Gayathri Gupta: హార‌ర్ మూవీతో భ‌య‌పెట్ట‌నున్న ఫిదా బ్యూటీ- భ‌వానీ వార్డ్ ఫ‌స్ట్ లుక్ లాంఛ్‌-gayathri gupta bhavani ward movie first look released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Gayathri Gupta Bhavani Ward Movie First Look Released

Gayathri Gupta: హార‌ర్ మూవీతో భ‌య‌పెట్ట‌నున్న ఫిదా బ్యూటీ- భ‌వానీ వార్డ్ ఫ‌స్ట్ లుక్ లాంఛ్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 28, 2024 12:57 PM IST

Gayathri Gupta: ఫిదా ఫేమ్ గాయ‌త్రి గుప్తా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న భ‌వానీ వార్డ్ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజైంది. ఈ హార‌ర్ మూవీకి న‌ర‌సింహా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

భ‌వానీ వార్డ్
భ‌వానీ వార్డ్

Gayathri Gupta: బిగ్‌బాస్ బ్యూటీ గాయత్రి గుప్తా త్వ‌ర‌లో హార‌ర్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు భ‌వానీ వార్డ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. భ‌వానీ వార్డ్ ఫ‌స్ట్ లుక్‌ను ఇటీవ‌ల రివీల్ చేశారు. గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్ ఈ మూవీలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

డిఫ‌రెంట్ మూవీగా...

ఈ హార‌ర్ మూవీకి జీడీ నరసింహా దర్శకత్వం వహిస్తున్నారు. భ‌వానీ వార్డ్‌లో న‌టిస్తోన్న వారిలో అంద‌రి కంటే తానే సీనియ‌ర్ అని గాయ‌త్రి గుప్తా చెప్పింది. త‌న కెరీర్‌లో మ‌రో డిఫ‌రెంట్ మూవీగా భ‌వానీ వార్డ్ నిలుస్తుంద‌ని తెలిపింది.

సింగిల్ సిట్టింగ్‌లోనే...

క‌థ చెప్పిన వెంట‌నే సింగిల్ సిట్టింగ్‌లోనే గాయ‌త్రి గుప్తా భ‌వానీ వార్డ్ మూవీని అంగీక‌రించింద‌ని ద‌ర్శ‌కుడు అన్నాడు. హారర్ సినిమాలను ఇష్టపడే వారిని ఈ మూవీ మెప్పిస్తుంద‌ని చెప్పాడు. చిన్న చిత్రాల‌కు స‌పోర్ట్ చేయాల‌నే భ‌వానీ వార్డ్ మూవీని ప్రొడ్యూస్ చేసిన‌ట్లు నిర్మాత‌లు అన్నారు. భ‌వానీ వార్డ్ మూవీని కళ్యాణ్ చక్రవర్తి, చంద్రకాంత్ సోలంకి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తోన్నారు. ఈ సినిమాకు సోల్మాన్ రాజ్ మ్యూజిక్ అందిస్తోండ‌గా నిస్సి జ‌స్టిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స‌మ‌కూర్చారు.

భ‌వానీ వార్డ్ మూవీలో జ‌బ‌ర్ధ‌స్థ్ క‌మెడియ‌న్ అప్పారావుతో పాటు టిక్‌టాక్‌తో ఫేమ‌స్ అయిన దుర్గారావు ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. యథార్థ ఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీని ఏప్రిల్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్‌చేయ‌బోతున్నారు.

బిగ్‌బాస్‌పై హాట్ కామెంట్స్‌...

బిగ్‌బాస్ షోపైగాయ‌త్రి గుప్తా చేసిన కాంట్ర‌వ‌ర్సీయ‌ల్ అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. బిగ్‌బాస్ సెలెక్ష‌న్‌, ప్రామిస్‌లు స‌రిగ్గా ఉండ‌దంటూ అప్ప‌ట్లో పేర్కొన్న‌ది. బిగ్‌బాస్ ప్ర‌తినిధులు త‌న‌తో అస‌భ్యంగా కామెంట్స్ చేశార‌ని, క‌మిట్‌మెంట్ అడిగార‌ని చెప్పింది. బిగ్‌బాస్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంద‌ని కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ లో అవ‌కాశం ఇస్తాన‌ని మాటివ్వ‌డంతో తాను చాలా సినిమాల అవ‌కాశాలు వ‌దులుకున్నాన‌ని, చివ‌ర‌కు బిగ్‌బాస్ యాజ‌మాన్యం త‌న‌ను మోసం చేసింద‌ని గాయ‌త్రి గుప్తా అన్న‌ది. అప్ప‌ట్లో ఆమె కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. బిగ్‌బాస్ షోపై కేసు పెట్టింది.

ఫిదాలో సాయిప‌ల్ల‌వి ఫ్రెండ్‌...

తెలుగులో ఫిదా సినిమాలో సాయిప‌ల్ల‌వి స్నేహితురాలి పాత్ర‌లో క‌నిపించింది గాయ‌త్రి గుప్తా. ఈ మూవీతో పాటు అమ‌ర్ అక్బ‌ర్‌ ఆంథోనీ, బుర్ర‌క‌థ‌, అన్‌స్టాప‌బుల్‌, ఐస్‌క్రీమ్‌తో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో వెరైటీ క్యారెక్ట‌ర్స్ చేసింది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన డ‌బుల్ ఇంజిన్‌ మూవీ ఇటీవ‌లే థియేట‌ర్ల‌లో రిలీజైంది. ప్ర‌స్తుతం కొన్ని చిన్న సినిమాలు చేస్తోంది గాయ‌త్రి గుప్తా. అయితే సినిమాల కంటే వివాదాల‌తోనే గాయ‌త్రి గుప్తా ఎక్కువ‌గా పాపుల‌ర్ అయ్యింది. తాను ఆటో ఇమ్యూనీ డిసీజ్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలిసింది.

సినిమాల‌తో పాటు స్టోరీ డిస్క‌ష‌న్‌, వ‌ర్క‌వుట్ అయ్యింది, ద‌యా, గ్యాంగ్‌స్ట‌ర్స్ వెబ్‌సిరీస్‌ల‌లో గాయ‌త్రి గుప్తా న‌టించింది. ఒక చిన్న మాట అనే సిరీస్‌కు రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌గా గాయ‌త్రి గుప్తా వ్య‌వ‌హ‌రించింది. మాస్క్ మ్యాన్ అనే మూవీకి రైట‌ర్‌గా ప‌నిచేసింది.

WhatsApp channel

టాపిక్