంటుంది. రిషి దూరమైన నిజాన్ని తల్చుకుంటే నా గుండె ఆగిపోయేలా ఉందని మహేంద్ర బాధపడతాడు. రిషి నా జీవితం, వాడే నా ప్రాణం. నా ప్రేమకు సాక్ష్యం రిషి అని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. జగతి నాకు దూరమైనప్పుడు నేను బతికింది రిషి కోసమే. పసితనంలోనే వాడు నాకు అండగా నిలిచాడు. బాధలో ఉన్నప్పుడు నా భుజం తట్టాడని రిషి జ్ఞాపకాల్ని గుర్తుచేసుకుంటాడు మహేంద్ర. రిషి ఒక అద్భుతం. వాడు నా బంగారం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
జగతి దగ్గరకు వెళ్లిన రిషి...
రిషి ఒక్క క్షణం కనిపించకపోతే నా మనసు కుదురుగా ఉండదు. అలాంటి రిషి శాశ్వతంగా దూరమయ్యడనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, బాధను తట్టుకోవడానికి తానే తాగాల్సిందేనని మహేంద్ర పట్టుపడతాడు. రిషికి అమ్మ జగతి అంటే ప్రాణమని, అందుకే నన్ను ఒంటరిగా వదిలేసి జగతి దగ్గరకు రిషి వెళ్లిపోయాడని మహేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. నాకు ఈ జీవితం వద్దు, నేను ఎవరి కోసం బతకాలి అని ఎమోషనల్ అవుతాడు మహేంద్ర. పక్కనే ఉన్న చెట్టుకు తన తలను గట్టిగా కొట్టుకోవడం మొదలుపెడతాడు. అది చూసి అనుపమ కంగారు పడుతుంది. మహేంద్రను ఆపడానికి ప్రయత్నిస్తుంది. నేను నా రిషి దగ్గరకు వెళతానని పట్టుపడతాడు. నువ్వు వసుధార కోసమైనా బతికి ఉండాలి. తనకు తోడుగా ఉండి ధైర్యం చెప్పాలని మహేంద్రకు నచ్చచెబుతుంది వసుధార.
రిషి కోసం ఎన్నో కష్టాలు...
రిషి తన ప్రాణమని వసుధార అనుకుంది. అతడి కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది. చివరకు తన ప్రేమను గెలిపించింది. రిషి చనిపోయాడంటే వసుధార నమ్మడం లేదు. ఫొటోకు వేసిన దండ కూడా తీసేసింది. రిషి బతికి ఉన్నాడనే భ్రమ నుంచి వసుధారను బయటకు నువ్వు మాత్రమే తీసుకురాగలవని మహేంద్రతో అంటుంది అనుపమ. మనల్ని నమ్మకున్న వసుధార కోసమైన నిబ్బరంగా ముందుకు సాగాలని మహేంద్ర వారించి తిరిగి ఇంటికి తీసుకెళుతుంది.
రాజీవ్ ప్రత్యక్షం...
రిషి గురించి ఆలోచిస్తూ వసుధార బాధపడుతుంటుంది. అప్పుడే పూలదండతో గుమ్మంలో రాజీవ్ అడుగుపెడతాడు. రాజీవ్‌ను చూడగానే చక్రపాణి ఆవేశానికి లోనవుతాడు. ఎందుకొచ్చావ్ ఇక్కడికి అని నిలదీస్తాడు. మరదలు దుఃఖంలో ఉంటే రాకుండా ఎలా ఉండగలను. రిషి పోయిన బాధ నుంచి వసుధారను బయటకు తీసుకొచ్చే బాధ్యత నాపైనే ఉంది. తనను నేనే కదా ఓదార్చాలని చక్రపాణికి బదులిస్తాడు రాజీవ్. అయినా చక్రపాణి ఆవేశం తగ్గదు. మీరు నాకు మళ్లీ పిల్లను ఇచ్చే మామ. మీరు అనవసరంగా ఆవేశపడటం మంచిది కాదని రాజీవ్ కూల్‌గా బదులిస్తాడు.
రిషి ఫొటోకు దండ...
