Animal Rights: దిల్ రాజు చేతికే యానిమల్ రైట్స్.. అన్ని కోట్లతో కొనుగోలు.. హిట్‍కి ఎంత రావాలంటే?-dil raju acquires ranbir kapoor animal movie telugu rights for 15 cr ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Dil Raju Acquires Ranbir Kapoor Animal Movie Telugu Rights For 15 Cr

Animal Rights: దిల్ రాజు చేతికే యానిమల్ రైట్స్.. అన్ని కోట్లతో కొనుగోలు.. హిట్‍కి ఎంత రావాలంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 27, 2023 08:19 AM IST

Animal Rights To Dil Raju: అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా రెడ్డి తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా యానిమల్. బీభత్సమైన అంచనాలు నెలకొన్న ఈ మూవీ తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.

దిల్ రాజు చేతికే యానిమల్ రైట్స్.. అన్ని కోట్లతో కొనుగోలు.. హిట్‍కి ఎంత రావాలంటే?
దిల్ రాజు చేతికే యానిమల్ రైట్స్.. అన్ని కోట్లతో కొనుగోలు.. హిట్‍కి ఎంత రావాలంటే?

Animal Movie Telugu Rights: విజయ్ దేవరకొండ సినీ కెరీర్‍లో అర్జున్ రెడ్డి ఒక స్పెషల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో టాలీవుడ్‍లో సెన్సేషనల్ డైరెక్టర్‍గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగా. దీంతో తన తర్వాతి సినిమాలపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. అనంతరం ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్‍ పేరుతో తెరకెక్కించి మరో హిట్ కొట్టాడు. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి బాలీవుడ్ హీరో రణ్‍బీర్ కపూర్‍తో యానిమల్.. మరొకటి ప్రభాస్‍తో స్పిరిట్.

ట్రెండింగ్ వార్తలు

వైల్డ్-సాఫ్ట్

అయితే, ముందుగా యానిమల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. ఇదివరకే యానిమల్ నుంచి వచ్చిన రణ్‍బీర్ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రీ టీజర్ గ్లింప్స్, హీరోయిన్ రష్మిక మందన్నా ఫస్ట్ లుక్, పాపులర్ యాక్టర్ అనిల్ కపూర్ పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. రణ్‍బీర్ కపూర్ లుక్ వైల్డ్ గా ఉంటే.. రష్మిక పోస్టర్ సాఫ్ట్ గా, సాంప్రదాయబద్ధంగా అందగా ఉంది. ఇక ప్రీ టీజర్ గ్లింప్స్ అయితే నెక్ట్స్ లెవెల్ అన్నట్లుగా ఉంది.

దిల్ రాజు సొంతం

మాస్క్ పెట్టుకుని ఉన్న ఓ రౌడీ గ్యాంగ్‍ను గొడ్డలితో నరుకుతూ మరింత వయెలెన్స్ చూపించారు. అయితే ఇది ఓ మలయాళ, హాలీవుడ్ మూవీ నుంచి కాపీ కొట్టారని కూడా ట్రోలింగ్ జరిగింది. ఇదిలా ఉంటే యానిమల్ మూవీ తెలుగు బిజినెస్ పూర్తి అయినట్లుగా టాక్ వస్తోంది. యానిమల్ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి యానిమల్ చిత్రాన్ని సుమారు రూ. 15 కోట్లకు దిల్ రాజు కొనుగోలు చేశాడని ఇన్‍సైట్ టాక్.

హిట్ కావాలంటే?

ఇలా యానిమల్ మూవీ తెలుగు రైట్స్ ను దిల్ రాజు రూ. 15 కోట్లకు సొంతం చేసుకున్నాడనే టాక్ వైరల్ అవుతోంది. దీంతో యానిమల్ టార్గెట్ కలెక్షన్స్ పై కూడా చర్చ నడుస్తోంది. యానిమల్ తెలుగు రాష్ట్రాల్లో హిట్ కావాలంటే రూ. 25 కోట్లకుపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. అయితే, సినిమాకు ఉన్న క్రేజ్‍ని బట్టి ఫస్ట్ వీకెండ్‍లోనే టార్గెట్ బ్రేక్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.