Prabhas - Anushka Shetty: మరోసారి తెరపైకి ప్రభాస్, అనుష్క పెళ్లి వార్తలు - ఈ సారైనా గాసిప్ నిజమయ్యేనా!
Prabhas - Anushka Shetty: ప్రభాస్, అనుష్క పెళ్లి వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ప్రభాస్, అనుష్క కుటుంబసభ్యులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
Prabhas - Anushka Shetty: ప్రభాస్, అనుష్క శెట్టి డేటింగ్ వార్తలు గత పన్నెండు, పదమూడేళ్లుగా టాలీవుడ్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. 2009లో రిలీజైన బిల్లా సినిమాలో ఫస్ట్ టైమ్ ప్రభాస్, అనుష్క జంటగా నటించారు. ఆ టైమ్‌లోనే వారు ప్రేమలో పడ్డట్లుగా పుకార్లు మొదలయ్యాయి.
ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు పలుమార్లు ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు మాత్రం నిజం కాలేదు. ఇప్పటికీ ప్రభాస్ పెళ్లి అనగానే అభిమానులందరికి తొలుత గుర్తొచ్చే పేరు అనుష్కనే. అంతగా ఈ గాసిప్ అభిమానుల్లోకి వెళ్లిపోయింది. అయితే తామిద్దరం మంచి స్నేహితులమేనని ప్రభాస్, అనుష్క పలు వేడుకల్లో క్లారిటీ ఇచ్చారు.
అయినా ఈ డేటింగ్, మ్యారేజీ పుకార్లకు మాత్రం పుల్‌స్టాప్ పడటం లేదు. . తాజాగా మరోసారి ప్రభాస్, అనుష్క పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. ఇటీవలే ప్రభాస్ 44 బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి వీలైనంత తొందరలో పెళ్లి చేయాలనే ఆలోచనలో కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం. ప్రభాస్‌కు తగ్గ పెళ్లి కూతురును వెతకడం కంటే అనుష్కతోనే అతడికి ఉన్న స్నేహాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఇరువురి కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.
అయితే ఈ పెళ్లి ప్రతిపాదనకు అటు ప్రభాస్, ఇటు అనుష్క ఇద్దరు అంగీకరిస్తారా? లేదా? సస్పెన్స్‌గా మారినట్లు చెబుతోన్నారు. త్వరలోనే ప్రభాస్, అనుష్క పెళ్లికి సంబంధించి ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ హీరోగా నటించిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
నాగ్ అశ్విన్ తో కల్కి 2898 ఏడీతో పాటు మారుతి దర్శకత్వంలో సూపర్ నాచురల్ హారర్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. మరోవైపు దాదాపు మూడేళ్ల విరామం తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టాలీవుడ్‌లోకి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది అనుష్క. సరోగసీ కాన్సెప్ట్‌తో లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్‌గా నిలిచింది