Aha Naa Pellanta TV Premiere: ఓటీటీ సూపర్ హిట్ కామెడీ సిరీస్ టీవీలో స్ట్రీమింగ్.. ఎక్కడ? ఎప్పుడంటే?
OTT Series Aha Naa Pellanta TV Premiere: యంగ్ హీరో రాజ్ తరుణ్, బ్యూటిఫుల్ శివానీ రాజశేఖర్ జోడీగా నటించిన కామెడీ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట. 2022 నవంబర్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌ను తాజాగా బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు.
Aha Naa Pellanta Series On TV: ఈ లీపు సంవత్సరాన్ని మరింత స్పెషల్‌గా మార్చేందుకు ఫిబ్రవరి 29న ప్రేక్షకులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇవ్వడానికి జీ సినిమాలు సిద్ధంగా ఉంది. సరికొత్త సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ సినిమాలు జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట. ఈ మొత్తం సీజన్‌ని ఒక సినిమాగా అందించనుంది. జీ5లో అత్యధికంగా వీక్షించిన తెలుగు సిరీస్ అహ నా పెళ్లంట. దీన్ని ఫిబ్రవరి 29 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేయనుంది.
ఓటీటీ జీ5 వేదికగా వీక్షకులను ఆకట్టుకున్న సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ సినిమాలు వేదికగా ప్రసారం కానుంది. ఓ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథను ఓ పెద్ద ట్విస్ట్‌తో చెప్పే కథే అహ నా పెళ్లంట. ఈ సిరీస్ కథ మొత్తం శీను (రాజ్ తరుణ్) చుట్టూ తిరుగుతుంది. స్కూల్లో జరిగిన సంఘటనతో జీవితంలో ఏ అమ్మాయిని చూడనని తండ్రికి మాటిస్తాడు శీను.
కానీ, అనుకోకుండా మహా (శివానీ రాజశేఖర్) శీను జీవితంలోకి వస్తుంది. తర్వాత ఊహంచని ట్విస్ట్‌తో కథ మలుపు తిరుగుతుంది. అసలు శీను స్కూల్లో జరిగిన సంఘటన ఏంటి? మహా, శీను జీవితాన్ని మారుస్తుందా? వీటికి సమాధానాలు తెలియాలంటే జీ సినిమాలులో సినిమాగా ప్రసారం కానున్న అహ నా పెళ్లంట సిరీస్ చూడాల్సిందే. ఓటీటీలో సబ్‌స్క్రిప్షన్ వల్ల చూడలేకపోయిన వారు బుల్లితెరపై ఎంచక్కా ఈ సిరీస్‌ను సినిమాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు.
జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంటలో హీరో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ నటి ఆమని కీలక పాత్ర పోషించింది. అలాగే నటుడు హర్షవర్ధన్ తండ్రి పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ కామెడీ సిరీస్‌కు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అహ నా పెళ్లంట ఈ గురువారం మీ ముందుకు రాబోతుంది, తప్పక చూడండి అంటూ జీ తెలుగు ప్రకటించింది.
ఇదిలా ఉంటే షార్ట్స్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయిన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండితెరపై తెరంగేట్రం చేశాడు. ఇందులో చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో రాజ్ తరుణ్ హీరోగా బాగా క్లిక్ అయ్యాడు. తర్వాత కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్తా మావ మూవీస్‌తో పాపులర్ మంచి హిట్స్ అందుకున్నాడు. దీంతో పాపులర్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్.
ఇటీవల నాగార్జున నటించి సూపర్ హిట్ కొట్టిన నా సామిరంగ సినిమాలో కీలక పాత్ర పోషించాడు రాజ్ తరుణ్. ఇక జీవిత, రాజశేఖర్ దంపతుల కూతురిగా శివాని రాజశేఖర్ హీరోయిన్‌గా తెలుగు చిత్రసీమకు పరిచయం అయింది. తమిళంలో ముందుగా సినిమాలు చేసినప్పటికీ తెలుగులో మాత్రం అద్భుతం అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల కోటబొమ్మాళీ పీఎస్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది.