Animal Teaser: యానిమల్ టీజర్.. సందీప్ వంగా మార్క్.. అర్జున్ రెడ్డికి మించి బోల్డ్ కంటెంట్-animal movie teaser released on ranbir kapoor birthday ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal Teaser: యానిమల్ టీజర్.. సందీప్ వంగా మార్క్.. అర్జున్ రెడ్డికి మించి బోల్డ్ కంటెంట్

Animal Teaser: యానిమల్ టీజర్.. సందీప్ వంగా మార్క్.. అర్జున్ రెడ్డికి మించి బోల్డ్ కంటెంట్

Sanjiv Kumar HT Telugu
Sep 28, 2023 02:41 PM IST

Animal Teaser On Ranbir Kapoor Birthday: రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న క్రేజీ మూవీ యానిమల్. తాజాగా రణ్‍బీర్ కపూర్ బర్త్ డే సందర్భంగా యానిమల్ టీజర్‍ను బయటకు వదిలారు మేకర్స్.

యానిమల్ టీజర్.. సందీప్ వంగా మార్క్.. అర్జున్ రెడ్డికి మించి బోల్డ్ కంటెంట్
యానిమల్ టీజర్.. సందీప్ వంగా మార్క్.. అర్జున్ రెడ్డికి మించి బోల్డ్ కంటెంట్

కేవలం ఒక్క అర్జున్ రెడ్డి సినిమాతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్నారు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి పదింతలు సెన్సేషన్ క్రియేట్ చేయడానికి యానిమల్ మూవీతో వస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్ పుట్టినరోజు సందర్భంగా గురువారం (సెప్టెంబర్ 28) యానిమల్ మూవీ టీజర్‍ను విడుదల చేశారు మేకర్స్.

2 నిమిషాల 26 సెకన్లు ఉన్న యానిమల్ టీజర్ ఒక్కసారిగా సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. సినిమాలో తండ్రీ కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ చూపించేలా ఉంది. నిజానికి టీజర్ చూస్తుంటే తండ్రీ కొడుకుల డిఫరెంట్ నేచర్‍తో టిపికల్ స్టోరీలా అనిపిస్తోంది. టీజర్ ప్రారంభంలో పిల్లల గురించి ఏంటీ అని రణ్‍బీర్‍ను రష్మిక అడిగితే.. నాకు తండ్రిలా కావాలని ఉందని అంటాడు. నీకు నీ తండ్రి అంటే ఇష్టం లేదు కదా అని రష్మిక అంటుంది.

రష్మిక డైలాగ్‍తో అప్పటివరకు కూల్‌గా ఉన్న రణ్‌బీర్ ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. ఈ సీన్ అర్జున్ రెడ్డికి మించి కనిపిస్తుంది. తర్వాత రణ్‌బీర్‍ను తండ్రి అనిల్ కపూర్ క్రిమినల్ కొడుకుని కన్నామంటూ కొట్టడం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. తండ్రి కొట్టిన అతనే బెస్ట్ ఫాదర్.. బాగా పెంచాడు అని రణ్‍బీర్ చెప్పడం టిపికల్‍గా అనిపించింది. పోర్న్ చూస్తావా, అమ్మాయిలి వంగితే చెకౌట్ చేస్తావా అని ఏదైనా అడుగు నిజాయితీగా చెబుతా. కానీ ఇది కాదు అని రణ్‍బీర్ చెప్పడం డిఫరెంట్‍గా ఉంది.

యానిమల్ చిత్రంలో ఎవరు విలన్ అనేది సస్పెన్సింగ్ ఉంది. ఇక టీజర్ ఎండింగ్‍లో బాబీ డియోల్ ఎంట్రీ నెక్ట్స్ లెవెల్ ఉంది. అలాగే బబ్లూ పృథ్వీరాజ్ కూడా కనిపించాడు. బీజీఎమ్ అదిరిపోయింది. ఓ గ్యాంగ్‍పై బుల్లెట్ల వర్షం కురిపించడం, నాకన్న చెడ్డవాడు లేడు, రెండు కార్లు-నాలుగు ఎఫైర్స్ వంటి డైలాగ్స్, సీన్స్ తో సందీప్ రెడ్డి వంగా మార్క్ కనిపించింది. కాగా యానిమల్ మూవీ డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు.

IPL_Entry_Point