Guppedantha Manasu February 24th Episode: గుప్పెడంత మనసు.. వసుధార మహేంద్రకు గొడవ.. శైలేంద్ర కొత్త ప్లాన్, ఫణీంద్రతో అమలు
Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్ ఫిబ్రవరి 24వ తేది ఎపిసోడ్‌లో వసుధార మహేంద్ర విడిపోయేలా శైలేంద్ర, దేవయాని కొత్త ప్లాన్ వేస్తారు. అది కూడా ఫణీంద్రతో అమలు జరిపించేలా చేస్తారు. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..
Guppedantha Manasu Serial Episode 1008: గుప్పెడంత మనసు సీరియల్‌లో మనును మహేంద్ర ఇంటికి భోజనానికి ఎందుకు పంపించావ్. నేను ఫోన్ చేసినప్పుడు అయినా ఆ విషయం చెబితే అయిపోయేది కదా అని పెద్దమ్మపై ఫైర్ అవుతుంది అనుపమ. దాంతో ఫోన్‌లో అనుపమ పెద్దమ్మ నవ్వుతూ ఉంటుంది. ఏంటీ సైలెంట్‌గా ఉన్నావని అనుపమ అడిగితే.. నీకు ఇంతకుముందు మను ఒకరి ఇంటికి భోజనానికి వెళ్తున్నాడని చెబితే నువ్వేం ఏం అన్నావ్ అని పెద్దమ్మ అడుగుతుంది.
అరిచేసిన అనుపమ
దాంతో తను మను భోజనానికి వెళ్తున్న విషయం గుర్తుకు తెచ్చుకుంటుంది అనుపమ. తను ఎవరి ఇంటికైనా వెళ్లని. కావాల్సి వస్తే అక్కడే ఉండమను అని విసుగ్గా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది అనుపమ. దాంతో నువ్ ఎప్పుడు ఇరకాటంలో పెడతావ్ పెద్దమ్మా అని ఫోన్ కట్ చేస్తుంది అనుపమ. అయ్యయ్యో.. అనుపమ అని అరుస్తుంది పెద్దమ్మ. ఈ అనుపమ ఏంటో అస్సలు అర్థం కాదు. ఇక మను కూడా అంతే.. ఏం అర్థం కాడు. వీళ్లను నేను ఎప్పుడు అర్థం చేసుకుంటానో అని అనుపమ పెద్దమ్మ అనుకుంటుంది.
మరోవైపు భోజనాలు ఎలా ఉన్నాయి మను అని మహేంద్ర అడుగుతాడు. చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంటి తిన్నట్లు ఉంది. చాలా కాలం తర్వాత సంతృప్తిగా భోజనం చేసినట్లు ఉంది అని మను అంటాడు. అప్పుడే అనుపమను చూపిస్తారు. అనుపమను చూస్తూ మను చెబుతాడు. దీంతో అంతా ఎమోషనల్ అవుతారు. మహేంద్ర కలుగజేసుకుని.. మా అనుపమ వంటకాలు మీ అమ్మ వంటల్లా అనిపించాయంటావ్ అని అంటాడు.
ఆసక్తి ఉంటుంది కదా
మా కాలేజీకి నువ్ చాలా హెల్ప్ చేశావ్. అది జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. కాలేజీ డైరెక్టర్ అయ్యావ్. మా ఇంట్లో ఒకడిగా కూడా అయ్యావ్. కానీ, నీ గురించి మాకు ఏం తెలియదు. నువ్ ఏం చెప్పట్లేదు అని మహేంద్ర అంటాడు. దాంతో మను సైలెంట్‌గా ఉంటాడు. నీకు చెప్పాలని లేకపోతే వద్దు. నీకు కంఫర్ట్ ఉన్నప్పుడే చెప్పు. లేకుంటే వద్దనిపిస్తే చెప్పకు. మనకు కావాల్సిన వాళ్ల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది కదా అందుకే అడిగాను. నిన్ను ఇబ్బంది పెట్టాలను కాదు. ఏది ఏమైనా మన బంధం ఇలాగే ఉంటుంది అని మహేంద్ర అంటాడు.
