Animal: తెలుగు ప్రేక్షకులు తప్పు అని నిరూపించేందుకే యానిమల్: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్
Sandeep Reddy Vanga About Animal Runtime: అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్. తాజాగా యానిమల్ 3 గంటల 21 నిమిషాల రన్ టైమ్‌పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
Sandeep Reddy Vanga About Audience: విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఇదే మూవీని హిందీలో కూడా కబీర్ సింగ్ అని రీమేక్ చేశాడు. అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ కొట్టి డైరెక్టర్‌గా మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పుడు మళ్లీ తన మార్క్ వయెలెంట్ మూవీగా తెరకెక్కించిన చిత్రం యానిమల్.
యానిమల్ రన్ టైమ్
డిసెంబర్ 1న విడుదల కానున్న యానిమల్ సినిమాకు సెన్సార్ బోర్డ్ నుంచి ఏ సర్టిఫికేట్ రాగా మూవీ రన్ టైమ్ మూడు గంటల 25 నిమిషాలుగా ఏర్పడింది. తెలుగు సినిమాల్లోనే అత్యధిక ఎక్కువ రన్ టైమ్‌గా యానిమల్ రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో సినిమా మరింత ట్రెండ్ అయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యానిమల్ మూవీ రన్ టైమ్‌పై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను జర్నలిస్ట్ ప్రశ్నించారు.
తప్పని నిరూపిద్దామనా
"క్రియేటివ్ పర్సన్‌కి ఒక ఇగో ఉంటుంది. నేను ఎందుకు చేయలేను. ఐ కెన్ డూ ఇట్ అనేది ఒకటి ఉంటుంది. మీరు ఇప్పుడే చెప్పారు అర్జున్ రెడ్డి 3 గంటల 6 నిమిషాలు అని. అప్పుడు కొంతమంది మీపై డౌట్ పడ్డారు. కొత్త వాళ్లు, కొత్త డైరెక్టర్.. మూడు గంటల సినిమా ఏంటీ. చాలా మంది డౌట్ పడే ఉంటారు. వారంతా తప్పు అని మీరు నిరూపించారు. ఒకసారి నిరూపించారు కాబట్టి ఇగోతో మరోసారి అలాగే చేద్దామనుకుంటున్నారా" అనే సెన్స్‌లో జర్నిలిస్ట్ అడిగారు.
ఇగో ఉంది
జర్నలిస్ట్ క్వశ్చన్ పూర్తి కాకముందే.. "క్రియేటివ్ పర్సన్స్‌కి డెఫినెట్‌గా ఉంటదా ఇగో. అయితే చూద్దాం ఎవరు కరెక్టో. ఇగో లేదు అదేం లేదని అబద్ధం చెప్పను. కచ్చితంగా ఉంటది. ఒకసారి 3 గంటల 6 నిమిషాలతో నిరూపించాను కదా. ఈసారి మూడు గంటల 25 నిమిషాలతో నిరూపించాలని నాకు కూడా ఉంది" అని సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్ చేశారు.
రెండు పార్టులుగా
అనంతరం "3 గంటల 25 నిమిషాల యానిమల్ మూవీ సక్సెస్ అయితే" అని జర్నలిస్ట్ అడిగారు. దానికి "ఇక అంతకంటే ఎక్కువ పోనండి. 3 గంటల 45 నిమిషాల వరకు అయితే పోవచ్చు. దానికంటే మించి ఉంటే రెండు పార్టులుగా చేసుకోవడం బెటర్ అనేది నా అభిప్రాయం" అని సందీప్ రెడ్డి వంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.