Lal Salaam Collections:లాల్ సలామ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ - రజనీ కెరీర్‌లో దారుణమైన డిజాస్టర్- కోటి కూడా రాలేదు
Lal Salaam Collections: రజనీకాంత్ తెలుగు డబ్బింగ్ మూవీస్‌లో అతి తక్కువ వసూళ్లను రాబట్టిన మూవీగా లాల్ సలామ్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. వారం రోజుల్లో లాల్ సలామ్ తెలుగు వెర్షన్‌కు 90 లక్షలు మాత్రమే వసూళ్లు వచ్చినట్లు తెలిసింది.
Lal Salaam Collections: లాల్ సలామ్ మూవీ రజనీకాంత్ కెరీర్‌లోనే దారుణమైన డిజాస్టర్‌గా నిలిచింది. తెలుగులో రిలీజైన రజనీకాంత్ డబ్బింగ్ మూవీస్‌లో అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాగా లాల్ సలామ్ చెత్త రికార్డును మూటగట్టుకున్నది. వారం రోజుల్లో ఈ సినిమా తెలుగు వెర్షన్ 90 లక్షల లోపు కలెక్షన్స్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఏడు రోజుల్లో లాల్ సలామ్ తమిళ వెర్షన్‌కు పదహారు కోట్లు, కేరళలో అరవై ఐదు లక్షలు, కర్ణాటకలో 1.4 కోట్లు, నార్త్‌లో ఇరవై ఐదు లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. మొత్తంగా వారం రోజుల్లో ఈ మూవీ ఇండియా వైడ్‌గా 19.3 కోట్ల కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఓవర్‌సీస్‌లో ఫస్ట్ వీక్‌లో ఈ మూవీకి ఏడు కోట్ల వసూళ్లు వచ్చినట్లు చెబుతోన్నారు. మొత్తంగా వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ఫస్ట్ వీక్‌లో తమిళం, తెలుగు భాషల్లో కలిపి 27 కోట్ల గ్రాస్, 13 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
అరవై కోట్ల బడ్జెట్...
దాదాపు అరవై కోట్ల బడ్జెట్‌లో లాల్ సలామ్ మూవీని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. తెలుగు, తమిళ భాషల్లో కలిపి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 35 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం. ఇప్పటికే తెలుగులో ఈ సినిమాను థియేటర్ల నుంచి ఎత్తేశారు. తమిళంలో కూడా నెగెటివ్ కారణంగా రోజురోజుకు వసూళ్లు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో లాల్ సలామ్ నిర్మాతకు నలభై కోట్లకుపైనే నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని చెబుతోన్నారు.
తొమ్మిదేళ్ల తర్వాత...
లాల్ సలామ్ సినిమాకు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించింది. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత లాల్ సలామ్‌తో ఐశ్వర్య దర్శకురాలిగా రీఎంట్రీ ఇచ్చింది. లాల్ సలామ్ సినిమాలో విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. రజనీకాంత్ ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ చేశాడు.
లాల్ సలామ్ కథ ఇదే...
మెయిద్దీన్ (రజనీకాంత్) తన కొడుకు షంషుద్దీన్‌ను (విక్రాంత్) క్రికెటర్ చేయాలని కలలు కంటాడు. రాజకీయ కుట్రల కారణంగా మెయిద్దీన్ ఊరు కసుమూరు రెండు వర్గాలుగా విడిపోతుంది. ఊళ్లో జరిగే క్రికెట్ మ్యాచ్‌లో షంషుద్దీన్ చేయిని గురు (విష్ణువిశాల్) నరికేస్తాడు. గురు ఎవరు? కొడుకుపై జరిగిన ఎటాక్‌పై మెయిద్దీన్ ఎలా రివేంజ్ తీర్చుకున్నాడు అన్నదే ఈ మూవీ కథ. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఐశ్వర్య రజనీకాంత్ ఈ మూవీని తెరకెక్కించింది. కానీ కథ , కథనాల్లో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. క్రికెట్ ఆటకు మెయిన్ పాయింట్‌కు కనెక్టివిటీ సరిగా కుదరలేదు. రజనీకాంత్ క్యారెక్టర్ కూడా ఆశించిన స్థాయిలో పవర్‌ఫుల్‌గా లేకపోవడంతో అభిమానులు డిసపాయింట్ అయ్యారు. లాల్ సలామ్ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
అమితాబ్‌బచ్చన్‌తో...
జైలర్‌తో గత ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న రజనీకాంత్ ప్రస్తుతం జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేళ్ దర్శకత్వంలో వెట్టైయాన్ అనే సినిమా చేస్తున్నాడు. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో అమితాబ్ బచ్చన్ తో పాటు రానా, ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తోన్నారు. లోకేష్ కనకరాజ్‌తో రజనీకాంత్ ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ ఏడాది ఈ మూవీ సెట్స్‌పైకి రానుంది.