Guppedantha Manasu Today Episode: మ‌హేంద్ర‌ను షూట్‌చేసిన మ‌ను - రిషి త‌మ్ముడు ఎంట్రీ - కాళ్ల‌బేరానికి వ‌చ్చిన శైలేంద్ర‌-guppedantha manasu april 24th episode manu shot mahendra with gun vasudhara shocks ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu Today Episode: మ‌హేంద్ర‌ను షూట్‌చేసిన మ‌ను - రిషి త‌మ్ముడు ఎంట్రీ - కాళ్ల‌బేరానికి వ‌చ్చిన శైలేంద్ర‌

Guppedantha Manasu Today Episode: మ‌హేంద్ర‌ను షూట్‌చేసిన మ‌ను - రిషి త‌మ్ముడు ఎంట్రీ - కాళ్ల‌బేరానికి వ‌చ్చిన శైలేంద్ర‌

Nelki Naresh Kumar HT Telugu
Apr 24, 2024 08:37 AM IST

Guppedantha Manasu Today Episode: మ‌ను క‌న్న తండ్రి ఎవ‌ర‌నే నిజం బ‌య‌ట‌పెట్టేస్తుంది వ‌సుధార‌. మ‌హేంద్ర‌నే త‌న తండ్రి అని తెలిసి మ‌ను ఆవేశం ప‌ట్ట‌లేక‌పోతాడు. ఆ త‌ర్వాత నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏం జ‌రిగిందంటే?

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu Today Episode: వ‌సుధార‌కు ఏంజెల్ ఫోన్ చేస్తుంది. తాను, విశ్వ‌నాథం ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి రావ‌డం లేద‌ని చెబుతుంది. మ‌ను క‌న్న తండ్రి ఉండ‌గా...మ‌హేంద్ర అత‌డిని ద‌త్త‌త తీసుకోవ‌డం విశ్వ‌నాథం భ‌రించ‌లేక‌పోతున్నాడ‌ని, అందుకే తాము ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి దూరంగా ఉండాల‌నుకుంటున్న‌ట్లు చెప్పి ఫోన్ క‌ట్ చేస్తుంది. వ‌సుధార క‌న్వీన్స్ చేసే ప్ర‌య‌త్నం చేసినా ఏంజెల్ విన‌దు.

రిషికి త‌మ్ముడు...

ఫోన్‌లో రిషి ఫొటో ఓపెన్ చేసిన వ‌సుధార‌...మ‌ను మీ బ్ర‌ద‌ర్ అంట అని ఫొటోతో చెబుతుంది. మ‌నును ఒప్పించి ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి తీసుకుర‌మ్మ‌ని త‌న‌కు మ‌హేంద్ర చెప్పిన మాట‌ల‌ను గుర్తుచేసుకుంటుంది. మ‌రోవైపు త‌న తండ్రి ఎవ‌రో త‌ల్లి చెబితేనే కానీ ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి రాన‌ని మ‌ను ప‌ట్టుప‌ట్టిన సంగ‌తిని త‌లుచుకుంటుంది. మ‌ను క‌న్న తండ్రి మ‌హేంద్ర‌నేన‌ని అనుప‌మ‌, పెద్ద‌మ్మ అంటున్నారు. మ‌నుకు ఈ నిజం ఎలా చెప్పాలి. తాను ఎవ‌రివైపు ఉండాలో తెలియ‌క వ‌సుధార సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌వుతుంది.

వ‌సుధార ధైర్యం...

మ‌ను తండ్రి మ‌హేంద్ర‌నే అనే నిజాన్ని అత‌డికి చెప్ప‌డానికి వ‌సుధార‌కు ధైర్యం స‌రిపోతుంది. ఈ నిజం చెప్ప‌డానికి త‌న‌కు ధైర్యాన్ని ఇవ్వ‌మ‌ని రిషిని కోరుకుంటుంది వ‌సుధార‌.

శైలేంద్ర సింప‌థీ డైలాగ్స్‌...

