Guppedantha Manasu March 15th Episode: మను మర్డర్‌కు శైలేంద్ర స్కెచ్ - రిషి జాడ కోసం వసు ఆరాటం - అనుపమ హర్ట్
Guppedantha Manasu March 15th Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో మను, అనుపమల మధ్య ఉన్న గతం ఏమిటో తెలుసుకోవాలని వసుధార ఫిక్సవుతుంది. అనుపమపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. వసుధార ప్రశ్నలకు అనుపమ సమాధానం చెప్పకుండా దాటవేస్తుంది.
Guppedantha Manasu March 15th Episode: వసుధారను దక్కించుకోవడానికి తాను వేస్తోన్న ప్రతి ప్లాన్‌ను మను చెడగొట్టడంతో రాజీవ్ సహించలేకపోతాడు. మనుకు వార్నింగ్ ఇవ్వాలని చూస్తాడు. కానీ రాజీవ్ వార్నింగ్‌లకు మను భయపడడు. ఇంకోసారి వసుధారతో పాటు నా గురించి తప్పుగా మాట్లాడితే చంపేస్తానని రాజీవ్‌ను హెచ్చరిస్తాడు మను.
మాటలతో చెప్పడం కాదు నిజంగానే చంపేస్తానని రివర్స్ వార్నింగ్ ఇస్తాడు. కావాలంటే నీ జాతకం చూపించుకో...పచ్చరాయి ఉంగరం పెట్టుకున్నోడి చేతిలోనే నీ ప్రాణం పోతుందని చెబుతారు అని బెదిరిస్తాడు. మను బెదిరింపులకు రాజీవ్ భయపడిపోతాడు.
వసుధార థాంక్స్...
తన బర్త్‌డేను జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసిన మనుకు ఫోన్ చేసి థాంక్స్ చెబుతుంది వసుధార. రిషి లేకుండా ఏ సెలబ్రేషన్స్ నాకు సంతోషాన్ని ఇవ్వవు. కానీ ఈ రోజు మీరు బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన తీరు రిషిని గుర్తుచేసిందని మనుతో అంటుంది వసుధార. రిషి నాకు తోడుగా ఉండి ఈ వేడుక చేసినట్లు అనిపించిందని ఎమోషనల్ అవుతుంది.
బర్త్‌డే రోజు మీరు దిగులుగా ఉండకూడదు స్పెషల్‌గా ఉండాలనే ధైర్యం చేసి బర్త్‌డేను సెలబ్రేట్ చేశానని మను సమాధానమిస్తాడు. నా మనసు మిమ్మల్ని సంతోషంగా చూడాలని అనుకుంది. అది నిజమైంది అని వసుధారతో అంటాడు మను. మీ థాంక్స్ కోసం, మెప్పు కోసం కాకుండా మీ సంతోషం కోసమే ఇదంతా చేశానని చెబుతాడు.
రిషిని వెతకడంలో సాయం...
రిషిని వెతకడంలో మీ సాయం కావాలని మనును కోరుతుంది వసుధార. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని మను మాటిస్తాడు. నా చుట్టూ చాలా మంది శత్రువులు ఉన్నారు, ఎన్నో కుట్రలు, సవాళ్లను ఎదుర్కొంటూ నన్ను నేను కాపాడుకోవడమే కాకుండా రిషిని కాపాడుకున్నాను. కానీ మళ్లీ రిషి ఏమయ్యాడో తెలియడం లేదని మనుతో అంటుంది వసుధార.
అందరూ రిషి చనిపోయాడని అంటున్నారు. కానీ నాకు మాత్రం రిషి ఎక్కడో క్షేమంగా ఉన్నాడని అపిపిస్తుందని వసుధార చెబుతుంది. రిషి బతికే ఉన్నాడనే నా నమ్మకాన్ని మీరు నిజం చేశారని మనుతో అంటుంది వసుధార. అందుకే రిషిని వెతకడంలో మీ సాయం కావాలని మరోసారి మనును రిక్వెస్ట్ చేస్తుంది వసుధార.
రిషిని వెతకడం సాయంగా కాకుండా బాధ్యతగా తాను ఫీలవుతున్నట్లు వసుధారతో అంటాడు మను. డీబీఎస్‌టీ కాలేజీని చేజారి పోకుండా ఎలాగైతే కాపాడానో రిషిని అలాగే కాపాడి మీకు అప్పచెబుతానని వసుధారకు మాటిస్తాడు మను.
శైలేంద్ర ప్లాన్...
తనకే మను వార్నింగ్ ఇవ్వడం రాజీవ్ తట్టుకోలేకపోతాడు. మనును చంపేయాలని ఫిక్సవుతాడు. మనును చంపేస్తే మనమే ఆ పని చేశామని ఈజీగా అందరికి తెలిసిపోతుందేమోనని శైలేంద్ర అంటాడు. తమ చేతికి మట్టి అంటకుండా రౌడీ చేత మనును చంపించాలని ప్లాన్ వేస్తాడు.
