Praveen IPS Trailer: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బయోపిక్ ట్రైలర్ వచ్చేసింది - ఎలెక్షన్ టైమ్‌లో పొలిటికల్ మూవీ రిలీజ్
Praveen IPS Trailer: బీఎస్‌పీ తెలంగాణ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ప్రవీణ్ ఐపీఎస్ మూవీ ట్రైలర్ రిలీజైంది. ఈ సినిమాలో ప్రవీణ్ కుమార్ పాత్రలో నందకిషోర్ కనిపించబోతున్నాడు.
Praveen IPS Trailer: బీఎస్‌పీ పార్టీ తెలంగాణ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ జీవితం ఆధారంగా ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ప్రవీణ్ ఐపీఎస్ అనే పేరును ఖరారు చేశారు. ఈ బయోపిక్ ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. తల్లీకొడుకుల ఎమోషన్‌తో పాటు కుల వివక్షను ఆవిష్కరిస్తూ ట్రైలర్ ఆసక్తికరంగా మారింది. తన బతుకును మార్చుకోవడానికి పుస్తకాన్నే ఆయుధంగా చేసుకోవాలని ప్రవీణ్ ఎలా నిర్ణయించుకున్నాడు? చదువు కోసం కాలేజీలో చేరిన అతడికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నది ట్రైలర్‌లో రియలిస్టిక్‌గా ఆవిష్కరించారు.
డైలాగ్ హైలైట్...
ఎవడో వస్తాడే. ఏదో చేస్తాడు. మనబతుకుల్ని మారుస్తాడు అని అందరూ అనుకుంటారు. వచ్చేవాడు నేనే ఎందుకు అవకూడదని తెగించి ముందుకు దూకినవాడే గొప్పవాడు అవుతాడనే డైలాగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ ఆఫీసర్‌గా సంఘవిద్రోహక శక్తులను ఎలా ఎదురించాడన్నది యాక్షన్ అంశాలతో చూపించారు. చివరకు ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి ఎందుకు రావాలని నిర్ణయించుకున్నాడన్నది ట్రైలర్‌లో టచ్ చేశారు. ప్రవీణ్ IPS ట్రైలర్ ను సీనియర్ డైరెక్టర్ సి.ఉమామహేశ్వరరావు, ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల విడుదల చేశారు.ఐరా ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్పై మామిడాల నీల ప్రొడ్యూసర్గా నిర్మితమైన ప్రవీణ్ IPS ఈ నెల 16న రిలీజ్ కానుంది
ఎలెక్షన్ టైమ్‌లో రిలీజ్...
సి. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... ప్రవీణ్ IPS జన హృదయాలను కదిలించే మంచి మూవీ అవుతుందని సీనియర్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు అన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ గురుకులాల కార్యదర్శిగా విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసకొచ్చారని వివేక్ కూచిభొట్ట అన్నాడు. పూర్ణ మలావత్, ఆనంద్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేలా వారిలో ప్రవీణ్ స్ఫూర్తిని నింపారని గుర్తు చేశారు ఎలక్షన్ టైమ్‌లో రిలీజ్ అవుతోన్న ప్రవీణ్ IPS పెద్ద సక్సెస్ కావాలని అన్నాడు.
ప్రవీణ్ కుమార్ పాత్రకు...
హీరో నంద కిషోర్ మాట్లాడుతూ ప్రవీణ్ IPSలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రోల్ పోషించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. ప్రొడ్యూసర్ వివేక్ కూచిభొట్ల ద్వారా తనకు ఈ బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చిందని పేర్కొన్నాడు. ప్రవీణ్ కుమార్ సంకల్పం చాలా గొప్పదని, ఆయన ఎంతో మందికి ఆదర్శమని అన్నాడు. ప్రవీణ్ కుమార్ పాత్రకు న్యాయం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశానని తెలిపారు.
మూడు పార్టులుగా బయోపిక్...
ప్రవీణ్ IPS మూవీ తనకు డెబ్యూ మూవీ అని డైరెక్టర్ దుర్గాదేవ్ నాయుడు అన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జీవితాన్ని మూడు పార్టులుగా మూడు సినిమాలు తీయాలని అనుకున్నామని. కానీ చివరకు సెలెక్టివ్ అంశాలను తీసుకొని ఒకే పార్ట్‌గా ప్రవీణ్ IPS మూవీ తీశామని అన్నారు. ప్రవీణ్ కుమార్ పాత్రలో నందకిషోర్ జీవించాడని డైరెక్టర్ తెలిపాడు. ప్రవీణ్ కుమార్ సతీమణి లక్ష్మీబాయి పాత్రలో హీరోయిన్ రోజా కనిపిస్తుందని డైరెక్టర్ చెప్పాడు. హీరోయిన్ రోజా మాట్లాడుతూ విద్యాప్రాముఖ్యతను చాటిచెప్పే మూవీ ఇదని, చిన్న పిల్లలకు ఈ సినిమాను చూపించాల్సిన అవసరముందని చెప్పారు.
సీరియల్ ఆర్టిస్ట్
సీరియల్ ఆర్టిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్న నందకిషోర్ పోతోపోనీ, ద్రోణ, మిథునంతో పాటు చాలా సినిమాలు చేశాడు. మంచు పల్లకి, సింధూరం, కాంచనగంగతో పాలు చాలా సీరియల్స్‌లో లీడ్ రోల్ చేశాడు.
టాపిక్