Akaay Name Meaning: కుమారుడికి 'అకాయ్' అని పేరు పెట్టిన కోహ్లీ, అనుష్క: దీని అర్థమేంటంటే..-anushka sharma virat kohli newborn son akaay name meaning ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Akaay Name Meaning: కుమారుడికి 'అకాయ్' అని పేరు పెట్టిన కోహ్లీ, అనుష్క: దీని అర్థమేంటంటే..

Akaay Name Meaning: కుమారుడికి 'అకాయ్' అని పేరు పెట్టిన కోహ్లీ, అనుష్క: దీని అర్థమేంటంటే..

Published Feb 20, 2024 10:47 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 20, 2024 10:47 PM IST

  • Virat Kohli - Anushka Sharma Akaay Name: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ దంపతులు కుమారుడిని ఆహ్వానించారు. తాము రెండో సంతానాన్ని పొందామని వారు నేడు (ఫిబ్రవరి 20) ప్రకటించారు. తమ కుమారుడికి అకాయ్ అనే పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో తెలిపారు.

భారత్ స్టార్ ప్లేయర్, బాలీవుడ్ నటి అనుష్క శర్మ గుడ్‍న్యూస్ చెప్పారు. తమకు రెండో సంతానం కలిగినట్టు తెలిపారు. ఫిబ్రవరి 15న మగపిల్లాడికి అనుష్క జన్మనిచ్చారు. ఈ విషయాన్ని నేడు (ఫిబ్రవరి 20, 2024) వెల్లడించారు. 

(1 / 6)

(Instagram)

తమకు కుమారుడికి అకాయ్ (Akaay) అని పేరు పెట్టినట్టు విరాట్, అనుష్క తెలిపారు. ఈ అందమైన సమయంలో అందరి ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు కావాలని ఇన్‍స్టాగ్రామ్‍‍లో పోస్ట్ చేశారు. 

(2 / 6)

విరాట్, అనుష్క తమ కుమారుడికి అకాయ్ అని పేరు పెట్టడంతో దీని అర్థమేంటని చాలా మంది నెట్టింట్లో వెతికేస్తున్నారు. 

(3 / 6)

అకాయ్ అనే పేరుకు ఐక్యత, ఏకత్వం అని అర్థమని తెలుస్తోంది. సంస్కృత పదమైన ఐక్య, కాయా నుంచి ఈ పేరును తీసుకున్నారు. అపరిమిత శక్తి అని కూడా దీనికి అర్థంగా ఉంది. అకాయ్ అనే పేరు టర్కిష్ మూలానికి చెందినది కూడా. దాని ప్రకారం అకాయ్ అంటే ‘ప్రకాశించే చంద్రుడు’ అని అర్థం వస్తుంది. 

(4 / 6)

అకాయ్ పేరులో అనుష్క, కోహ్లీ పేరు కూడా కలుస్తోంది. అనుష్కలోని ‘అ’, కోహ్లీలోని ‘క’ శబ్దాలతో ఈ పేరు ప్రారంభమైంది. 

(5 / 6)

ఇక, 2021లో జన్మించిన తమ కుమార్తెకు వామిక అని పేరు పెట్టారు విరుష్క దంపతులు. ఆ పేరుకు దుర్గాదేవి అని అర్థం. విరాట్, అనుష్కకు 2017లో వివాహమైంది. 

(6 / 6)

ఇతర గ్యాలరీలు