Prabhas Spirit: హార‌ర్ జోన‌ర్‌లో ప్ర‌భాస్ స్పిరిట్- డైరెక్ట‌ర్ సందీప్ వంగా క్లారిటీ-sandeep vanga revealed prabhas spirit storyline and genre ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Prabhas Spirit: హార‌ర్ జోన‌ర్‌లో ప్ర‌భాస్ స్పిరిట్- డైరెక్ట‌ర్ సందీప్ వంగా క్లారిటీ

Prabhas Spirit: హార‌ర్ జోన‌ర్‌లో ప్ర‌భాస్ స్పిరిట్- డైరెక్ట‌ర్ సందీప్ వంగా క్లారిటీ

Nelki Naresh Kumar HT Telugu
Feb 29, 2024 08:16 AM IST

Prabhas Spirit: ప్ర‌భాస్ స్పిరిట్ మూవీపై డైరెక్ట‌ర్ సందీప్ వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు ఇది హార‌ర్ మూవీ కాద‌ని వెల్ల‌డించాడు. ఓ సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌తో స్పిరిట్ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు చెప్పాడు

ప్ర‌భాస్ స్పిరిట్ మూవీ
ప్ర‌భాస్ స్పిరిట్ మూవీ

Prabhas Spirit: ప్ర‌భాస్, డైరెక్ట‌ర్ సందీప్ వంగా కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న స్పిరిట్ షూటింగ్ మొద‌ల‌య్యేది ఎప్పుడోన‌ని అభిమానులు చాలా కాలంగా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. క‌ల్కి, రాజాసాబ్ సినిమాల‌తో ప్ర‌భాస్ బిజీగా ఉండ‌టం, స‌లార్ 2 అనౌన్స్‌మెంట్‌తో స్పిరిట్ ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉందంటూ వార్త‌లు వినిపించాయి. కానీ ఈ పుకార్ల‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. క‌ల్కి, రాజాసాబ్ త‌ర్వాత స్పిరిట్ మూవీ సెట్స్‌పైకి రాబోతోంది.

సందీప్ వంగా అప్‌డేట్‌...

స్పిరిట్ మూవీపై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను డైరెక్ట‌ర్ సందీప్ వంగా రివీల్ చేశాడు. ఓ బాలీవుడ్ మూవీ టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ వంగా త‌న నెక్స్ట్ మూవీ ప్ర‌భాస్‌తోనే చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.స్పిరిట్ స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుంద‌ని సందీప్ వంగా చెప్పాడు.

సిన్సియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ క‌థ‌తో స్పిరిట్ మూవీని రూపొందిస్తున్నాన‌ని చెప్పాడు. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు ఇది హార‌ర్ మూవీ కాద‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం స్పిరిట్‌ స్క్రిప్ట్ ప‌నుల్లోనే బిజీగా ఉన్నాన‌ని సందీప్ వంగా చెప్పాడు. స్పిరిట్ త‌ర్వాతే యానిమ‌ల్ సీక్వెల్ యానిమ‌ల్ పార్క్ ఉంటుంద‌ని సందీప్ వంగా పేర్కొన్నాడు.

పోలీస్‌గా ప్ర‌భాస్‌...

స్పిరిట్ మూవీలో ప్ర‌భాస్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ పాన్ ఇండియ‌న్ మూవీని టీ సీరిస్ ప‌తాకంపై భూష‌ణ్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. యానిమ‌ల్ స‌క్సెస్‌తో స్పిరిట్‌పై ఇండియా వైడ్‌గా అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌న సినిమాల్లొ హీరోను అగ్రెసివ్‌గా చూపించే సందీప్ వంగా స్పిరిట్‌లో ప్ర‌భాస్ క్యారెక్ట‌ర్‌ను ఎలా డిజైన్ చేస్తాడ‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ మూవీ..

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ క‌ల్కి 2898 ఏడీ, రాజాసాబ్ సినిమాలో బిజీగా ఉన్నాడు. క‌ల్కి 2898 ఏడీ మూవీకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. దాదాపు ఐదు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో ఇండియాలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న మూవీలో ఒక‌టిగా క‌ల్కి 2898 ఏడీ రూపొందుతోంది.

ఈ సూప‌ర్ హీరో మూవీలో క‌మ‌ల్‌హాస‌న్ విల‌న్‌గా న‌టిస్తున్నాడు. దీపికా ప‌డుకోణ్ హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. అమితాబ్‌బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. మే 9న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ అవుతోంది. ఇంగ్లీష్‌లోనూ క‌ల్కి 2898 ఏడీ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

మారుతి రాజాసాబ్‌...

రాజాసాబ్ సినిమాకు మారుతి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ మూవీగా ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజాసాబ్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ నిర్మిస్తోంది.

యానిమ‌ల్ 900 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

మ‌రోవైపు యానిమ‌ల్ మూవీతో డైరెక్ట‌ర్ సందీప్ వంగా బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు. తండ్రీకొడుకుల అనుబంధంతో రూపొందిన ఈ బాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద 900 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ సినిమాలో ర‌ణ్‌బీర్‌క‌పూర్ న‌ట విశ్వ‌రూపంతో ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాడు. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో అనిల్‌క‌పూర్‌, బాబీడియోల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. యానిమ‌ల్ మూవీకి సీక్వెల్‌గా యానిమ‌ల్ పార్క్‌ను తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు సందీప్ వంగా ప్ర‌క‌టించాడు.

టాపిక్