ఎందుకుంటే ఇది మా రిషి కాలేజీ. తను ఎన్నో కలలు కన్నాడు. నువ్ కాలేజీ దూరం కాకుండా చేశావ్ అని మహేంద్ర అంటాడు. రిషినే కాలేజీని కాపాడుకున్నాడు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ వంటి మంచి పనులే ఆయనకు తిరిగి వచ్చాయి. కానీ, ఇలా ప్రతిసారీ నన్ను పొగడకండి. నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పిన మను బయలుదేరుతాడు. వెళ్లేటప్పుడు అనుపమను చూస్తూ వెళ్లిపోతాడు. అనుపమ సైలెంట్‌గా ఉంటూ మనును ఆప్యాయంగా చూస్తుంది. అది వసుధార గమనిస్తుంది.
ఏదో బంధం ఉంది
అనంతరం రాత్రి అనుపమ, మను గురించి ఆలోచిస్తుంది వసుధార. వాళ్లిద్దరి మధ్య ఏదో బంధం ఉంది. మరి అలా అయితే అనుపమ మేడమ్ ఎందుకు చెప్పలేదు. మను కనిపించినప్పుడుల్లా సైలంట్ అవుతున్నారు. ఏదో ఎమోషన్ కనిపిస్తుంది. మనుపై అనుపమకు తల్లి ప్రేమ కనిపిస్తుంది. కానీ, అనుపమ మేడమ్‌కు పెళ్లి కాలేదని చెప్పారు. కాబట్టి తల్లి కొడుకులు కారు. కానీ, ఇద్దరి మధ్య ఏదొ గతం అయితే ఉంది. మేము ఇంతకుముందు ఏంజిల్ ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అలా ఉంటున్నట్లు అనిపిస్తుంది అని వసుధార అనుకుంటుంది.
ఒకవైపు అనుపమ, మరోవైపు మను ఒకరినొకరు మనుసులోనే ప్రశ్నలు వేసుకుంటారు. నేను ఎవరో చెప్పండి అని మను అంటే.. ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావని అనుపమ అంటుంది. ఎవరు ఇబ్బంది పెడుతున్నారు. నేనా. నాకు ఇప్పుడు అడ్రస్ లేదు. నేను ఎవరో నాకే తెలియదు అని మను అంటాడు. నేను చేసింది తప్పే. కానీ, నామీద ఇలా పంతం నెగ్గించుకుందామనుకుంటున్నావా అని అనుపమ అంటుంది. పంతం కాదు. అది నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను అని మను అంటాడు.
టైమ్ వచ్చినప్పుడు
ఆప్యాయతలు బంధాలు ఎవరు దూరం చేసుకున్నారు. నాపై ఎందుకు ద్వేషం అని మను అంటాడు. అది ద్వేషం కాదు. భయం. నిజాలు ఎక్కడ తెలుస్తాయో అనే భయం. విధి ఆడే వింతనాటకంలో నేను కీలు బొమ్మను అయ్యాను. నీకు నిజాలు టైమ్ వచ్చినప్పుడు తెలుస్తాయని అనుపమ అంటుంది. చూస్తుంటే మను అనుపమ కొడుకు అని తెలుస్తోంది. అయితే అనుపమకు మను మహేంద్ర ద్వారా పుట్టాడనే అనుమానాలు కలుగుతున్నాయి. అందుకే నిజం తెలిస్తే బాగుండదని మనను అనుపమ దూరం పెడుతున్నట్లు అర్థం అవుతోంది.
మహేంద్రకు ఫణీంద్ర కాల్ చేసి ఓ విషయం చెప్పాలని అంటాడు. దేని గురించో చెప్పండి. ఫోన్‌లో చెప్పండి అని మహేంద్ర అంటాడు. సరే అన్నయ్య కాలేజీలో కలుద్దాం అని మహేంద్ర అంటాడు. కాలేజీలో వద్దు. ఇంట్లో ఉన్నాను. ఇంటికి రా. అంతేకాదు ఒంటరిగా రా. ఎవరినీ తీసుకురాకు అని ఫణీంద్ర సీరియస్‌గా చెబుతాడు. ఏంటీ అన్నయ్య ముఖ్యమైన విషయం అని అంటున్నారు అని ఆలోచిస్తాడు మహేంద్ర. మరోవైపు సూపర్ నాన్నా.. ఈ దెబ్బతో వసుధార గిలగిల కొట్టుకుంటుంది అని దేవయాని అంటుంది.