రౌడీకి ఫోన్ చేసి మను ఫొటో పంపిస్తాడు. రేపు వాడు ఈ లోకంలో ఉండకూడదని రౌడీతో చెబుతాడు శైలేంద్ర. తాను ఇచ్చిన పనిని పర్‌ఫెక్ట్‌గా పూర్తిచేస్తే చాలా డబ్బు ఇస్తానని ఆశపెడతాడు. ఈ ప్లాన్‌తో మను మన కథలో నుంచి కనుమరుగు కావడం ఖాయమని రాజీవ్‌తో అంటాడు శైలేంద్ర.
వసుధార ఆనందం...
వసుధార చాలా సంతోషంగా కనిపించడం అనుపమ గమనిస్తుంది. నీ సంతోషానికి కారణం ఏమిటని అడుగుతుంది. మను తన బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన తీరు నచ్చిందని వసుధార బదులిస్తుంది. మను వ్యక్తిత్వం ఎలాంటిదని అనుపమను ప్రశ్నిస్తుంది వసుధార. మంచివాడు, కల్మషం లేని మనిషి, ఎదుటివాళ్లు కష్టాల్లో ఉంటే చూస్తూ ఉండలేడు. అందరికి సాయం చేస్తూ ఉంటాడని మను గురించి గొప్పగా చెబుతుంది అనుపమ.
రిషి నా పక్కనే ఉండి నా బర్త్‌డేను జరిపినట్లుగా మను చక్కగా ఏర్పాట్లు చేశాడని, చాలా రోజుల తర్వాత నా మనసుకు ఆనందం కలిగేలా మను చేశాడని, అతడు చాలా గ్రేట్ అని వసుధార కూడా పొగుడుతుంది. రిషిని వెతకడంలో మను తనకు సాయం చేస్తానని మాటిచ్చాడని అనుపమతో చెబుతుంది వసుధార. రిషి వస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని, మన బాధలన్నీ తీరిపోతాయని వసుధారతో అంటుంది అనుపమ. వీలైనంత తొందరగా రిషి జాడ తెలిస్తే బాగుండునని అనుకుంటుంది.
మనుతో శత్రుత్వం...
మనుకు మీకు ఏదైనా శత్రుత్వం ఉందా అని అనుపమను అడుగుతుంది వసుధార. ఆమె ప్రశ్నకు అనుపమ షాకవుతుంది. ఫస్ట్ టైమ్ మను కాలేజీకి వచ్చినప్పుడు అతడిని చూసి షాకయ్యారు. మనును చూడగానే మీ ఫేస్‌లో ఆనందం కనిపిస్తుంది. సొంత మనిషిని చూసినట్లు ఫీలవుతారు. అతడి పర్సనల్ విషయాలు రాగానే మీరు కోపంగా చాలా సార్లు టాపిక్ డైవర్ట్ చేయడం తాను గమనించానని వసుధార అంటుంది. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని అనుపమ బదులిస్తుంది.
కానీ ఆమె మాటలను వసుధార నమ్మదు. మీ కళ్లు అబద్ధం చెబుతున్నాయని అంటుంది. గతంలో జగతి మేడమ్, రిషి మధ్య ఇలాంటి ఎమోషన్ చూశానని, అలాంటి ఎమోషన్ మీకు, మనుకు మధ్య తనకు కనిపిస్తుందని వసుధార అనుమానం వ్యక్తం చేస్తుంది. మీకు పెళ్లి కాలేదని అన్నారు. కానీ మీకు పెళ్లి అయ్యిందని నాకు అనిపిస్తుందని వసుధార సందేహం వ్యక్తం చేస్తుంది.
మీకు పెళ్లి అయ్యిందా లేదా అని నిలదీస్తుంది. మను రాకముందు అనుపమ వేరు...మను వచ్చిన తర్వాత అనుపమ వేరుగా కనిపిస్తుందని వసుధార ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తుంది. తనకు పెళ్లి కాలేదని, తాను ఒంటరినని, జీవితాంతం ఇలాగే ఉంటానని వసుధారకు బదులిస్తుంది అనుపమ. నాకు ఎలాంటి బంధాలు లేవు. ఇకపై ఉండవు కూడా అని ఎమోషనల్‌గా బదులిస్తుంది.
మను గతమా...
మరి మను ఎవరు? అతడు మీకు ఎలా పరిచయమ్యాడు? గతంలో మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా? చెప్పమని అనుపమను అడుగుతుంది వసుధార. మను మీ గతమా లేదా అన్నది సమాధానం చెప్పాలని నిలదీస్తుంది. ఈ ప్రశ్నలు ఇంకెప్పుడు నన్ను అడగొద్దని వసుధారతో అంటుంది అనుపమ.
నన్ను ఇలాంటి ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెట్టొద్దని చెబుతుంది. అది నీకు అవసరం లేని విషయం అని చెప్పి కోపంగా అనుపమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అనుపమ సమాధానం చెప్పకుండా వెళ్లడంతో వసుధార అనుమానం మరింత పెరుగుతుంది. మను, అనుపమ మధ్య ఏదో బలమైన బంధం ఉందని అనుకుంటుంది.