Zerodha CEO: ‘‘సొంత ఇల్లు కొనడం బెటరా? రెంట్ కు ఉండడం బెటరా?’’.. జెరోధా సీఈఓ లెక్కకు నెటిజన్లు ఫిదా..
rent vs buy debate: 'సొంత ఇల్లు కొనుక్కోవడం వల్ల లాభమా? లేక రెంట్ కు ఉండడం మంచిదా? అన్న ప్రశ్న చాలా మందిని వేధిస్తుంటుంది. ముఖ్యంగా నగరాల్లో అధిక అద్దెల భారంతో ఇబ్బంది పడుతున్నవారు వీలైనంత త్వరగా సొంత ఇల్లు కొనాలనుకుంటారు.
Zerodha CEO Nithin Kamath: సొంత ఇల్లా? అద్దె ఇల్లా? ఆర్థికంగా ఏది బెటర్? అనే చర్చ (rent vs buy debate) చాన్నాళ్లుగా సాగుతోంది. వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లోనూ ఈ చర్చ లోతుగా సాగుతూ ఉంటుంది. రెండు ఆప్షన్స్ కు సపోర్టర్స్ ఉన్నారు.. వ్యతిరేకించే వారూ ఉన్నారు.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
జెరోధా సీఈఓ రెస్పాన్స్
సొంత ఇల్లా? అద్దె ఇల్లా? ఆర్థికంగా ఏది బెటర్? అనే చర్చ (rent vs buy debate) ను ప్రముఖ జర్నలిస్ట్ సోనియా షెనాయ్ తన పాడ్ కాస్ట్ లో ప్రారంభించారు. ఆ చర్చలో జెరోధా సీఈఓ నితిన్ కామత్ పాల్గొని ఈ అంశంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నానని, సొంత ఇల్లు ను కొనుగోలు చేయడం కన్నా అద్దె ఇంట్లో ఉండడానికే తాను ఇష్టపడతానని నితిన్ కామత్ చెప్పారు. ఈ వీడియో నెటిజన్లలో భారీ చర్చకు దారితీసింది. ఇంటిని అద్దెకు తీసుకోవడమే ఆర్థికంగా బెటర్ అన్న కామత్ వైఖరితో చాలా మంది ఏకీభవించగా, మరికొందరు దీర్ఘకాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇల్లు కొనడమే మంచిదని వాదించారు.
పూర్వీకుల ఇల్లు
ఈ చర్చలో నితిన్ కామత్ మాట్లాడుతూ తనకు ఉన్న సొంత ఇల్లు తన తల్లిదండ్రులదని వెల్లడించారు. ఆ ఇంటిని తామే అట్టిపెట్టుకోవడం భావోద్వేగ కారణాల వల్ల జరిగిందని తెలిపారు. తాను ఇల్లు కొనుక్కోవాలని అనుకోవడం లేదన్నారు. షేర్ చేసినప్పటి నుంచి ఈ వీడియోను 3.7 లక్షల మంది వీక్షించారు. ఈ పోస్టుకు దాదాపు 8,900 లైకులు వచ్చాయి. ఈ వీడియోపై స్పందించిన ప్రజలు రకరకాల కామెంట్లు పెట్టారు. కొందరు నితిన్ కామత్ కు మద్దతు తెలపగా, మరికొందరు ఇల్లు కొనుక్కోవడమే బెటర్ అని వాదించారు.
యూజర్లు ఏమంటున్నారు?
సొంత ఇల్లా? లేక అద్దె ఇల్లా? అన్న డిబేట్ (rent vs buy debate) లో జెరోధా సీఈఓ నితిన్ కామత్ (Zerodha CEO Nithin Kamath) చేసిన కామెంట్స్ పై నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది. పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వివరణాత్మకంగా వెలిబుచ్చారు. ‘‘మాకు 20% మూలధనం, 80% రుణం ఉన్నంత వరకు ఇల్లు కొనడం చెడ్డ ఆలోచన కాదు' అని ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ రాశారు.
‘‘సొంత ఇల్లు వల్ల ఒక రకమైన మానసిక ప్రశాంతత, భద్రత లభిస్తుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కనీసం,'నేను నివసించడానికి నా స్వంత ఇల్లు ఉంది. అద్దె చెల్లింపుల సమస్య లేదు. ఏ కారణాల వల్లనైనా సరే నన్ను ఎవరూ బయటకు పంపలేరు’’ అని మరొకరు వ్యాఖ్యానించారు.
‘‘ఇల్లు కొనుగోలుకు పెడుతున్న పెట్టుబడి, రుణం తీసుకుంటే, ప్రతీ నెలా చెల్లించే ఈఎంఐ లను సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే, సొంత ఇల్లు కన్నా.. అద్దె ఇల్లే బెటర్ అనిపిస్తుంది. సొంత ఇంటి కన్నా సౌకర్యవంతమైన ఇంట్లో ఉండవచ్చు’’ అని మరొక యూజర్ వ్యాఖ్యానించారు.
టాపిక్