డాడీతో ప్లాన్ చేయించాం
లేకపోతే ఆ వసుధార నాతోనే ఆడుకుంటుందా అని శైలేంద్ర అంటాడు. నీ బుర్ర సూపర్ నాన్న. ఇన్ని ఐడియాలు పెట్టుకుని అలా ఎందుకు ఏడ్చావ్ అని దేవయాని అంటుంది. అది ఏడుపు కాదు మమ్మీ. ఎమోషన్. ఎండీ సీటుపై ఎమోషన్. ఇప్పుడు ఆ ఎండీ సీటు నాకు వస్తుంది. ఆ వసుధార ఒంటరి అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్లాన్ అస్సలు మిస్ కాకుడదు అని శైలేంద్ర అంటాడు. నువ్ మీ డాడీతో ప్లాన్ చేశావ్ కదా. మీ నాన్న మాట మహేంద్ర కాదనడు. ఒకవేళ కాదంటే నేను రంగంలోకి దిగుతాను. నాటకంతో అంతా రక్తీ కట్టిస్తాను అని దేవయాని అంటాడు.
తర్వాత మహేంద్రకు ఫణీంద్ర కాల్ చేసిన విషయం గురించి మాట్లాడుకుంటారు. ఈ ప్లాన్ వసుధారకు ఎప్పుడు తెలియ కూడదు. పూర్తి అయ్యాకే తెలియాలి అని శైలేంద్ర అంటాడు. అలాగే జరుగుతుంది. దీని వల్ల మహేంద్ర, వసుధార మధ్య మనస్పర్థలు వస్తాయి. అందరిముందు అరుస్తుంది. దాంతో తనకు పిచ్చి పట్టిందని ఎండీ సీటులో నుంచి తొలగిస్తారు. రిషి చనిపోయాడంటేనే అంత ఎత్తున లేస్తుంది. ఇలా చేస్తే ఊరుకుంటుందా అని దేవయాని అంటుంది. అందుకే కదా ఈ ప్లాన్ వేసిందని శైలేంద్ర అంటాడు.
ఒంటరిగా రమ్మన్నారు
ప్రతిసారి ఎవరో ఒకరు రావడం కాలేజీని ఆదుకోవడం. కానీ, ఈ దెబ్బతో వసుధార, మహేంద్రకు వైరం పుట్టడం ఖాయం. ఎండీ సీటు నీకు రావడం ఖాయం అని దేవయాని అంటుంది. మరోవైపు తను ఆఫీస్‌కు కాదు. అన్నయ్య ఇంటికి వెళ్తున్నాను. నాకు కాల్ చేసి రమ్మన్నారు. నేను వెళ్లి వస్తాను అని మహేంద్ర అంటాడు. దాంతో నేను కూడా వస్తానని వసుధార అంటుంది. లేదు, నన్ను ఒంటరిగా రమ్మన్నారు అని మహేంద్ర అంటాడు. ఏదైనా ఉంటే ఫోన్‌లో చెప్పొచ్చు. నాకు ఏదో అనుమానంగా ఉందని వసుధార అంటుంది.
కాలేజీ డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు అలా చెప్పారేమో. ఏదైనా నేను చూసుకుంటాను అని శైలేంద్ర వెళ్లిపోతాడు. ఫణీంద్ర సార్ అలా ఎందుకు రమ్మన్నారు. ఇది శైలేంద్ర కుట్రనా అని అనుమానిస్తుంది వసుధార. మరోవైపు రిషికి కర్మకాండలు జరిపిద్దామని ఫణీంద్ర అంటాడు. దాంతో షాక్ అయిన మహేంద్ర సైలెంట్‌గా ఉండిపోతాడు. నేను ఏమైనా బాధ కలిగించానా అని ఫణీంద్ర అంటే.. నాకు మీరు ఎప్పుడు బాధ కలిగించరు అని మహేంద్ర అంటాడు.
మహేంద్ర వసుధారకు గొడవ
నేను అయితే రేపే రిషికి కర్మకాండలు జరిపిద్దామని అనుకుంటున్నాను అని ఫణీంద్ర అంటాడు. దాంతో మహేంద్ర మరింత షాక్ అవుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. అయితే, రిషికి మహేంద్రతో కర్మకాండలు జరిపించి అతనిపై వసుధారకు కోపం పెరిగేలా చేయాలని శైలేంద్ర, దేవయాని ప్లాన్ చేస్తారు. దాంతో మహేంద్రపై వసుధార అరిస్తే.. తనకు పిచ్చిపట్టిందని ఎండీ సీటు నుంచి తప్పించాలనేది శైలేంద్ర ప్లాన్‌గా తెలుస్తోంది.