Anupama Parameswaran: వ‌య‌సులో రెండేళ్లు చిన్న హీరోతో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ రొమాన్స్ - కొత్త మూవీ అప్‌డేట్ ఇదే-anupama parameswaran dhruv vikram to team up for mari selvaraj sports drama movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anupama Parameswaran Dhruv Vikram To Team Up For Mari Selvaraj Sports Drama Movie

Anupama Parameswaran: వ‌య‌సులో రెండేళ్లు చిన్న హీరోతో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ రొమాన్స్ - కొత్త మూవీ అప్‌డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Mar 12, 2024 01:32 PM IST

Anupama Parameswaran: త‌న‌కంటే వ‌య‌సులో రెండేళ్లు చిన్న‌వాడైన యంగ్ హీరోతో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. త‌మిళంలో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్‌తో ఓ మూవీకి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ,ధృవ్ విక్ర‌మ్‌
అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ,ధృవ్ విక్ర‌మ్‌

Anupama Parameswaran: గ‌త ఏడాది సినిమాల‌కు గ్యాప్ ఇచ్చిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ 2024లో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ మూవీస్‌తో స్పీడు పెంచేస్తోంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. . తాజాగా మ‌రో ఇంట్రెస్టింగ్ మూవీకి అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. త‌మిళంలో యంగ్ హీరో ధృవ్ విక్ర‌మ్‌తో రొమాన్స్ చేయ‌బోతున్న‌ది.

మారి సెల్వ‌రాజ్‌తో...

ఉధ‌య‌నిధి స్టాలిన్ మామ‌న్న‌న్ త‌ర్వాత డైరెక్ట‌ర్ మారి సెల్వ‌రాజ్ త‌న నెక్స్ట్ సినిమాను మంగ‌ళ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్ చేశాడు. క‌బ‌డ్డీ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ విక్ర‌మ్ హీరోగా న‌టిస్తున్నాడు. అత‌డికి జోడీగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

ఈ సినిమాకు త‌మిళ మూవీని అగ్ర ద‌ర్శ‌కుడు పా రంజిత్ నిర్మించ‌బోతున్నాడు. మంగ‌ళ‌వారం ఈ సినిమా అనౌన్స్‌మెంట్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ధృవ్ విక్ర‌మ్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు పా రంజిత్‌, మారి సెల్వ‌రాజ్ క‌నిపిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ స్పోర్ట్స్ డ్రామా మూవీ సెట్స్‌పైకిరానున్న‌ట్లు స‌మాచారం.

వ‌య‌సులో పెద్ద‌....

యాక్టింగ్ లో ధృవ్ విక్ర‌మ్ కంటే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ సీనియ‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. అంతే కాదు వ‌య‌సులో ధృవ్ విక్ర‌మ్ కంటే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ రెండేళ్లు పెద్ద‌. ధృవ్ విక్ర‌మ్ వ‌య‌సు 26 ఏళ్లు కాగా....అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఏజ్ 28 ఏళ్లు. త‌న‌కంటే వ‌య‌సులో రెండేళ్లు చిన్న‌వాడైన హీరోతో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ జోడీ క‌ట్ట‌బోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

మ‌హాన్‌లో తండ్రితో క‌లిసి...

అర్జున్ రెడ్డి రీమేక్‌గా తెర‌కెక్కిన ఆదిత్య వ‌ర్మ సినిమాతో హీరోగాకోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ధృవ్ విక్ర‌మ్‌. గిరీశ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ రీమేక్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత తండ్రి చియాన్ విక్ర‌మ్‌తో క‌లిసి మ‌హాన్ అనే సినిమా చేశాడు. ఈ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజైంది.

మ‌హాన్ త‌ర్వాత దాదాపు రెండేళ్ల పాటు యాక్టింగ్‌కు బ్రేక్ తీసుకున్న ధృవ్ విక్ర‌మ్ మారి సెల్వ‌రాజ్ మూవీతో రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. మంచి క‌థ కోస‌మే రెండేళ్లు ధృవ్ విక్ర‌మ్ సినిమాల‌కు దూర‌మైన‌ట్లు స‌మాచారం. మారి సెల్వ‌రాజ్ మూవీలో ధృవ్ విక్ర‌మ్‌తో పాటు అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ఛాలెంజింగ్ రోల్స్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. క‌బ‌డ్డీ బ్యాక్‌డ్రాప్‌తో పాటు ఓ సోష‌ల్ ఇష్యూను ఈ సినిమాలో చూపించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

ఈగ‌ల్‌...డీజే టిల్లు స్వ్కేర్‌...

ఈ ఏడాది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌ హీరోయిన్‌గా న‌టించిన తెలుగు మూవీ ఈగ‌ల్ ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు ముందుకొచ్చింది. ఇందులో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లోఆమె క‌నిపించింది. ఈగ‌ల్ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. త‌మిళ మూవీ సెరైన్‌లో గెస్ట్ రోల్ చేసింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

మూగ చెవిటి యువ‌తిగా క‌నిపించింది. ఈగ‌ల్ త‌ర్వాత తెలుగులో మార్చి 29న‌ టిల్లు స్వ్కేర్ మూవీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. టిల్లు స్వ్వేర్‌లో గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా గ్లామ‌ర్ రోల్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌నిపించ‌బోతున్న‌ది.

IPL_Entry_Point