Anushka Shetty: గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన అనుష్క - మ‌ల‌యాళం డెబ్యూ మూవీ కోసం స్లిమ్‌లుక్‌లో జేజ‌మ్మ‌-anushka shetty stunning makeover for malayalam debut movie kathanar slim look photos viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Anushka Shetty Stunning Makeover For Malayalam Debut Movie Kathanar Slim Look Photos Viral

Anushka Shetty: గుర్తుప‌ట్ట‌లేనంత‌గా మారిపోయిన అనుష్క - మ‌ల‌యాళం డెబ్యూ మూవీ కోసం స్లిమ్‌లుక్‌లో జేజ‌మ్మ‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 12, 2024 11:48 AM IST

Anushka Shetty: మ‌ల‌యాళం డెబ్యూ మూవీ క‌థ‌నార్ సెట్స్‌లో మంగ‌ళ‌వారం అనుష్క అడుగుపెట్టింది. ఈ ఫొటోల్లో స్లిమ్‌లుక్‌లో అనుష్క క‌నిపిస్తోంది. ఆమె ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

అనుష్క శెట్టి
అనుష్క శెట్టి

Anushka Shetty: చాలా రోజుల త‌ర్వాత మ‌ళ్లీ మీడియా ముందుకొచ్చింది అనుష్క శెట్టి. కంప్లీట్ స్లిమ్ లుక్‌లో క‌నిపించి అభిమానుల‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది. క‌థ‌నార్ అనే హార‌ర్ మూవీతో అనుష్క మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. రోజిన్ థామ‌స్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సినిమాలో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు జ‌య‌సూర్య హీరోగా న‌టిస్తోన్నాడు.

మంగ‌ళ‌వారం ఈ మూవీ సెట్స్‌లో అనుష్క అడుగుపెట్టింది. అనుష్క‌కు చిత్ర యూనిట్ ఫ్ల‌వ‌ర్ బొకే ఇచ్చి గ్రాండ్‌గా వెల్క‌మ్ చెప్పింది. ఈ ఫొటోల్లో అనుష్క స్లిమ్ లుక్‌లో క‌నిపిస్తుంది. బ‌రువు త‌గ్గిన జేజ‌మ్మ స‌న్న‌గా మారిపోయింది. ఆమె కొత్త లుక్ చూసి అభిమానులు షాక‌వుతున్నారు. అనుష్క స్లిమ్ లుక్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

సైజ్ జీరో కోసం...

సైజ్ జీరో కంటే ముందు అనుష్క స‌న్న‌గానే ఉండేది. సైజ్ జీరో కోసం బ‌రువు పెరిగింది. అధిక బ‌రువు కార‌ణంగా మ‌హిళ‌లు ఎదుర్కొనే స‌మ‌స్య‌ల‌ను చూపిస్తూ సందేశాత్మ‌కంగా ఈ సినిమా చేయాల‌ని అనుష్క అనుకున్న‌ది. కానీ ఈ ప్ర‌యోగం బెడిసికొట్టింది. అంతే కాకుండా ఈ సినిమా కోసం బ‌రువు పెరిగిన అనుష్క పూర్తిగా బొద్దుగుమ్మ‌గా మారిపోయింది. బ‌రువు త‌గ్గేందుకు చాలా ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌ల‌మైంది.

బ‌రువు కార‌ణంగా గ‌త కొన్నాళ్లుగా సినిమాల‌ను త‌గ్గించుకున్న‌ది. గ‌త మూడేళ్ల‌లో కేవ‌లం మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి మాత్ర‌మే చేసింది. గ‌త ఏడాది రిలీజైన ఈ మూవీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. అయితే బ‌రువు స‌మ‌స్య‌ల కార‌ణంగా అనుష్క ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు హాజ‌రుకాలేదు. ఇండ‌ర్వ్యూలు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల‌కు రాలేదు. చాలా రోజుల త‌ర్వాత క‌థ‌నార్ మూవీతోనే అనుష్క అభిమానులకు ద‌ర్శ‌న‌మిచ్చింది.

75 కోట్ల బ‌డ్జెట్‌తో...

9వ శ‌తాబ‌ద్దానికి చెందిన క‌డ‌మ‌ట‌ట్టు క‌థ‌నార్ అనే క్రిస్టియ‌న్ ప్రీస్ట్ జీవితం ఆధారంగా క‌థ‌నార్‌ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. దాదాపు 75 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ హార‌ర్ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌ల‌యాళంలో హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీస్‌లో ఒక‌టిగా క‌థ‌నార్ రూపుదిద్దుకుంటుంద‌ని అంటున్నారు.

ప‌ద‌మూడు భాష‌ల్లో రిలీజ్‌...

క‌థ‌నార్ సినిమా మొత్తం ప‌ద‌మూడు భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇండియ‌న్ లాంగ్వేజెస్‌తో పాటు కొరియ‌న్‌, జ‌పాన్‌, చైనీస్‌, ర‌ష్య‌న్ భాష‌ల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది.

18 ఏళ్ల కెరీర్‌...

2005లో రిలీజైన నాగార్జున సూప‌ర్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క‌. ప‌ద్దెనిమిదేళ్ల సినీ ప్ర‌యాణంలో ఆమె న‌టిస్తోన్న ఫ‌స్ట్ మ‌ల‌యాళం మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో అవ‌కాశాలు వ‌చ్చిన మ‌ల‌యాళంలో సినిమా చేయ‌లేక‌పోయింది. మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి త‌ర్వాత అనుష్క నెక్స్ట్ మూవీ ఏమిట‌న్న‌ది తెలుగులో ఆస‌క్తిక‌రంగా మారింది.

స్టార్ హీరో మూవీతో ఆమె రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగులో విక్ర‌మార్కుడు, మిర్చి, బాహుబ‌లి విజ‌యాల‌తో హీరోయిన్‌గా నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో న‌లిచింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేస్తూనే అరుంధ‌తి, భాగ‌మ‌తి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌తో స‌క్సెస్‌ల‌ను అందుకున్న‌ది.

IPL_Entry_Point