జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. మంగళగిరిలో ఆ పార్టీ నాయకుల కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. జనసేన నాయకులను ఉద్దేశించి మాట్లాడిన పవన్.. భీమవరం నుంచి గ్రంధి శ్రీనివాస్ ని తరిమేయాలన్నారు. ఆయన కాపు కులస్తులు అయి ఉండవచ్చని, కానీ రౌడీలకు అక్కడ స్థానం ఉండకూడదన్నారు. గ్రంధి శ్రీనివాస్ లాంటి వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే..ఆఖరికి చిన్న సోడా అమ్ముకునే వ్యక్తిని కూడా బెదిరించే స్థాయికి వెళ్లిపోతారని విమర్శలు గుప్పించారు.