Guppedantha Manasu Today Episode: వసును దెబ్బకొట్టిన శైలేంద్ర - రిషి రీఎంట్రీకి టైమొచ్చిందా? - మారిన అనుపమ
Guppedantha Manasu March 5th Episode: మను పట్ల అనుపమ మనసులో ఉన్న కోపం ద్వేషం మెళ్లమెళ్లగా తొలగిపోతుంటాయి. తన కోసమే కావాలని వసుధార ఫ్యామిలీకి మను దగ్గరయ్యాడని భ్రమపడుతుంది. కానీ అవన్నీ నిజాలు కావని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu March 5th Episode: మిషన్ ఎడ్యుకేషన్ పని మీద వసుధార ఒంటరిగా బయటకు వెళుతోండగా కారు రిపేర్ అవుతోంది. మను ఆమెకు లిఫ్ట్ ఇస్తాడు. రిషి, మను కారులో వెళ్లడం శైలేంద్ర చూస్తాడు. ఆ సీన్‌ను రాజీవ్‌కు చూపిస్తాడు. వసుధారతో మను క్లోజ్‌గా మూవ్ కావడం రాజీవ్ తట్టుకోలేకపోతాడు. ఇద్దరు ఒకే కారులో వెళ్లడం చూసి కోపంతో రగిలిపోతాడు. మనును లేపేయాలని రాజీవ్ ఆవేశపడతాడు. కానీ శైలేంద్ర అతడిని అడ్డుకుంటాడు. సిట్యువేషన్ మనకు అనుకూలంగా మారిందని, వసుధారతో పాటు మనును దెబ్బకొట్టే ఐడియా తనకు తట్టిందని రాజీవ్ కోపాన్ని కంట్రోల్ చేస్తాడు.
రిషి దగ్గరకు...
వసుధార ఎక్కడికి వెళుతుంది తెలియక మను టెన్షన్ పడతాడు. చివరకు ఎక్కడికి వెళుతున్నామని, ఆ సీక్రెట్ ప్లేస్ ఏదో చెప్పమని వసుధారను అడుగుతాడు మను. రిషి సార్ దగ్గరకు అని చెప్పి అతడికి షాక్ ఇస్తుంది. రిషితో తాను సంతోషంగా గడిపిన ప్లేస్‌కు వెళుతున్నామని చెబుతుంది. ఓ బస్తీకి తీసుకెళుతుంది. బస్తీ చూడగానే వసుధార ఎమోషనల్ అవుతుంది. రిషితో తాను ఆనందంగా గడిపిన జ్ఞాపకాలు ఒక్కొక్కటి గుర్తుచేసుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
మను అండతో...
మిషన్ ఎడ్యుకేషన్ పనుల మీద వసుధార, మను ఇద్దరే బస్తీకి వెళ్లారని తెలిసి మహేంద్ర ఆశ్చర్యపోతాడు. రిషి దూరమైన తర్వాత ఒంటరిగా మారిన తనకు మను అండగా నిలుస్తున్నాడని, అతడి వల్లే బాధ నుంచి బయటపడగలుగుతున్నానని మహేంద్రతో అంటుంది వసుధార. మను ఇంటికి వెళ్లబోతుండగా మహేంద్ర ఆపుతాడు. భోజనం చేసి వెళ్లమని అంటాడు. కానీ మను వద్దని చెబుతాడు. మంచినీళ్లు చాలని అంటాడు. అనుపమ వాటర్ ఇస్తుంది. అతడివైపు ప్రేమగా చూస్తుంది.
అనుపమ అపార్థాలు...
మను పట్ల అనుపమ మనసులో ఉన్న ఒక్కో అపార్థం తొలగిపోతుంటుంది. తన కోసమే వసుధార ఫ్యామిలీకి మను దగ్గరయ్యాడని ఇన్నాళ్లు అనుకుంటాడు. అనుపమ ఆలోచనలు వట్టి అపోహలే అని తేలుతుంటుంది. మను మంచి తనాన్ని అర్థం చేసుకుంటుంది. మనుతో తనకు ఉన్న రిలేషన్‌షిప్‌ను బయటపెట్టేందుకు టైమ్ వచ్చిందని అనుపమ అనుకుంటుంది. మనుకు, అనుపమ ఉన్న బంధం ఏమిటన్నది నేటి ఎపిసోడ్లో రివీల్ అవుతుందా? లేదా? అన్నది చూడాల్సిందే.
కాలేజీలో పుకార్లు…
వసుధారను దెబ్బకొట్టేందుకు శైలేంద్ర మరో స్కెచ్ వేస్తాడు. మను, వసుధార రిలేషన్‌షిప్‌పై కాలేజీలో లేనిపోని పుకార్లు సృష్టిస్తాడు. అతడి మాటలు నిజమని స్టూడెంట్స్‌తో పాటు లెక్చరర్లు నమ్ముతారు. శైలేంద్ర ప్లాన్‌ను వసుధార, మను కలిసి ఎలా తిప్పికొట్టారన్నది నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్లో ఆసక్తికరంగా ఉండనుంది.
రిషి బతికే ఉన్నాడా?
రిషిని మూడు నెలల్లో తిరిగి తీసుకొస్తానని అందరి ముందు ఛాలెంజ్ చేసిన విషయం గుర్తొచ్చి వసుధార టెన్షన్ పడుతుంటుంది. రిషి ఏమయ్యాడో, ఎక్కడున్నాడో తెలియక తల్లడిల్లిపోతుంది. రిషి ఫొటో చూస్తూ మీరు ఎక్కడున్నా నేను కనిపెడతానని, త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటానని అంటుంది. వసుధార మనసు చెప్పినట్లుగా రిషి నిజంగానే బతికి ఉన్నాడా? లేదా? అన్నది తెలియాలంటే నేటి గుప్పెడంత మనసు సీరియల్ చూడాల్సిందే.