Bramayugam OTT: బ‌డ్జెట్ 15 కోట్లు - ఓటీటీ డీల్‌ 30 కోట్లు - మ‌మ్ముట్టి భ్ర‌మ‌యుగం మూవీకి బంప‌రాఫ‌ర్‌-mammootty bramayugam ott rights sold for a record price ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bramayugam Ott: బ‌డ్జెట్ 15 కోట్లు - ఓటీటీ డీల్‌ 30 కోట్లు - మ‌మ్ముట్టి భ్ర‌మ‌యుగం మూవీకి బంప‌రాఫ‌ర్‌

Bramayugam OTT: బ‌డ్జెట్ 15 కోట్లు - ఓటీటీ డీల్‌ 30 కోట్లు - మ‌మ్ముట్టి భ్ర‌మ‌యుగం మూవీకి బంప‌రాఫ‌ర్‌

Nelki Naresh Kumar HT Telugu
Feb 24, 2024 02:03 PM IST

Bramayugam OTT: మ‌మ్ముట్టి భ్ర‌మ‌యుగం ఓటీటీ రైట్స్ రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయాయి. ఈ హార‌ర్ మూవీ ఓటీటీ రైట్స్‌ను 30 కోట్ల‌కు సోనీలివ్ సొంతం చేసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

భ్ర‌మ‌యుగం ఓటీటీ
భ్ర‌మ‌యుగం ఓటీటీ

Bramayugam OTT: మ‌మ్ముట్టి భ్ర‌మ‌యుగం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరిమెంట‌ల్ మూవీగా ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకుంటోంది. బ్లాక్ అండ్ వైట్ ఫార్మెట్‌లో కేవ‌లం మూడు పాత్ర‌ల‌తో తెర‌కెక్కిన ఈ సినిమా మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది.

9 రోజుల్లోనే ఇర‌వై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగులో వారం ఆల‌స్యంగా ఈ శుక్ర‌వారం (ఫిబ్ర‌వ‌రి 23న‌) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. తెలుగులోనూ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద రిలీజైన సినిమాల్లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ సినిమాల్లో ఒక‌టిగా భ్ర‌మ‌యుగం నిలిచింది.

30 కోట్ల‌కు ఓటీటీ రైట్స్‌...

భ్ర‌మ‌యుగం ఓటీటీ డీల్ మ‌ల‌యాళ సినీ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. మ‌మ్ముట్టి బ్యాక్ టూ బ్యాక్ హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. అత‌డి గ‌త సినిమాలు క‌న్నూర్ స్క్వాడ్‌ వంద కోట్లు, కాథ‌ల్‌ యాభై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. మ‌రోవైపు భ్ర‌మ‌యుగం టీజ‌ర్స్‌, ట్రైల‌ర్స్ ఆడియెన్స్‌లో క్యూరియాసిటీ రేకెత్తించ‌డంతో ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డు ధ‌ర‌కు అమ్ముడుపోయిన‌ట్లు స‌మాచారం.

దాదాపు 30 కోట్ల‌కు సోనీ లివ్ భ్ర‌మ‌యుగం డిజిట‌ల్ హ‌క్కుల‌ను కొనుగోలు చేసిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌మ్ముట్టి కెరీర్‌లో అత్య‌ధిక ధ‌ర‌కు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన మూవీగా భ్ర‌మ‌యుగం నిలిచింది. మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల హ‌క్కులు మొత్తం సోనీ లివ్ ద‌క్కించుకున్న‌ట్లు తెలిసింది. మార్చి నెలాఖ‌రున సోనీ లివ్‌లో భ్ర‌మ‌యుగం స్ట్రీమింగ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

భ్ర‌మ‌యుగం క‌థ ఇదే...

ఓ మాంత్రికుడి ఇంట్లో బందీగా చిక్కుకున్న గాయ‌కుడి క‌థ‌తో ద‌ర్శ‌కుడు రాహుల్ స‌దాశివ‌న్ భ్ర‌మ‌యుగం సినిమాను తెర‌కెక్కించాడు. తేవాన్ ఓ గాయ‌కుడు. ఓ రోజు అడ‌విలో దారిత‌ప్పిన అత‌డు కుడుమోన్ పొట్టికి చెందిన పురాత‌న భ‌వంతిలో అడుగుపెడ‌తాడు. అడ‌వి మ‌ధ్య‌లో ఉన్న భ‌వంతిలో కుడుమోన్ పొట్టితో పాటు అత‌డి వంట‌వాడు మాత్ర‌మే ఉంటారు.

మాయ‌లు, మంత్రాల‌తో నిండిన ఆ ఇంటి నుంచి తేవాన్ పారిపోవాల‌ని ఎంత ప్ర‌య‌త్నించిన‌ అత‌డిని త‌న శ‌క్తుల‌తో కుడుమోన్ పొట్టి అడ్డుకుంటాడు. కుడుమోన్ పొట్టి అలా ఎందుకు చేస్తున్నాడు? తేవాన్‌ను చంపాల‌ని కుడుమోన్ పొట్టి అనుకోవ‌డానికి కార‌ణం ఏమిటి? అన్న‌దే ఈ సినిమా క‌థ‌. భ్ర‌మ‌యుగం సినిమాలో మ‌మ్ముట్టితో పాటు అర్జున్ అశోక‌న్‌, సిద్ధార్థ్ భ‌ర‌త‌న్ కీల‌క పాత్ర‌లు పోషించారు. సినిమా మొత్తంలో ఈ ముగ్గురు మాత్ర‌మే ఎక్కువ‌గా క‌నిపిస్తారు.

మ‌మ్ముట్టి విల‌న్‌...

కుడుమోన్ పొట్టిగా నెగెటివ్ రోల్‌లో మ‌మ్ముట్టి న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. అత‌డి లుక్‌, బాడీలాంగ్వేజ్‌కు అభిమానులు ఫిదా అవుతోన్నారు. డైలాగ్స్‌తోనే ఈ సినిమాలో విల‌నిజాన్ని పండించాడు మ‌మ్ముట్టి. ఇటీవ‌ల విడుద‌లైన అబ్ర‌హం ఓజ్ల‌ర్‌లో విల‌న్‌గా క‌నిపించాడు మ‌మ్ముట్టి. భ్ర‌మ‌యుగంతో వ‌రుస‌గా ఆరో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు మ‌మ్ముట్టి. ప్ర‌స్తుతం ట‌ర్బో, బ‌జూక‌తో పాటు మ‌రో సినిమా చేస్తున్నాడు. తెలుగులో వైఎస్ జ‌గ‌న్ బ‌యోపిక్‌గా తెర‌కెక్కిన యాత్ర 2లో మ‌మ్ముట్టి గెస్ట్ రోల్‌లో క‌నిపించాడు.

IPL_Entry_Point

టాపిక్