Bramayugam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మ‌మ్ముట్టి లేటెస్ట్ మ‌ల‌యాళం హార‌ర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే-mammootty malayalam horror movie bramayugam to streaming on sonyliv from march 15th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Mammootty Malayalam Horror Movie Bramayugam To Streaming On Sonyliv From March 15th

Bramayugam OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మ‌మ్ముట్టి లేటెస్ట్ మ‌ల‌యాళం హార‌ర్ మూవీ - స్ట్రీమింగ్ డేట్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Mar 06, 2024 12:32 PM IST

Bramayugam OTT Release Date: మ‌మ్ముట్టి లేటెస్ట్ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ భ్ర‌మ‌యుగం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. మార్చి 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది.

భ్ర‌మ‌యుగం ఓటీటీ రిలీజ్ డేట్
భ్ర‌మ‌యుగం ఓటీటీ రిలీజ్ డేట్

Bramayugam OTT Release Date: మ‌మ్ముట్టి లేటెస్ట్ హార‌ర్ మూవీ భ్ర‌మ‌యుగం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. థియేట‌ర్ల‌లో కాసుల వ‌ర్షం కురిపించిన భ్ర‌మ‌యుగం ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను బుధ‌వారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. మార్చి 15 నుంచి సోనీ లివ్ ఓటీటీలో భ్ర‌మ‌యుగం మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టిస్తూ ఓ స్పెష‌ల్ వీడియోను సోనీలివ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో భ్ర‌మ‌యుగం మూవీ స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. భ్ర‌మ‌యుగం ఓటీటీ హ‌క్కుల‌ను సోనీలివ్ 30 కోట్ల‌కు ద‌క్కించుకున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. మ‌మ్ముట్టి కెరీర్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోయిన మూవీగా భ్ర‌మ‌యుగం రికార్డ్ నెల‌కొల్పిన‌ట్లు స‌మాచారం.

యాభై కోట్ల క‌లెక్ష‌న్స్‌...

బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్‌లో ప్ర‌యోగాత్మ‌కంగా తెర‌కెక్కిన భ్ర‌మ‌యుగం మూవీ మ‌ల‌యాళంలో యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఈ ఏడాది మ‌ల‌యాళంలో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది.

భ్ర‌మ‌యుగం తెలుగు వెర్ష‌న్ మాత్రం మ‌ల‌యాళంలో విడుద‌లైన వారం త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 23న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తెలుగులో ఈ హార‌ర్ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ రిలీజ్ చేసింది. మ‌ల‌యాళంలో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ తెలుగులో మాత్రం నిరాశ‌ప‌రిచింది. ఆశించిన స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించ‌లేక‌పోయింది.

మూడు పాత్ర‌ల‌తో...

కేవ‌లం మూడు పాత్ర‌ల‌తో ద‌ర్శ‌కుడు రాహుల్ స‌దాశివ‌న్ భ్ర‌మ‌యుగం సినిమాను తెర‌కెక్కించాడు. తేవాన్ ఓ గాయ‌కుడు. అడ‌విలో దారిత‌ప్పిన అత‌డు కుడుమోన్ పొట్టికి చెందిన పురాత‌న భ‌వంతిలో అడుగుపెడ‌తాడు. అడ‌వి మ‌ధ్య‌లో ఉన్న భ‌వంతిలో కుడుమోన్ పొట్టితో పాటు అత‌డి వంట‌వాడు మాత్ర‌మే ఉంటారు.మాయ‌లు, మంత్రాల‌తో నిండిన ఆ ఇంటి నుంచి తేవాన్ పారిపోవాల‌ని ఎంత ప్ర‌య‌త్నించిన‌ అత‌డిని త‌న శ‌క్తుల‌తో కుడుమోన్ పొట్టి అడ్డుకుంటాడు.

ఆ ఇంటిలో అడుగుపెట్టిన త‌క్కువ కుల‌స్తుల‌ను చంపుతున్న‌ది ఎవ‌రు? కుడుమోన్ పొట్టి ప్ర‌మాద‌క‌ర‌మైన వాడు అని తెలిసి కూడా వంట‌వాడు అత‌డితోనే ఎందుకు ఉంటున్నాడు? కుడుమోన్ పొట్టి బ‌తికే ఉన్నాడా? అత‌డి రూపంలో ఉన్న ఆ అతీంద్రియ శ‌క్తి ఏమిట‌న్న‌దే భ్ర‌మ‌యుగం మూవీ క‌థ‌. సినిమాలో మ‌మ్ముట్టితో పాటు అర్జున్ అశోక‌న్‌, సిద్ధార్థ్ భ‌ర‌త‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

మ‌మ్ముట్టి విల‌న్‌...

భ్ర‌మ‌యుగం సినిమాలో మ‌మ్ముట్టి న‌ట విశ్వ‌రూపాన్ని చూపించారు. నెగెటివ్ రోల్‌లో త‌న యాక్టింగ్‌, బాడీలాంగ్వేజ్‌తో అభిమానుల‌ను మెప్పించాడు. మ‌మ్ముట్టి కెరీర్‌లో డిఫ‌రెంట్ మూవీగా భ్ర‌మ‌యుగం నిలిచింది.

ప్ర‌స్తుతం మ‌ల‌యాళంలో మట‌ర్బో, బ‌జూక‌తో పాటు మ‌రో సినిమా చేస్తున్నాడు మ‌మ్ముట్టి. తెలుగులో వైఎస్ జ‌గ‌న్ బ‌యోపిక్‌గా తెర‌కెక్కిన యాత్ర 2లో మ‌మ్ముట్టి గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు.మ‌మ్ముట్టి హీరోగా న‌టించిన కాథ‌ల్‌, క‌న్నూర్ స్వ్కాడ్ బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. భ్ర‌మ‌యుగంతో ఆ స‌క్సెస్ జోరును మ‌మ్ముట్టి కొన‌సాగించారు. మ‌మ్ముట్టి గెస్ట్ రోల్‌లో న‌టించిన అబ్ర‌హం ఓజ్ల‌ర్ మూవీ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో మార్చి 20న రిలీజ్ కాబోతోంది.

WhatsApp channel

టాపిక్