శైలేంద్ర ర‌మ్మ‌న్న చోటుకు వ‌స్తాడు మ‌హేంద్ర‌. సింప‌థీ మాట‌ల‌తో మ‌హేంద్ర‌ను త‌న దారిలోకి తెచ్చుకునేందుకు శైలేంద్ర ప్ర‌య‌త్నిస్తాడు. నేను నీ అన్న‌కొడుకునే...ఎప్ప‌టికీ మీ శైలేంద్ర‌నే అని సెంటిమెంట్ డైలాగ్స్ కొడ‌తాడు. శైలేంద్ర డ్రామాల‌ను మ‌హేంద్ర న‌మ్మ‌డు. మ‌నును ద‌త్త‌త తీసుకుంటున్న‌ట్లు మీరు చెప్పిన‌ప్ప‌టినుంచి నాన్న బాధ‌ప‌డుతున్నాడ‌ని, అమ్మ భోజ‌నం కూడా చేయ‌డం లేద‌ని మ‌హేంద్ర‌తో చెబుతాడు శైలేంద్ర‌.

మీ అమ్మ భోజ‌నం చేయ‌క‌పోతే జ‌రిగే న‌ష్టం ఏం లేద‌ని మ‌హేంద్ర బ‌దులిస్తాడు. శైలేంద్ర మ‌న‌సులోని కుట్ర‌ల‌ను మ‌హేంద్ర‌ క‌నిపెడ‌తాడు. అన్న‌య్య‌ కంటే మ‌నును నేను ద‌త్త‌త తీసుకుంటున్నందుకు నువ్వే ఎక్కువ‌గా ఫీల‌వుతున్న‌ట్లు క‌నిపిస్తున్నావ‌ని శైలేంద్ర‌ను అడుగుతాడు మ‌హేంద్ర‌.

మ‌ను బాధ‌ప‌డ‌టం చూడ‌లేను..

మ‌ను బాధ‌ప‌డ‌టం నేను చూడ‌లేదు....అత‌డికి తండ్రి లేడ‌ని నీలాంటివాళ్లు వేలెత్తి చూప‌డం నాకు న‌చ్చ‌లేదు. అందుకే అత‌డిని ద‌త్త‌త తీసుకోనున్న‌ట్లు శైలేంద్ర‌తో అంటాడు మ‌హేంద్ర‌. మ‌నును ఇక నుంచి నేను తండ్రి గురించి అస‌లు అడ‌గ‌న‌ని, మీరు మాత్రం ఈ ద‌త్త‌త కార్య‌క్ర‌మం ఆప‌మ‌ని మ‌హేంద్ర‌ను రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర‌.

దారిన‌పోయే ఎవ‌డినో తీసుకొచ్చి మ‌న సామ్రాజ్యానికి రాజును చేస్తానంటే ఊరుకునేది లేద‌ని అంటాడు. అప్ప‌టివ‌ర‌కు బ‌తిమిలాడుతున్న‌ట్లుగా మాట్లాడిన శైలేంద్ర ఒక్క‌సారిగా త‌న మాట‌తీరు మార్చ‌డం మ‌హేంద్ర క‌నిపెడ‌తాడు. ద‌త్త‌త ఆప‌క‌పోతే ఏం చేస్తావు అని నిల‌దీస్తాడు. నీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని శైలేంద్ర‌కు ధీటుగా బ‌దులిస్తాడు.

ఎంత దూర‌మైనా వెళ‌తా...

మ‌నును కొడుకుగా నెత్తిమీద పెట్టుకొని ఊరేగుతాన‌ని అంటే చూస్తూ ఊరుకోన‌ని ఎంత దూర‌మైనా వెళ‌తాన‌ని మ‌హేంద్ర‌కు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర‌. అత‌డి వార్నింగ్‌ను మ‌హేంద్ర‌ జోక్‌గా తీసుకుంటాడు. ఈ ద‌త్త‌త కార్య‌క్ర‌మం ఎలా జ‌రుగుతుందో నేను చూస్తాన‌ని కోపంగా శైలేంద్ర అంటాడు.

నువ్వు చూడాల‌నే కార్య‌క్ర‌మానికి నిన్ను ఇన్వైట్ చేశాన‌ని మ‌హేంద్ర పంచ్‌లు వేస్తాడు. కుటుంబంతో క‌లిసి ఈ వేడుక‌కు రావాల‌ని శైలేంద్ర‌కు చెబుతాడు. ద‌త్త‌త కార్య‌క్ర‌మాన్ని ఆప‌డానికి ప్ర‌య‌త్నిస్తే ఊరుకోన‌ని రివ‌ర్స్ శైలేంద్ర‌కు వార్నింగ్ ఇచ్చి అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు మ‌హేంద్ర‌.

రాజీవ్ హెల్ప్‌...

