Prabhas: ప్రభాస్ స్పిరిట్ రన్ టైమ్ చెప్పిన సందీప్ రెడ్డి వంగా.. ఫ్యాన్స్‌కు ఇబ్బంది ఉండదంటూ!
Prabhas Spirit Runtime: యానిమల్ సినిమాతో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి తర్వాత తెరకెక్కించే ప్రభాస్ స్పిరిట్ మూవీ రన్ టైమ్ గురించి చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ వైరల్ అవుతోంది.
Sandeep Reddy On Spirit Runtime: ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా స్టార్ డైరెక్టర్ జాబితాలో చేరిపోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అర్జున్ రెడ్డితో ఊహించని క్రేజ్ సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు యానిమల్ మూవీతో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీగా ఉన్నాడు. డిసెంబర్ 1న విడుదలైన యానిమల్ మూవీకి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది.
రష్మికతో కిస్సింగ్ సీన్స్, హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ మాత్రమే కాకుండా తండ్రీకొడుకుల మధ్య రిలేషన్ కన్నీళ్లు తెప్పించేలా ఉందని తెలుగు ఆడియెన్స్ చెబుతున్నారు. అర్జున్ రెడ్డి అమ్మ బాబులా ఉందని, మూడు గంటల రన్ టైమ్ అయినా రెండున్నర గంటల్లా అనిపించిందని, సందీప్ రెడ్డి వంగాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి తర్వాత తెరకెక్కించే ప్రభాస్ స్పిరిట్ మూవీ రన్ టైమ్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాల రన్ టైమ్ మూడు గంటలకుపైగానే ఉన్నాయి. అర్జున్ రెడ్డి మూవీ రన్ టైమ్ 3 గంటల 6 నిమిషాలు అయితే.. యానిమల్ రన్ టైమ్ 3 గంటల 21 నిమిషాలు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తర్వాత సినిమాను 3 గంటల 45 నిమిషాల వరకు కూడా చేసే అవకాశం ఉందని సందీప్ రెడ్డి అన్నారు. అది ప్రభాస్‌తో తెరకెక్కించే స్పిరిట్ మూవీనే అని ఓ టాక్ నడుస్తోంది. కానీ, ప్రభాస్ స్పిరిట్ మూవీ రన్ టైమ్ సుమారు 3 గంటలు ఉంటుందని సందీప్ రెడ్డి తెలిపినట్లు సమాచారం. ఒకవేళ కథలో మార్పులు జరిగితే 2 గంటల 45 నిమిషాలు ఉండొచ్చని సందీప్ పేర్కొన్నాడు.
ప్రభాస్‌తో తీస్తున్న స్పిరిట్ మూవీపై ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతలా భారీ అంచనాలు పెట్టుకున్న ఎలాంటి ఇబ్బంది లేదని, అందుకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుందని సందీప్ రెడ్డి చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది. కాగా స్పిరిట్ కథ దాదాపు పూర్తయినట్లు సమాచారం. వచ్చే ఏడాది సెప్టెంబర్ ప్రారంభించి 2025లో ప్రభాస్ స్పిరిట్ సినిమాను విడుదల చేయొచ్చని సందీప్ రెడ్డి వంగా తెలిపారు.