Guppedantha Manasu March 1st Episode: వసుకు తోడుగా ఉంటానన్న మను - కోడలికి మహేంద్ర క్షమాపణలు - ఏంజెల్ రీఎంట్రీ
Guppedantha Manasu March 1st Episode: మను మంచితనాన్ని వసుధార అర్థం చేసుకుంటుంది. రిషి విషయంలో మను చేసిన సహాయానికి అతడికి థాంక్స్ చెబుతుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu March 1st Episode: రిషికి కర్మకాండలు జరిపించి వసుధారను దెబ్బకొట్టాలనే ప్లాన్ చేస్తాడు శైలేంద్ర. కానీ మను సహాయంతో శైలేంద్ర ప్లాన్‌ను అడ్డుకుంటుంది వసుధార. మనుపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. అతడికి వార్నింగ్ ఇస్తాడు. ఇక నుంచి నా టార్గెట్ నువ్వే, నీ అంతు చూస్తానని హెచ్చరిస్తాడు. కానీ శైలేంద్ర బెదిరింపులకు మను భయపడడు. ఇన్నాళ్లు తాను లేకపోవడంతో నీ వెధవవేషాలు చెల్లుబాటు అయ్యాయని ఇక నుంచి లెక్క వేరు అని రివర్స్ వార్నింగ్ ఇస్తాడు.
అనుపమ క్లాస్...
రిషికి కర్మకాండలు రహస్యంగా ఎందుకు జరిపించాల్సివచ్చిందో చెప్పమని మహేంద్రను నిలదీస్తుంది అనుపమ. రిషి ఫొటోకు దండ వేస్తేనే వసుధార భరించలేదు. కర్మకాండలు జరిపిస్తే ఆమె ఏమైపోతుందోనని ఎందుకు ఆలోచించలేదని క్లాస్ ఇస్తుంది.
మహేంద్రకు వసుధార సపోర్ట్‌గా నిలుస్తుంది. రిషికి కర్మకాండలు జరిపించే విషయంలో మామయ్య తప్పేం లేదని అంటుంది. శైలేంద్ర ఈ కుట్ర చేసినట్లు చెబుతుంది. ఆచారాలు, సంప్రదాయాల పేరుతో ఫణీంద్ర, మహేంద్రలను నమ్మించి రిషికి కర్మకాండలు జరిపించే ప్రయత్నం చేశారని నిజాలను భయటపెడుతుంది.
మహేంద్ర క్షమాపణలు..
ఫణీంద్ర మాటలకు ఎదురుచెప్పలేక మామయ్య రిషికి కర్మకాండలు జరిపించడానికి ఒప్పుకున్నాడని అనుపమతో అంటుంది వసుధార. ఆమె మాటలతో మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. వసుధారకు క్షమాపణలు చెబుతాడు. నేను తప్పు చేశాను...కానీ అది తప్పక చేశాను. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు అని అంటాడు.
అయినా మహేంద్రను తప్పు పడుతూనే ఉంటుంది అనుపమ. ఆమె మాటల ధాటిని వసుధార ఆపేస్తుంది. ఈ విషయం ఇక్కడితో ఆపేయమని, మహేంద్రను తప్పు పట్టడం సరికాదని అనుపమకు సర్ధిచెబుతుంది. నన్ను నా ప్రేమను నమ్మండి అని మహేంద్రతో చెబుతుంది వసుధార.
రిషి ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉన్నాడని, అతడిని మూడు నెలల్లో తిరిగి తీసుకొస్తానని మహేంద్రకు మరోసారి మాటిస్తుంది. రిషి రాక కోసం ఓపికతో ఎదురుచూడమని చెబుతుంది.
మహేంద్ర ఎమోషనల్...
రిషి బతికి ఉన్నాడో, చనిపోయాడో తెలియక మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. వసుధార అన్నట్లు నువ్వు బతికే ఉన్నావా, అది నిజం అవుతుందా అని తనలో తానే అనుకుంటాడు. డాడ్ అనే పిలుపు విని చాలా రోజులైందని, ఆ పిలుపు వినాలని తన మనసు పరితపిస్తుందని, రిషి ఫొటో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎటుచూసిన నీ జ్ఞాపకాలే కనిపిస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ధరణి సెటైర్స్...
శైలేంద్ర రూమ్‌లోకి రాగానే అతడి బెడ్‌పై నాలుగు బెల్టులు కనిపిస్తాయి. అవి మీకోసమే పెట్టానని, చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని భర్తపై సెటైర్ వేస్తుంది ధరణి. వెన్నకూడా రెడీగా ఉందని, మీరు బెల్టుతో కొట్టుకోవడమే ఆలస్యమని అంటుంది. ధరణి వెటకారం శైలేంద్రతో పాటు దేవయాని సహించలేకపోతారు. ప్రతిసారి లాగే ఈ సారి కూడా తమ ప్లాన్ చివరి నిమిషంలో ఫెయిలవ్వడం తట్టుకోలేకపోతారు. మను వల్లే తమ ప్లాన్ బెడిసికొట్టిందని శైలేంద్ర కోపంగా ఉంటాడు.
వసుధార ఛాలెంజ్...
రిషి బతికిలేకపోయినా మూడు నెలల్లో తీసుకొస్తానని వసుధార ఎందుకు ఛాలెంజ్ చేసిందో దేవయాని అంతుపట్టడు. అదే విషయం కొడుకుతో అంటుంది. నా బొంద తీసుకొస్తుంది అంటూ శైలేంద్ర అసహనం వ్యక్తం చేస్తాడు. చనిపోయిన వాడిని ఎక్కడి నుంచి తీసుకొస్తుందంటూ కోప్పడుతాడు. అవన్నీ ఉత్తి మాటలే అంటూ కొట్టిపడేస్తాడు.
