Yatra 2 OTT: యాత్ర 2 రిలీజయ్యేది ఆ ఓటీటీలోనేనా? - స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Yatra 2 OTT: ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Yatra 2 OTT: ప్రస్తుతం టాలీవుడ్‌లో పొలిటికల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో ఇటీవలే ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైఎస్ జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించిన ఈ సినిమాలో మమ్ముట్టి గెస్ట్ రోల్‌లో కనిపించాడు. 2019లో రిలీజైన యాత్రకు సీక్వెల్‌గా దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 మూవీని తెరకెక్కించాడు.
30 కోట్ల బడ్జెట్...
ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. కమర్షియల్ సినిమా రేంజ్‌లో ఈ పొలిటికల్ మూవీని 30 కోట్లకుపైనే బడ్జెట్‌తో తెరకెక్కించారు. సినిమాపై ఉన్న హైప్‌తో పాటు భారీగా ప్రమోషన్స్ చేయడంతో ఫస్ట్ డే యాత్ర 2 రెండున్నర కోట్లవరకు కలెక్షన్స్ రాబట్టింది. మిక్స్‌డ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచి వసూళ్లు తగ్గుతూ వచ్చాయి. ఫస్ట్ వీక్‌లో కేవలం ఏడుకోట్ల వరకు గ్రాస్‌ను, మూడున్నర కోట్ల షేర్‌ను రాబట్టింది.
నైజాంలో పూర్తిగా ఈ మూవీ తేలిపోయింది. వారం రోజుల్లో యాభై లక్షల వరకు మాత్రమే కలెక్షన్స్ వచ్చాయి. ఏపీలో మోస్తారు కలెక్షన్స్ దక్కించుకున్నది. ఓవరాల్‌గా థియేట్రికల్ రన్‌లో పది కోట్లలోపు వసూళ్లను రాబట్టిన యాత్ర 2 నిర్మాతలకు భారీగా నష్టాలను మిగిల్చినట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ గురించి అందరికి తెలిసిన కథనే దర్శకుడు ఈ సినిమాలో చూపించడం, జగన్‌లోని పాజిటివ్ కోణాలను మాత్రమే టచ్ చేస్తూకథను రాసుకోవడం యాత్ర 2 పరాజయానికి కారణమని ప్రచారం జరుగుతోంది.
అమెజాన్ ప్రైమ్...
యాత్ర 2 ఓటీటీ రైట్స్ ఇంకా అమ్ముడుపోలేదని తెలిసింది. పొటిలిటికల్ మూవీ కావడంతో కాంట్రవర్సీలు ఉంటాయనే భయంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ యాత్ర 2ను కొనడానికి ముందుకు రానట్లు తెలిసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌తో దర్శకనిర్మాతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
దాదాపుగా డీల్ ఒకే అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్‌లోనే జగన్ బయోపిక్ రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు. . మార్చి సెకండ్ వీక్‌లో యాత్ర 2 ఓటీటీలో రానున్నట్లు తెలిసింది. యాత్ర 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
పదేళ్ల రాజకీయ పరిణామాలు...
జగన్ జీవితంలో 2009 నుంచి 2019 వరకు జరిగిన పరిణామాలతో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 సినిమాను తెరకెక్కించారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలేయడానికి దారితీసిన పరిణామాలు, సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ప్రజల మద్ధతుతో తొలిసారి సీఏంగా ఎలా ఎన్నికయ్యాడన్నది యాత్ర 2లో ఎమోషనల్‌గా ఆవిష్కరించారు డైరెక్టర్ మహి వి రాఘవ్.
ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, వైఎస్ భారతి పాత్రలో కేతకీ నారయణన్ నటించారు. ఈ సినిమాలో సోనియా గాంధీ, కేవీపీ, కొడాలి నానితో పాటు చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్‌ను ఈ సినిమాలో క్రియేట్ చేశారు. వాటిలో కొన్ని సీన్స్ వర్కవుట్ అయ్యాయి. యాత్ర 2 మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు.
టాపిక్