Guppedantha Manasu March 20th Episode: శైలేంద్ర టార్గెట్ మిస్ - అనుప‌మ భ‌ర్త ఎవ‌రు? - మ‌ను గొప్ప‌త‌నం తెలుసుకున్న వ‌సు-guppedantha manasu march 20th episode shailendra investigates on manu relationship with anupama ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Guppedantha Manasu March 20th Episode Shailendra Investigates On Manu Relationship With Anupama

Guppedantha Manasu March 20th Episode: శైలేంద్ర టార్గెట్ మిస్ - అనుప‌మ భ‌ర్త ఎవ‌రు? - మ‌ను గొప్ప‌త‌నం తెలుసుకున్న వ‌సు

Nelki Naresh Kumar HT Telugu
Mar 20, 2024 07:18 AM IST

Guppedantha Manasu March 20th Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో మ‌ను...అనుప‌మ క‌న్న కొడుకు అనే నిజం తెలిసి మ‌హేంద్ర‌, వ‌సుధార షాక‌వుతారు. ఈ నిజాన్ని ఇన్ని రోజులు వాళ్లు ఎందుకు దాచారో తెలుసుకోవాల‌ని ఫిక్స‌వుతారు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu March 20th Episode: మ‌నును చంపేందుకు రౌడీతో క‌లిసి కుట్ర‌ప‌న్నుతాడు శైలేంద్ర‌. మ‌నును రౌడీ పొడ‌వ‌డానికి రావ‌డం అనుప‌మ చూస్తుంది. మ‌నుపై రౌడీ ఎటాక్ చేయ‌కుండా ఆమె అడ్డుగావ‌స్తుంది. దాంతో ఆ క‌త్తి అనుప‌మ‌కు దిగుతుంది. అనుప‌మ కింద‌ప‌డిపోవ‌డంతో అమ్మ అని గ‌ట్టిగా మ‌ను అరుస్తాడు. ఆ పిలుపు విని మ‌హేంద్ర‌, వ‌సుధార‌తో పాటు అక్క‌డే చాటుగా ద‌క్కున్నా శైలేంద్ర కూడా షాక‌వుతాడు.

త‌ల్లీకొడుకుల బంధం...

అనుప‌మ‌ను హాస్పిట‌ల్‌కు తీసుకొస్తారు మ‌ను, వ‌సుధార‌, మ‌హేంద్ర‌. జ‌గ‌తిని రిషి... మేడ‌మ్ అని పిలిచిన‌ట్లుగా మ‌ను కూడా అనుప‌మ‌ను అమ్మ అని కాకుండా మేడ‌మ్ అని ఎందుకు పిలిచాడా అని వ‌సుధార ఆలోచిస్తుంటుంది. వారిద్ద‌రి మ‌ధ్య త‌ల్లీకొడుకుల బంధం ఊహించ‌లేక‌పోయాన‌ని వ‌సుధార అనుకుంటుంది. త‌న‌కు పెళ్లి కాలేద‌ని అనుప‌మ చెప్పింది. మ‌రి ఇప్పుడు కొడుకు ఎలా వ‌చ్చాడు? ఆమె భ‌ర్త ఎవ‌రు అని మ‌హేంద్ర మ‌న‌సులో అనేక ప్ర‌శ్న‌లు మొద‌ల‌వుతాయి. త‌ల్లీకొడుకులు అయి ఉండి త‌మ మ‌ధ్య ఎలాంటి రిలేష‌న్‌షిప్ లేన‌ట్లుగా ఎందుకు యాక్ట్ చేశారా అని అనుకుంటాడు.

మ‌ను ఎమోష‌న‌ల్‌...

హాస్పిట‌ల్‌లో చావు బ‌తుకుల మ‌ధ్య అనుప‌మ కొట్టుమిట్టాడుతుండ‌టంతో మ‌ను క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. అనుప‌మ‌ను ఇలా చూస్తుంటే త‌న గుండె ఆగినంత ప‌న‌వుతుంద‌ని, కాళ్లు చేతులు ఆడ‌టం లేద‌ని ఎమోష‌న‌ల్ అవుతాడు.

