Guppedantha Manasu March 30th Episode: వ‌సుధార‌ హ్యాపీ - రిషి ఆచూకీ తెలిసిందా?- శైలేంద్ర‌కు మ‌ను మాస్ వార్నింగ్‌-guppedantha manasu march 30th episode manu promises to help vasudhara for find rishi address ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu March 30th Episode: వ‌సుధార‌ హ్యాపీ - రిషి ఆచూకీ తెలిసిందా?- శైలేంద్ర‌కు మ‌ను మాస్ వార్నింగ్‌

Guppedantha Manasu March 30th Episode: వ‌సుధార‌ హ్యాపీ - రిషి ఆచూకీ తెలిసిందా?- శైలేంద్ర‌కు మ‌ను మాస్ వార్నింగ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 30, 2024 08:09 AM IST

Guppedantha Manasu March 30th Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో మ‌నును దెబ్బ‌కొట్టేందుకు మ‌రో కొత్త ప్లాన్ వేస్తారు దేవ‌యాని, శైలేంద్ర‌, తండ్రిని అడ్డం పెట్టుకొని అత‌డిని ఆట ఆడుకోవాల‌ని అనుకుంటారు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu March 30th Episode: మ‌ను, అనుప‌మ మ‌ధ్య గొడ‌వ‌ల‌ను ఉప‌యోగించుకొని డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ సీట్‌ను త‌మ సొంతం చేసుకోవాల‌ని దేవ‌యాని, శైలేంద్ర ప్లాన్ వేస్తారు. మ‌నుకు త‌న తండ్రి ఎవ‌ర‌న్న‌ది ఇప్ప‌టివ‌ర‌కు తెలియ‌క‌పోయి ఉండొచ్చ‌ని అనుమాన వ్య‌క్తం చేస్తుంది దేవ‌యాని. తండ్రి గురించి అనుప‌మ‌ను మ‌ను నిల‌దీయ‌డంతోనే వారి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రిగి ఉంటాయ‌ని అనుకుంటుంది.

తండ్రి విష‌యంలో అవ‌మానాలు...

తండ్రి విష‌యంలో చిన్న‌త‌నం నుంచి మ‌ను ఎన్నో అవ‌మానాల‌ను ఎదుర్కొని ఉండొచ్చ‌ని, స్నేహితుల మ‌ధ్య న‌వ్వుల పాలై ఉంటాడ‌ని, ఆ విష‌యాలే మ‌ను, అనుప‌మ మ‌ధ్య గొడ‌వ‌కు కార‌ణ‌మై ఉండొచ్చ‌ని దేవ‌యాని అనుమానిస్తుంది. భ‌ర్త గురించి అనుప‌మ‌ను ఎన్ని ప్ర‌శ్న‌లు అడిగినా ఆమె స‌మాధానాలు దాట‌వేసింద‌ని శైలేంద్ర‌తో అంటుంది దేవ‌యాని.

క‌నీసం మ‌నుకు అత‌డి తండ్రి పేరు తెలుసా అని తాను అనుప‌మ‌ను అడిగాన‌ని, ఆ ప్ర‌శ్న‌కు కూడా ఆమె మౌనంగా ఉంద‌ని దేవ‌యాని అంటుంది. ఆ ప్ర‌శ్న అడుగుతున్న‌ప్పుడు అనుప‌మ క‌ళ్ల‌ల్లో క‌న్నీళ్లు క‌నిపించాయ‌ని, ఆ క‌న్నీళ్ల‌లో బాధ‌, ఆవేద‌న క‌నిపించాయ‌ని చెబుతుంది. మ‌నుకు త‌న తండ్రి ఎవ‌రో తెలియ‌ద‌ని ఆమె క‌న్నీళ్ల‌తోనే అర్థ‌మైంద‌ని శైలేంద్ర‌తో అంటుంది అనుప‌మ‌.

నేనేంటో చూపిస్తా...

తండ్రి అనే వ‌జ్రాయుధంతో మ‌నును ఓ ఆట ఆడుకోవాల‌ని శైలేంద్ర ఫిక్స‌వుతాడు. కుర్రాడు బాగా రెచ్చిపోయాడు. ఇక నుంచి వాడికి నేనేంటో చూపిస్తాను. వీలు చేసుకొని మ‌రి మ‌ను ద‌గ్గ‌ర వాడి తండ్రి ప్ర‌స‌క్తి తీసుకొచ్చి పిచ్చివాడిని చేస్తాన‌ని శైలేంద్ర అంటాడు.

ఏంజెల్‌పై ఫైర్‌...