రిషి ఫొటోకు దండ వేద్దామంటే ఎక్కడ కనిపించడం లేదేంటి అని వసుధారను అడుగుతాడు రాజీవ్. రిషి బతికే ఉన్నాడని వసుధార బదులిస్తుంది. అది నీ ఊహ మరదలు పిల్లా...అందులో నుంచి బయటకు రా, మరి పిచ్చిదానిలా ప్రవర్తించకు అని వసుధారతో అంటాడు రాజీవ్. ఒకవేళ రిషి బతికే ఉంటే అతడిని ఇప్పుడే ఇక్కడకు రమ్మనమని రాజీవ్ పట్టుపడతాడు. ఒకవేళ నువ్వు కోరుకుంటున్నట్లు రిషి వస్తే అతడి మెడలో ఈ దండ వేసి స్వాగతం పలుకుతాను. లేదంటే ఫొటోకు దండ వేసి సంతాపం తెలుపుతానని వసుధారతో అంటాడు రాజీవ్.
చక్రపాణి ఆవేశం...
రిషి లేడని నువ్వేం బాధపడకు. నీకు నేను ఉన్నా. రిషి లేనప్పుడు ఇంకా ఈ ఇంట్లో ఉండటం ఎందుకు. నాతో పాటు వచ్చేయ్ అంటూ వసుధార చేయిపట్టుకోబోతాడు రాజీవ్. అతడిని చక్రపాణి అడ్డుకుంటాడు. నువ్వు ఇంకో క్షణం ఇక్కడే ఉంటే నిన్ను చంపి నేను జైలుకు వెళ్తానని రాజీవ్‌ను బెదిరిస్తాడు చక్రపాణి. రాజీవ్ మాత్రం అతడి బెదిరింపులకు భయపడడు. నాకు ఏమన్నా అయితే వసుధార ఒంటరిదైపోతుంది. ఇప్పుడు నా అవసరం వసుకు చాలా ఉంది. నేను నా కోసం కాకపోయినా వసుధార కోసమైనా ప్రాణాలతో బతికి ఉండాలని రాజీవ్ అంటాడు.
దండ విసిరికొట్టిన వసు...
రాజీవ్‌ను కొట్టబోతాడు. చక్రపాణి. అతడిని వసుధార అడ్డుకుంటుంది. కుక్కలు మెరిగినంత మాత్రానా మనం ఆవేశపడి చేయిచేసుకుంటే ఎలా...వద్దు అని తండ్రిని వారిస్తుంది. నా మీద చేయిపడితే నువ్వు చూస్తూ ఉండలేవని అర్థమవుతుంది అని వసుధార మాటల్ని తనకు అనుకూలంగా మార్చుకుంటాడు రాజీవ్. అక్కడే ఉన్న రిషి ఫొటోకు దండ వేయబోతాడు. దండ లేక రిషి ఫొటో బోసిపోయిందని, దండ వేస్తే నిండుగా ఉంటుంది. నాకు మనశ్శాంతిగా ఉంటుందని రాజీవ్ అంటాడు. ఫొటోకు దండ వేయబోతాడు. రాజీవ్ చేతిలో నుంచి దండ తీసుకొని విసిరికొడుతుంది వసుధార.
వసుధార బెదిరింపు...
నువ్వు ఇంకో క్షణం ఇక్కడే ఉంటే పోలీసులకు ఫోన్ చేస్తానని రాజీవ్‌ను బెదిరిస్తుంది వసుధార. ఆమె మాటలకు రాజీవ్ వెనక్కితగ్గుతాడు. ఇప్పుడు వెళ్లి మళ్లీ వస్తానని అంటాడు. నీ తలకు దెబ్బ తగిలింది కదా ఇప్పుడు ఎలా ఉందని రాజీవ్ అంటాడు. దాంతో తనను కొట్టి రిషిని కిడ్నాప్ చేసింది రాజీవ్ అని చక్రపాణి అనుమానపడతాడు. గతంలో రాజీవ్ తనను ఇబ్బంది పెట్టిన విషయం తండ్రితో చెబుతుంది వసుధార.
రిషి ఆలోచనలు...
రిషి ఆలోచనలో వసుధార భోజనం కూడా చేయకుండా కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుండిపోతుంది. ఆమెకు మహేంద్ర, అనుపమ కలిసి అన్నం తినిపించాలని అనుకుంటారు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.