Kumari Aunty: సోషల్ మీడియా నుంచి టీవీ షో వరకు - బిగ్‌బాస్ ఉత్సవం షోకు స్పెషల్ గెస్ట్‌గా కుమారి ఆంటీ
Kumari Aunty: బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్‌తో కలిసి టీవీ షోలో సందడి చేసింది సోషల్ మీడియా సెన్సేషన్ కుమారి ఆంటీ. బిగ్‌బాస్ ఉత్సవం షోకు కుమారి ఆంటీ స్పెషల్ గెస్ట్‌గా హాజరైంది.
Kumari Aunty: సోషల్ మీడియా సెలబ్రిటీ కుమారి ఆంటీ టీవీ షోకు స్పెషల్ గెస్ట్‌గా హాజరైంది. బిగ్‌బాస్ సెలబ్రిటీలతో సందడి చేసింది. బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్, రన్నరప్‌తోపాటు కంటెస్టెంట్స్ అందరూ మరోసారి రీ యూనియన్ అయ్యారు. వీరితో బిగ్‌బాస్ ఉత్సవం పేరుతో స్పెషల్ ఈవెంట్‌ను స్టార్ మా ప్లాన్ చేసింది. బిగ్‌బాస్ ఉత్సవంలో బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్‌దీప్‌తో పాటు కంటెస్టెంట్స్ అర్జున్ అంబాటి, టేస్టీతేజా, అశ్విని, నైనీ పావనితో పాటు మిగిలిన కంటెస్టెంట్స్ అంటెడ్ అయ్యారు.
ఈ షోకు శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరించింది. ఈ బిగ్‌బాస్ ఉత్సవం షోకు స్పెషల్ గెస్ట్‌గా కుమారి ఆంటీ వచ్చింది. అంతే కాకుండా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ తన వంటల టాలెంట్‌ను రుచి చూపించింది. అందరికి నాన్ వెజ్ భోజనాన్ని వడ్డించింది. కుమారి ఆంటీ నాన్ వెజ్ భోజనానికి బిగ్‌బాగ్ కంటెస్టెంట్స్ ఫిదా అయినట్లు తెలిసింది.
బిగ్‌బాస్ ఉత్సవంలో కుమారి ఆంటీతో నిర్వహకులు ఓ స్పెషల్ స్కిట్ కూడా చేయించినట్లు సమాచారం. బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్‌తో కుమారి ఆంటీ ఒకే స్టేజ్‌పై కనిపించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. బిగ్‌బాస్ ఉత్సవం షో త్వరలో స్టార్‌మాతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
గొడవలపై క్లారిటీ...
బిగ్‌బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ రీ యూనియన్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. పలువురు కంటెస్టెంట్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఈ ఫోటోలను షేర్‌చేశారు. బిగ్‌బాస్ సీజన్ 7 విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఎలాంటి అంచనాలు లేకుండా కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్‌టైటిల్ ఎగరేసుకుపోయాడు.
అమర్‌దీప్ చౌదరి రన్నరప్ స్థానంలో నిలిచాడు. బిగ్‌బాస్ ఫైనల్ రోజు జరిగిన గొడవల తర్వాత పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ బిగ్‌బాస్ ఉత్సవం ద్వారా ఒకే స్టేజ్‌పై మళ్లీ కనిపించబోతుండటం ఆసక్తికరంగా మారింది. బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ముగించుకొని బయటకు వెళుతోన్న క్రమంలో అమర్‌దీప్‌తో పాటు అతడి కుటుంబసభ్యులపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి ప్రయత్నించారు. పలు వాహనాల్ని ధ్వంసం చేశారు.
ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌తో పాటు అతడి అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫైనల్ రోజు జరిగిన గొడవపై బిగ్‌బాస్ ఉత్సవంలో పలవి ప్రశాంత్‌తో పాటు అమర్‌దీప్ చౌదరి క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
కుమారి ఆంటీపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ...
సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన కుమారి ఆంటీ జీవితం ఆధారంగా ఓ డాక్యుమెంటరీ రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుమారి ఆంటీ గురించి నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు సంబంధించిన ఓ వీడియో యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. ఈ వీడియో కారణంగా కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్‌కు జనాల తాకిడి పెరగడంతో ఆమె సోషల్ మీడియా సెలబ్రిటీగా మారింది.
కుమారి ఆంటీ ఫుడ్‌స్టాల్ కారణంగా ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతుందని, ఫుడ్‌స్టాల్‌ను అక్కడి నుంచి తరలించాలంటూ ట్రాఫిక్ పోలీసులు అర్డర్లు వేశారు. దాంతో సీఏం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకొని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌ను అక్కడి నుంచి తరలించవద్దని పోలీసులకు సూచించారు. త్వరలోనే తాను కుమారి ఆంటీని కలవబోతున్నట్లు స్టేట్‌మెంట్ ఇచ్చారు.
స్వయంగా సీఏం రేవత్ రెడ్డి... కుమారి ఆంటీకి అండగా నిలవడంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ఈ సంఘటనలన్నీ డాక్యుమెంటరీలో చూపించబోతున్నట్లు సమాచారం.