మీ కొడుకుతో క‌లిసి భోజ‌నం చేసినందుకు సంతోషంగా ఉందా అని అనుప‌మ‌ను అడుగుతుంది ఏంజెల్‌. బావ‌తో క‌లిసి భోజ‌నం చేయ‌డం ఆనందంగా ఉంద‌ని అంటుంది. మ‌నుతో క‌లిసి దిగిన సెల్ఫీని అనుప‌మ‌కు చూపించాల‌ని అనుకుంటుంది ఏంజెల్‌. కానీ ఆ ఫొటో చూడ‌టానికి అనుప‌మ ఒప్పుకోదు. అనుప‌మ ద‌గ్గ‌ర‌కు వ‌సుధార వ‌స్తుంది. మీరు మాత్ర‌మే చేయ‌గ‌ల ప‌ని ఒక‌టి ఉంద‌ని, దానిని అంగీక‌రించాల‌ని అంటుంది. నా ఇష్టాల‌తో ప‌ని లేకుండా ఈ మ‌ధ్య అన్ని ప‌నులు చేస్తున్నారుగా అంటూ వ‌సుధార‌పై సెటైర్ వేస్తుంది అనుప‌మ‌.

మ‌ను మ‌ళ్లీ కాలేజీకి రావాలి....

మ‌ను మ‌ళ్లీ కాలేజీకి రావాల‌ని, అత‌డిని మీరే ర‌మ్మ‌ని చెప్పాల‌ని అనుప‌మ‌ను అడుగుతుంది వ‌సుధార‌. మ‌ళ్లీ నువ్వు కాలేజీలో అడుగుపెడితే నేనే చ‌చ్చినంత ఒట్టే అంటూ అనుప‌మ‌ చేసిన ప్రామిస్‌ను గుర్తుచేస్తుంది వ‌సుధార‌. ఆ ప్రామిస్‌ను ప‌క్క‌న‌పెట్టి మ‌నును మ‌ళ్లీ కాలేజీని ర‌మ్మ‌ని చెప్పమ‌ని అనుప‌మ‌ను రిక్వెస్ట్ చేస్తుంది వ‌సుధార‌.

మ‌ను లేకుండా కాలేజీ న‌డ‌ప‌లేరా.. మ‌ను రాక‌ముందు కాలేజీని బాగానే న‌డిపారుగా అంటూ అనుప‌మ స‌మాధానం ఇస్తుంది. కాలేజీ క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మ‌ను ఎంత‌గానే సాయం చేశాడ‌ని అనుప‌మ‌ను బ‌తిమిలాడుతుంది వ‌సుధార‌. అయినా అనుప‌మ త‌న ప‌ట్టువీడ‌దు.

మ‌ను కాలేజీకి రావాల్సిన అవ‌స‌రం ఏముంది?

ఇప్పుడు అత‌డు కాలేజీకి రావాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటుంది. మ‌నును కాలేజీ వ‌దిలిపెట్టి ఎందుకు వెళ్లాడ‌ని ఎవ‌రైనా అడిగితే ఏం చెప్పాలి. డైరెక్ట‌ర్‌గా ఉన్న మ‌ను కాలేజీకి ఎందుకు రావ‌డం లేద‌ని అడిగితే ఏం స‌మాధానం ఇవ్వాలో మీరు చెప్పండ‌ని అనుప‌మ‌ను అడుగుతుంది వ‌సుధార‌.

వ‌సుధార ప్ర‌శ్న‌కు అనుప‌మ స‌మాధానం చెప్ప‌కుండా సైలెంట్‌గా ఉంటుంది. మ‌నును కాలేజీ నుంచి పంపించిన విధానం క‌రెక్ట్ కాద‌ని, చేసిన త‌ప్పును స‌రిదిద్ధుకోవాలంటే మ‌నును మ‌ళ్లీ కాలేజీకి ర‌మ్మ‌ని మీరే అడ‌గాల‌ని అనుప‌మ‌తో అంటుంది వ‌సుధార‌. నేను అడిగితే మ‌ను కాలేజీకి రాన‌ని అంటున్నాడ‌ని అంటుంది.

శైలేంద్ర ప్లాన్ ఫెయిల్‌...

మ‌నును రెచ్చ‌గొట్టాల‌ని కాలేజీకి వ‌స్తాడు శైలేంద్ర‌. కానీ అత‌డిని అనుప‌మ కాలేజీని నుంచి వెళ్ల‌గొట్టిన సంగ‌తి గుర్తొచ్చి డిస‌పాయింట్ అవుతాడు. కానీ అప్పుడే మ‌ను కాలేజీలో అడుగుపెడ‌తాడు. అత‌డిని చూసి శైలేంద్ర షాక‌వుతాడు. అనుప‌మ అంత తిట్టినా వీడేంటి కాలేజీకి వ‌స్తున్నాడ‌ని శైలేంద్ర అనుకుంటాడు.