శైలేంద్ర క్లాస్‌...

మ‌నును కాకుండా అనుప‌మను రౌడీ క‌త్తితో పొడ‌వ‌టంతో శైలేంద్ర వేసిన ప్లాన్ మొత్తం రివ‌ర్స్ అవుతుంది. ఆ రౌడీ క్లాస్ ఇస్తాడు శైలేంద్ర‌. నీలాంటివాడికి ప‌ని అప్ప‌గించి తాను త‌ప్పు చేశాన‌ని అంటాడు. శైలేంద్ర మాట‌ల‌ను ప‌ట్టించుకోకుండా యాపిల్ తింటూ ఉంటాడు ఆ రౌడీ. టార్గెట్ మిస్స‌యిన త‌న వ‌ల్ల ప్ర‌తిసారి ఏదో ఒక కొత్త విష‌యం తెలుస్తూనే ఉందింగా అంటూ శైలేంద్ర‌కు కూల్‌గా స‌మాధాన‌మిచ్చి రౌడీ అక్క‌డినుంచి వెళ్లిపోతాడు.

మ‌ను, అనుప‌మ మ‌ధ్య ఉన్న బంధం త‌న వ‌ల్లే బ‌య‌ట‌ప‌డిన విష‌యాన్ని శైలేంద్ర‌కు గుర్తుచేస్తాడు. మ‌నుతో త‌న‌కు సంబంధం లేద‌ని...వ‌సుధార‌ను ద‌క్కించుకోవ‌డ‌మే త‌న‌కు ముఖ్య‌మ‌ని చెప్పి రాజీవ్ కూడా శైలేంద్ర టెన్ష‌న్‌ను ప‌ట్టించుకోకుండా వెళ్లిపోతాడు.

అనుప‌మ సేఫ్‌...

అనుప‌మ ప్రాణాల‌కు ప్ర‌మాదం లేద‌ని డాక్ట‌ర్లు చెబుతారు. ఆమె తొంద‌ర‌గానే స్పృహ‌లోకి వ‌స్తుంద‌ని చెబుతారు. అనుప‌మ చేసిన త్యాగం గుర్తుచేసుకొని మ‌ను క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. అనుప‌మ‌కు ఇచ్చిన మాట త‌ప్పాన‌ని అంటాడు. ఆమె వ‌ద్ద‌న్న ప‌నిచేశాన‌ని చెబుతాడు.

న‌న్ను ఇంకోసారి అమ్మ అని పిలిస్తే చ‌చ్చినంత ఒట్టు అని అనుప‌మ చేసి శ‌ప‌థం గుర్తుచేసుకుంటాడు మ‌ను. హాస్పిట‌ల్‌కు అనుప‌మ పెద్ద‌మ్మ వ‌స్తుంది. అనుప‌మ‌కు తోడుగా తాను ఉంటాన‌ని, త‌న‌కు అండ‌గా మ‌హేంద్ర‌, వ‌సుధార ఉన్నార‌ని పెద్ద‌మ్మ‌తో చెబుతాడు మ‌ను. ఆమెను హాస్పిట‌ల్ నుంచి ఇంటికి పంపిస్తాడు.

బ‌య‌ట‌ప‌డ్డ నిజాలు...

వ‌సుధార‌ను మ‌ను పీఏ క‌లుస్తాడు. వ‌సుధార‌, మ‌ను క‌లిసి ఉన్న‌ట్లుగా పోస్ట‌ర్స్ డిజైన్ చేయించింది మ‌ను కాద‌ని, రాజీవ్ అని చెబుతాడు. మీరు మ‌నును అపార్థం చేసుకున్నార‌ని జ‌రిగిన నిజాలు మొత్తం ఆధారాల‌తో బ‌య‌ట‌పెడ‌తాడు.

