Rashmika Mandanna Hot Photo Leak: కన్నడ బ్యూటి రష్మిక మందన్నా ఛలో సినిమాతో తెలుగు వారికి పరిచయమైంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‍గా స్టార్‍డమ్ తెచ్చుకుంది. అంతేకాకుండా నేషనల్ క్రష్‍గా గుర్తింపు పొందింది. ఇక పుష్ప మూవీతో వచ్చిన క్రేజ్ ద్వారా బాలీవుడ్ సినిమాల్లోనూ హీరోయిన్‍గా అవకాశాలు కొట్టేసింది. మిషన్ మజ్ను, గుడ్ బై వంటి చిత్రాలతో ఆకట్టుకున్న ఈ కన్నడ అందం తమిళంలో వారిసు సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
త్వరలో యానిమల్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంది రష్మిక మందన్నా. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రష్మిక మందన్నా గీతాంజలి పాత్రలో నటించింది. ఇప్పటికే యానిమల్ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. తర్వాత విడుదల చేసిన సాంగ్‌లో రణ్‌బీర్ కపూర్‌తో ఘాటు లిప్ లాక్ సీన్లలో నటించిన రష్మిక తెగ వైరల్ అయింది. చిన్ని టీజర్‌లో లెక్కపెట్టనన్ని సార్లు అదర చుంబనాలతో హీట్ పెంచింది రష్మిక మందన్నా.
అయితే ఇప్పుడు రష్మిక మందన్నా లేటెస్ట్ హాట్ ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఆ పిక్‌ను ఎవరో కాదు.. ఏకంగా రష్మిక మందన్నా టీమ్ ఆమెకు తెలియకుండా సోషల్ మీడియాలో వదిలింది. "గాయ్స్.. ఈ ఫొటో వెనుక ఓ కథ. ఈ ఫొటో తీసి దాదాపుగా సంవత్సరం అవుతుంది. మేము ఈ పని చేస్తున్నట్లు రష్మికకు ఏమాత్రం ఐడియా లేదు. మేము (ఆమె టీమ్) కాస్తా స్వతంత్ర్యం తీసుకుని ఆమెకు తెలియకుండా ఈ ఫొటోను మీకోసం పోస్ట్ చేస్తున్నాం" అని రష్మిక టీమ్ ఆమె ఇన్ స్టా ఖాతాలో రాసుకొచ్చింది.
రష్మిక మందన్నా లేటెస్ట్ ఫొటోలో బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్ వేసుకుని కింద కూర్చుని హాట్‌గా పోజుచ్చింది. ఇందులో ఆమె పైన కింద అందాలు మరింత బోల్డ్‌గా కనిపిస్తూ అట్రాక్ట్ చేస్తున్నాయి. దీంతో ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ వైరల్ అవుతోంది.