సిగ్గు, శ‌రం లేకుండా అన్ని తుడిచేసుకొని నాలా మారిపోయాడా అని ఊహిస్తుంటాడు. అత‌డి ఆలోచ‌న‌ల‌ను మ‌ను క‌నిపెడ‌తాడు. త‌న‌ది నీలాంటి చీప్ క్యారెక్ట‌ర్ కాద‌ని అంటాడు. నేను కాలేజీకి రాన‌ని, ఇక నుంచి ర‌చ్చ ర‌చ్చ చేయ‌చ్చున‌ని అనుకొని ఉంటావు. కానీ అలాంటివి నేనున్నంత వ‌ర‌కు జ‌ర‌గ‌వు. మ‌రోసారి పిచ్చి పిచ్చి ప‌నులు చేస్తే పుచ్చ‌ లేచిపోతుంది జాగ్ర‌త్త అని శైలేంద్ర‌కు వార్నింగ్ ఇస్తాడు. మ‌ను వార్నింగ్‌కు శైలేంద్ర భ‌య‌ప‌డిపోతాడు.

వ‌సుధార ఆలోచ‌న‌లు...

మ‌ను కాలేజీకి వ‌స్తాడా? రాడా? అని వ‌సుధార ఆలోచిస్తుంటుంది. మ‌నును అపార్థం చేసుకున్నందుకు బాధ‌ప‌డుతుంది. ఇక‌పై కాలేజీకి మ‌ను రాడేమోన‌ని అనుకుంటుంది. ఓ ఫైల్‌పై మ‌ను సంత‌కం అవ‌స‌రం ఉంద‌ని కాలేజీ అటెండ‌ర్ చెబుతాడు.

మీరు సంత‌కం పెట్టిన త‌ర్వాత మ‌ను సార్ సంత‌కం పెడ‌తాన‌ని అన్నాడ‌ని అటెండ‌ర్ అంటాడు. అటెండ‌ర్ మాట‌ల ద్వారా మ‌ను కాలేజీకి వ‌చ్చాడ‌ని వ‌సుధార అర్థం చేసుకుంటుంది. ఆ మాట విన‌గానే ఆనంద ప‌డుతుంది. మ‌నుతో తానే ఫైల్‌పై సంత‌కం చేయిస్తాన‌ని అటెండ‌ర్‌తో అంటుంది వ‌సుధార‌.

అనుప‌మ‌కు థాంక్స్‌...

అనుప‌మ చెబితేనే మ‌ను కాలేజీకి వ‌చ్చాడ‌ని వ‌సుధార అనుకుంటుంది. అనుప‌మ‌కు ఫోన్ చేసి థాంక్స్ చెబుతుంది. వ‌సుధార ఏ విష‌యంలో థాంక్స్ చెబుతుందో అనుప‌మ‌కు అర్థం కాదు. మ‌ను తిరిగి కాలేజీకి వ‌చ్చేలా అత‌డిని ఒప్పించినందుకు మీకు థాంక్స్ చెబుతున్నాన‌ని అనుప‌మ‌తో అంటుంది వ‌సుధార‌. ఏ విష‌యంలో థాంక్స్ చెబుతున్నానో తెలిసి కూడా మీరు నాతో అవ‌న్నీ చెప్పించారు క‌దా అని అనుప‌మ‌తో అంటుంది వ‌సుధార‌.

వ‌సుకు మాటిచ్చిన మ‌ను...

తిరిగి కాలేజీకి వ‌చ్చినందుకు మ‌నుకు థాంక్స్ చెబుతుంది వ‌సుధార‌. కొంద‌రి మాట కాద‌న‌లేక కాలేజీకి వ‌చ్చాన‌ని మ‌ను అంటాడు. అమ్మ మాట ఎవ‌రూ కాద‌న‌లేర‌ని వ‌సుధార స‌మాధాన‌మిస్తుంది. అనుప‌మ చెబితేనే మీరు కాలేజీకి వ‌స్తార‌ని తెలిసి ఆమె చేత చెప్పించాన‌ని మ‌నుతో అంటుంది వ‌సుధార‌.

మీరు ఏదైనా ప‌ట్టుప‌డితే సాధించేవ‌ర‌కు వ‌ద‌ల‌ర‌ని వ‌సుధార‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తాడు మ‌ను. అన్ని అనుకున్న‌ట్లు చేసినా రిషి ఆచూకీని మాత్రం ఎంత ప్ర‌య‌త్నించిన క‌నిపెట్ట‌లేక‌పోతున్నాన‌ని వ‌సుధార బాధ‌ప‌డుతుంది. ఆ విష‌యంలో వ‌సుధార‌కు సాయం చేస్తాన‌ని మ‌ను మాటిస్తాడు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

IPL_Entry_Point