మ‌ను చాలా మంచి ప‌నులు చేస్తుంటార‌ని, కానీ నోరు తెరిచి ఎప్పుడు ఎవ‌రికి వాటి గురించి చెప్ప‌డ‌ని మ‌ను గొప్ప‌త‌నం గురించి అత‌డి పీఏ వ‌సుధార‌కు వివ‌రిస్తాడు. ఓ పెద్ద త‌ప్పు జ‌ర‌గ‌బోతుంటే అది జ‌ర‌గ‌కుండా మ‌నునే ఆపాడ‌ని వివ‌రిస్తాడు. కానీ మ‌నును మీరు, అనుప‌మ అనుమానించారంటూ పీఏ చెప్ప‌డంతో వ‌సుధార గిల్టీగా ఫీల‌వుతుంది. మ‌రోసారి మ‌ను విష‌యంలో త‌న అంచ‌నా త‌ప్ప‌డంతో ప‌శ్చాత్తాప‌ప‌డుతుంది.

దేవ‌యాని షాక్‌...

మ‌ను...అనుప‌మ క‌న్న కొడుకు అనే నిజం శైలేంద్ర ద్వారా తెలుసుకొని దేవ‌యాని షాక‌వుతుంది. అనుప‌మకు అస‌లు పెళ్లే కాలేద‌ని, అలాంట‌ప్పుడు త‌న‌కు కొడుకు ఉన్నాడ‌నే విష‌యాన్ని ఆమె ఎందుకు దాచిపెట్టిందో తెలుసుకోవాల‌ని దేవ‌యాని ఫిక్స‌వుతుంది. మ‌ను తండ్రి ఎవ‌రు? అత‌డు ఎక్క‌డుంటాడు? తెలుసుకుంటే మ‌న‌కు ఏదో ఒక ఉప‌యోగం ఉండేలా క‌నిపిస్తుంద‌ని కొడుకుతో అంటుంది దేవ‌యాని.

ఏంజెల్ బావ‌...

అనుప‌మ‌పై ఎటాక్ జ‌రిగిన విష‌యం తెలిసి కంగారుగా హాస్పిట‌ల్‌కు వ‌స్తుంది ఏంజెల్‌. మ‌ను, అనుప‌మ త‌ల్లీకొడుకులు అనే నిజం వ‌సుధార ద్వారా తెలిసి ఏంజెల్ కూడా షాక‌వుతుంది. త‌న‌కు కొడుకు ఉన్నాడ‌ని అత్త‌య్య ఎప్పుడు త‌న‌కు చెప్ప‌లేద‌ని ఏంజెల్ అంటుంది.

మ‌ను, అనుప‌మ మ‌ధ్య ఏదో బంధం ఉంద‌ని త‌మ అనుమానం నిజ‌మైంద‌ని వ‌సుధార‌, ఏంజెల్ అనుకుంటారు. త‌ల్లీకొడుకులు అయి ఉండి ఎందుకు ప‌రిచ‌యం లేన‌ట్లుగా యాక్ట్ చేస్తున్నారో అర్థం కావ‌డం లేద‌ని వ‌సుధార అంటుంది. మ‌ను త‌న‌కు బావ అవుతాడా అని ఏంజెల్ మ‌న‌సులో అనుకుంటుంది.

మ‌హేంద్ర ప్ర‌శ్న‌లు...

అనుప‌మ నీ త‌ల్లి అనే విష‌యం నువ్వు మా ద‌గ్గ‌ర ఎందుకు దాచావు? త‌న‌కు ఓ కొడుకు ఉన్నాడ‌నే నిజాన్ని అనుప‌మ ఎందుకు దాచిందో త‌న‌కు ఇప్ప‌డే తెలియాల‌ని మ‌నును నిల‌దీస్తాడు మ‌హేంద్ర‌. నిజాలు మొత్తం బ‌య‌ట‌పెట్టాల‌ని ప‌ట్టుప‌డ‌తాడు. అస‌లు మీ ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందో చెప్ప‌మ‌ని వ‌సుధార‌, ఏంజెల్ కూడా మ‌నును ప్ర‌శ్నిస్తారు. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

WhatsApp channel