ఫణీంద్ర కౌంటర్...
రిషి బతికి ఉన్నాడని వసుధారకు అంత నమ్మకం ఏమిటని శైలేంద్రతో అంటుంది దేవయాని. తను మీలా ఆలోచించదు కాబట్టి అని ఫణీంద్ర బదులిస్తాడు. అతడిని చూసి శైలేంద్ర, దేవయాని షాకవుతారు. వచ్చి రావడంతోనే దేవయానికి క్లాస్ ఇస్తాడు. రిషి ఉన్నాడని వసుధార నమ్ముతుంది. మీరు కూడా నమ్మండి అని అందరికి చెప్పాను. అయినా మీరు నా మాటలను లెక్కచేయడం లేదని ఇద్దరికి క్లాస్ ఇస్తాడు. మీరిద్దరు ఏదో దాస్తున్నారు.
రిషి గురించి మీకు ఏమైనా తెలుసా...మీ మాటల వెనుక ఉన్న అర్థం ఏమిటని క్లాస్ పీకుతాడు. అర్థాలు, పరమార్థాలు ఏం లేవని, రిషి గురించి మీకు ఎంత తెలుసో నాకు అంతే తెలుసు అంటూ భర్తను నమ్మించే ప్రయత్నం చేస్తుంది దేవయాని. నిజం దాచి దేవయాని టాపిక్ డైవర్ట్ చేస్తుందని ఫణీంద్ర గ్రహిస్తాడు.
మీరు మారరు అంటూ చీదరించుకుంటాడు. మీరు మారకపోయిన పర్వాలేదు కానీ వసుధారను ఇబ్బందిపెట్టే పనులు చేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తాడు.
మనుకు థాంక్స్...
మను కోసం అతడి క్యాబిన్‌కు వస్తుంది వసుధార. కానీ మను క్యాబిన్‌లో కనిపించడు. మను ఎక్కడికి వెళ్లాడా అని ఆలోచిస్తుండగా అప్పుడే అతడు క్యాబిన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. రిషి తన క్యాబిన్‌లోకి రావడం చూసి ఆశ్చర్యపోతాడు. రిషి బతికి ఉన్నాడని తన కుటుంబసభ్యులను నమ్మించడానికి మీరు ఎంతో సహాయం, మీరు నాకు అండగా నిలవడం మంచిదైందని మనుతో అంటుంది వసుధార.
అతడికి థాంక్స్ చెబుతుంది. మీ ప్రేమ గొప్పది, వెలకట్టలేనిది, విలువైనది. మీ ప్రేమను, నమ్మకాన్ని నిలబెట్టాలని మీకు సపోర్ట్‌గా నిలబడ్డానని వసుధారకు చెబుతాడు మను. ఇన్నాళ్లు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని, మీతో చాలా సీరియస్‌గా, తప్పుగా మాట్లాడానని ఆ విషయంలో క్షమించమని మరోసారి మనును కోరుతుంది వసుధార. మీరు కావాలనే అలా మాట్లాడలేదని, కాలేజీకి నేను ఏమైనా నష్టం కలిగిస్తానని అనుకొని అలా మాట్లాడారని అర్థం చేసుకున్నానని మను అంటాడు.
ఏంజెల్ రీఎంట్రీ...
అనుపమకు ఏంజెల్ ఫోన్ చేస్తుంది. తాను డీబీఎస్‌టీ కాలేజీకి వస్తున్నట్లు చెబుతుంది. ఎందుకు వస్తున్నావని అనుపమ అడిగిన ప్రశ్నకు అక్కడికి వచ్చిన తర్వాతే సమాధానం చెబుతానని ఏంజెల్ ఫోన్ కట్ చేస్తుంది. మనును కలుస్తాడు మహేంద్ర.
ఇంతకుముందు నేను బాధలో ఉన్నప్పుడు నేను ఉన్నాను. మీరు ధైర్యంగా ఉండిండి అని రిషి అండగా నిలబడేవాడు. ఆ ధైర్యం చాలా రోజుల తర్వాత మళ్లీ నిన్ను చూసిన తర్వాతే వచ్చిందని మనుతో అంటాడు మహేంద్ర. నేను మీ ఫ్యామిలీ మెంబర్‌నే అని మీరు అన్నారు...మన అనుకున్నవాళ్లు కష్టాల్లో ఉంటే చూస్తూ తాను ఎలా ఊరుకుంటానని మను బదులిస్తాడు.
వసుధారకు అండగా...
రిషి ఉన్నాడని వసుధార ఎంత గట్టిగా నమ్ముతుందో ...ఆమె నమ్మకాన్ని నువ్వు బలంగా నమ్ముతున్నావని అర్థమైందని మనుతో అంటాడు మహేంద్ర. వసుధార చెబుతుంది నిజమేమోనని అనిపిస్తుందని మను సమాధానమిస్తాడు. రిషి విషయంలో, ఈ కాలేజీ విషయంలో వసుధారకు సాయం చేయమని, ఆమెకు అండగా నిలబడమని మనును రిక్వెస్ట్ చేస్తాడు మహేంద్ర. వసుధారకు ప్రతి విషయంలో సాయం చేస్తానని మహేంద్రకు మాటిస్తాడు మను.