ద‌త్త‌త కార్య‌క్ర‌మం ఆప‌డానికి రాజీవ్ హెల్ప్ తీసుకోవాల‌ని ఫీక్స‌వుతాడు శైలేంద్ర‌. అత‌డికి ఫోన్ చేసి విష‌యం చెప్పాల‌నుకుంటాడు. కానీ త‌న‌కు మ‌నును మ‌హేంద్ర ద‌త్త‌త తీసుకోవాల‌ని అనుకుంటున్న క‌థ మొత్తం తెలుసున‌ని రాజీవ్ అంటాడు. అదే నీ ప్లేస్‌లో నేను ఉంటే ఈ ద‌త్త‌త కార్య‌క్ర‌మాన్ని చేస్తాన‌న్న మీ బాబాయ్‌ని, ఆ త‌ర్వాత మ‌నును లేపేసేవాడిని శైలేంద్ర‌తో అంటాడు రాజీవ్‌.

ఆ ప‌ని చేయ‌మ‌ని రాజీవ్‌ను రిక్వెస్ట్ చేస్తాడు శైలేంద్ర‌. ఎవ‌రికి స్పాట్ పెడ‌తావో, ఎవ‌రిని లేపేస్తావో నీ ఇష్టం అని అంటాడు. ఈ ప‌ని చేస్తే వ‌సుధార‌ను పువ్వుల్లో పెట్టి నీకు అప్ప‌గిస్తాన‌ని రాజీవ్‌కు ఆఫ‌ర్ ఇస్తాడు శైలేంద్ర‌.

నిజం చెప్పిన వ‌సు...

మ‌ను ద‌గ్గ‌ర‌కు వ‌స్తుంది వ‌సుధార‌. ఇన్నాళ్లుగా మీరు ఏ ప్ర‌శ్న గురించి అయితే స‌మాధానం కావాల‌ని వెతుకుతున్నారో...దానికి ఆన్స‌ర్ నాకు దొరికింద‌ని అంటుంది. మీ నాన్న ఎవ‌రో నాకు తెలిసింద‌ని మ‌నుతో అంటుంది వ‌సుధార‌. ఇన్నాళ్లు మీ కళ్ల ముందుకు తిరుగుతున్న మ‌హేంద్రనే నీకు క‌న్న తండ్రి అనే నిజం మ‌నుకు చెబుతుంది వ‌సుధార‌. . మ‌హేంద్ర‌భూష‌ణ్ నీకు నాన్న అని అంటుంది. వ‌సుధార చెప్పిన పేరు విని మ‌ను షాక‌వుతాడు. అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన మ‌హేంద్ర కూడా వ‌సుధార చెప్పిన నిజం విని త‌ట్టుకోలేక‌పోతాడు.

మ‌హేంద్ర షాక్‌...

నేను మ‌ను తండ్రినా...మ‌ను నా క‌న్న కొడుకా అంటూ ఆశ్చ‌ర‌పోతాడు మ‌హేంద్ర‌. ఈ విష‌యం నీకు ఎలా తెలుసు...నువ్వు నిజ‌మే చెబుతున్నావా అని వ‌సుధార‌ను అడుగుతాడు. పెద్ద‌మ్మ త‌న‌కు ఈ నిజం చెప్పింద‌ని వ‌సుధార అంటుంది. మ‌ను త‌న క‌న్న కొడుకే అని తెలిసి మ‌హేంద్ర ఎమోష‌న‌ల్ అవుతాడు. నువ్వు నా కొడుకువ‌ని మ‌నుతో అంటాడు.

ఇన్నాళ్లు నీతో నేను ఎందుకు ఎమోష‌న‌ల్ క‌నెక్ట్ అయ్యానో, ఎందుకు అటాచ్‌మెంట్ క‌లిగిందో ఇప్పుడు అర్థ‌మ‌య్యింద‌ని, నిజం తెలియ‌కుండానే నువ్వు నా కొడుకువ‌ని ఫీలింగ్ దేవుడు త‌న‌కు క‌లిగించాడ‌ని మ‌నుతో అంటాడు మ‌హేంద్ర‌. మ‌న మ‌ధ్య ఉన్న ర‌క్త సంబంధ‌మే మ‌న మ‌న‌సుల్ని క‌లిపించింద‌ని మ‌నుకు చెబుతాడు మ‌హేంద్ర‌.

