Animal First Review: యానిమల్ ఫస్ట్ రివ్యూ.. తండ్రీ కొడుకుల ఎమోషన్‌తో హై ఓల్టేజ్ యాక్షన్-ranbir kapoor rashmika mandanna animal first review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Animal First Review: యానిమల్ ఫస్ట్ రివ్యూ.. తండ్రీ కొడుకుల ఎమోషన్‌తో హై ఓల్టేజ్ యాక్షన్

Animal First Review: యానిమల్ ఫస్ట్ రివ్యూ.. తండ్రీ కొడుకుల ఎమోషన్‌తో హై ఓల్టేజ్ యాక్షన్

Sanjiv Kumar HT Telugu

Ranbir Kapoor Animal First Review: బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్నా జోడిగా నటించిన సినిమా యానిమల్. డిసెంబర్ 1న విడుదల కానున్న యానిమల్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. సినీ క్రిటిక్‌గా చెప్పుకునే ఉమర్ సంధు యానిమల్ మూవీపై రివ్యూ ఇచ్చాడు.

సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీ ఫస్ట్ రివ్యూ

Sandeep Reddy Vanga Animal First Review: కేవలం ఒక్క అర్జున్ రెడ్డి మూవీతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్నారు సందీప్ రెడ్డి వంగా. విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి ఎలాంటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి పదింతలు సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన చిత్రమే యానిమల్. రణ్‍బీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో హీరోయిన్లుగా చేసిన యానిమల్ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఓ రేంజ్‌లో అంచనాలు పెంచాయి.

ఇటీవల విడుదలైన యానిమల్ ట్రైలర్‌లో హై ఓల్టేజ్ యాక్షన్‌తో సందీప్ రెడ్డి వంగా మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక యానిమల్ మూవీకి సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఇది పెద్దలు మాత్రమే చూడదగ్గ సినిమా. సందీప్ రెడ్డి సైతం తన పిల్లలకు ఈ సినిమా చూపించను అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పాడు. సుమారు 3 గంటలకు పైగా రన్ టైమ్ ఉన్న యానిమల్ మూవీ డిసెంబర్ 1న థియేటర్లలో విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో యానిమల్ ఫస్ట్ రివ్యూ రానే వచ్చేసింది. సినీ క్రిటిక్‌, సెన్సార్ బోర్డ్ మెంబర్‌గా చెప్పుకునే దుబాయ్‌కి చెందిన ఉమర్ సంధు యానిమల్‌పై రివ్యూ ఇచ్చాడు. "సెన్సార్ బోర్డ్ నుంచి యానిమల్ ఫస్ట్ రివ్యూ వచ్చింది. యూత్‌ను విపరీతంగా అలరించే యాక్షన్ మూవీ. హై ఆక్టెన్ యాక్షన్, అడల్ట్ సీన్స్ థీమ్, హిట్ మ్యూజిక్, అదిరిపోయే స్క్రిప్ట్, నటీనటుల సూపర్బ్ యాక్టింగ్ సినిమాకు ప్రేక్షకులను తీసుకొస్తుంది" అని ఉమర్ సంధు ట్విటర్‌లో రాసుకొచ్చాడు.

యానిమల్ మూవీకి ఉమర్ సంధు 5కి 4 స్టార్ రేటింగ్ కూడా ఇచ్చాడు. మరొక ట్వీట్‌లో "2023లో యానిమల్ నా ఫేవరెట్ మూవీ. సినీ ప్రేక్షకులను యానిమల్ షాక్‌కు గురి చేస్తుంది. రణ్‌బీర్ కపూర్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ మూవీ అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుంది" అని ఉమర్ సంధు చెప్పుకొచ్చాడు.

ఇంకో ట్వీట్‌లో "యానిమల్ ఓపెనింగ్ కలెక్షన్స్ సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, ఇతర నెపో యాక్టర్స్‌కి పెద్ద షాక్‌తోపాటు హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది" అని రాసుకొచ్చాడు ఉమర్ సంధు. కాగా సినీ సెలబ్రిటీలపై ఫైక్ న్యూస్ రాస్తూ, కేసుల పాలవుతూ ట్రెండింగ్‌లో ఉమర్ సంధు ఉంటాడన్న విషయం తెలిసిందే.