నేను నిన్ను వ‌ద‌లుకోన‌ని కౌగించుకోబోతాడు. కానీ మ‌ను మాత్రం మ‌హేంద్ర‌ను కోపంగా నెట్టివేస్తాడు. ఇంకోసారి న‌న్ను కొడుకు అని పిల‌వ‌ద్ద‌ని చెబుతాడు. నువ్వు ఇన్నాళ్లు చూపించ‌ని ప్రేమ నాకు అక్క‌ర‌లేద‌ని చెబుతాడు. ఇన్నాళ్లు తండ్రి ఎవ‌రో తెలియ‌క నేను ప‌డ్డ అవ‌మానాలు చాల‌ని, నువ్వు చెప్పేది ఏదైనా నేను విన‌న‌ని అంటాడు.

మ‌ను ఫైర్‌...

నీ వ‌ల్ల త‌న‌ త‌ల్లి ఎంతో దుఃఖం, క్షోభ అనుభ‌వించింద‌ని, ఎన్నో అవ‌మానాలు, క‌న్నీళ్ల‌ను భ‌రించింద‌ని మ‌హేంద్ర‌తో అంటాడు మ‌ను. తండ్రి మొహం ఎలా ఉంటుందో, పేరు ఏంటో తెలియ‌కుండా పెరిగాన‌ని కోపంగా అంటాడు. నిన్ను క్ష‌మించేది లేద‌ని, నీ క్ష‌మాప‌ణ‌లు మా బాధ‌ల‌కు బ‌దులు కాద‌ని చెబుతాడు.

మ‌ను మాట్లాడిన మాట‌ల్లో న్యాయం ఉంద‌ని, ఆవేశంలో అర్థం ఉంద‌ని వ‌సుధార అంటుంది. ఇన్నాళ్లు తండ్రి ఎవ‌రో తెలియ‌క బాధ‌లు ప‌డ్డారు..ఇప్పుడు తెలిసిన త‌ర్వాత కూడా బాధ‌లు ప‌డ‌టం ఎందుక‌ని మ‌నుకు స‌ర్ధిచెప్పేందుకు వ‌సుధార కూడా ప్ర‌య‌త్నిస్తుంది. మ‌హేంద్ర‌ను దూరం పెట్ట‌డం ప‌రిష్కారం కాద‌ని అంటుంది..

త‌ప్పుల‌ను మ‌ర్చిపోయి...

అంద‌రి జీవితాల్లో త‌ప్పులు జ‌రుగుతాయ‌ని, అవే ప‌ట్టుకొని కూర్చుంటే ముందుకు వెళ్ల‌లేమ‌ని మ‌నుతో అంటుంది వ‌సుధార‌. జ‌రిగింది మ‌ర్చిపోయి అంద‌రం క‌లిసి హ్యాపీగా ఉంద‌ని అంటుంది. కానీ అలా ఉండ‌లేమ‌ని మ‌ను బ‌దులిస్తాడు. ఇన్నాళ్లు తండ్రి లేని సంతోషం ఇప్పుడు మ‌హేంద్ర రాక‌తో రాద‌ని చెబుతాడు.

తండ్రిని నిల‌దీయ‌డానికే...

తండ్రి ఎవ‌రో తెలుసుకోవాల‌ని అనుకున్న‌ది అత‌డి ప్రేమ‌ను పొంద‌డానికి కాదు...మా బ్ర‌తుకులు ఎందుకు చేశావ‌ని నిల‌దీయ‌డానికేన‌ని మ‌ను అంటాడు. లోకంలో గొప్ప తండ్రులేకాదు నీలాంటి నీచ‌మైన తండ్రులు కూడా ఉంటార‌ని చెప్ప‌డానికేన‌ని అంటాడు. మ‌రోసారి మ‌ను ద‌గ్గ‌ర‌కు రాబోతాడు మ‌హేంద్ర‌.

నువ్వు న‌న్ను ముట్టుకుంటే నిన్ను ఇక్క‌డే నిన్ను షూట్ చేస్తాన‌ని మ‌హేంద్ర‌కు వార్నింగ్ ఇస్తాడు మ‌ను. నువ్వు న‌న్ను చంపేసిన ప‌ర్వాలేద‌ని మ‌హేంద్ర అంటాడు. మ‌ను ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు. కోపం ప‌ట్ట‌లేక మ‌హేంద్ర‌ను షూట్ చేస్తాడు మ‌ను. ఒక్క‌సారిగా అనుప‌మ గ‌ట్టిగా అరుస్తుంది. అప్ప‌టివ‌ర‌కు జ‌రిగింది క‌ల అని తెలుసుకుంటుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner