Guppedantha Manasu March 2nd Episode: గుప్పెడంత మనసు సీరియల్ - రిషి కోసం ఏంజెల్ కన్నీళ్లు - ఒక్కటైన వసుధార, మను
Guppedantha Manasu March 2nd Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి చనిపోయాడని తెలిసి ఏంజెల్ ఎమోషనల్ అవుతుంది. అనుపమను ఏంజెల్ అత్తయ్య అని పిలవడం చూసి మను షాకవుతాడు. అనుపమ, ఏంజెల్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ గురించి ఆరాలు తీస్తాడు.
Guppedantha Manasu March 2nd Episode: మను మంచితనాన్ని వసుధార అర్థం చేసుకుంటుంది. అతడితో సీరియస్‌గా ఉన్నందుకు, అనుమానించినందుకు క్షమాపణలు చెబుతుంది. కాలేజీతో పాటు వసుధారకు తోడుగా ఉంటానని తనకు మాటివ్వమని మనును కోరుతాడు మహేంద్ర. అందుకు మను అంగీకరిస్తాడు.
డీబీఎస్‌టీ కాలేజీకి ఏంజెల్...
ఏంజెల్ డీబీఎస్‌టీ కాలేజీకి వస్తుంది. ఆమెను అక్కడ చూసి అనుపమ షాకవుతుంది. విషాదంగా ఏదో కోల్పోయిన దానిలా ఏంజెల్ కనిపిస్తుంది. సడెన్‌గా కాలేజీకి వచ్చావు ఏమైంది అని ఏంజెల్‌ను అడుగుతుంది అనుపమ. వచ్చి రావడంతోనే రిషి ఎక్కడున్నాడని అనుపమను నిలదీస్తుంది ఏంజెల్.
రిషి లేడు కదా...ఈ లోకంలోనే లేడుకదా అని కన్నీళ్లతో అనుపమను అడుగుతుంది. రిషి లేడని తెలిసింది. ఆ విషయం వినగానే నా గుండె ఆగిపోయినంత పనైంది. అది నిజమో, అబద్ధమో తెలుసుకోవాలని వచ్చానని అనుపమతో చెబుతుంది ఏంజెల్. రిషి తన ప్రాణ స్నేహితుడని, అతడు చనిపోయిన విషయం తనకు ఎందుకు చెప్పలేదని అనుపమను నిలదీస్తుంది ఏంజెల్.
కుట్రలు..కుతంత్రాలు...
ఇక్కడ కుట్రలు, కుతంత్రాల మధ్య రిషి ఫ్యామిలీ నలిగిపోతుంది. అందుకే నీకు ఏం చెప్పాలో తెలియలేదని ఏంజెల్‌కు అనుపమ బదులిస్తుంది. ఓ సమస్య పరిష్కారం కాగానే మరో సమస్య ఎదురవుతుందని ఏంజెల్‌తో అంటుంది అనుపమ.
రిషి చనిపోలేదు...
రిషి చనిపోలేదని నా మనసు చెబుతుందని అనుపమతో అంటుంది ఏంజెల్. రిషి కనిపించకపోవడం నిజం. కానీ రిషి బతికి ఉన్నాడా? చనిపోయాడా అన్నది తేల్చుకోలేకపోతున్నామని అనుపమ జవాబిస్తుంది. జగతి హంతకుల్ని పట్టుకునే క్రమంలో రిషి మిస్సయ్యాడని, ధైర్యంతో కష్టపడి రిషి ఆచూకీని వసుధార కనిపెట్టిందని ఏంజెల్‌కు చెబుతుంది అనుపమ.
ఆ తర్వాత కాలేజీ ఫెస్ట్‌కు అటెండ్ కావడానికి వస్తోన్న క్రమంలో రిషి మళ్లీ కనిపించకుండా, గుర్తుతెలియని డెడ్‌బాడీ పోలీసులకు దొరికిందని, ఆ డెడ్‌బాడీకి చేసిన డీఎన్ఏ టెస్ట్‌లో అది రిషిదేనని తేలిందని అనుపమ అంటుంది. కానీ రిషి చనిపోయాడు అంటే వసుధార నమ్మడం లేదని, రిషి ఉన్నాడనే వాదిస్తుందని ఏంజెల్‌తో చెబుతుంది అనుపమ.
మాటిచ్చిన ఏంజెల్...
అప్పుడే ఒక్కడికి వసుధార వస్తుంది. ఏంజెల్ కన్నీళ్లతో ఎమోషనల్‌గా కనిపించడం చూసి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. రిషి బతికే ఉన్నాడు. అతడిని నేను తిరిగి తీసుకొస్తాను. అందరు నా మాట నమ్ముతున్నారు. నువ్వు కూడా నమ్ము అని ఏంజెల్‌తో అంటుంది వసుధార. రిషి విషయంలోనే కాదు ఏ విషయంలోనైనా నీకు నేను సపోర్ట్‌గా ఉంటానని వసుధారకు మాటిస్తుంది ఏంజెల్.
మను పరిచయం...
మనును చూసి ఇతడు ఎవరు అని వసుధారను అడుగుతుంది ఏంజెల్. కాలేజీ కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడాడని, రిషి విషయంలో తనకు సపోర్ట్ చేస్తున్నాడని మనును ఏంజెల్‌కు పరిచయం చేస్తుంది వసుధార. అనుపమను ఏంజెల్ అత్తయ్య అని పిలవడం చూసి మను ఆశ్చర్యపోతాడు.
వాళ్ల మధ్య ఉన్న రిలేషన్ ఏమిటోనని ఆలోచిస్తుంటాడు. వసుధారకు సాయం చేస్తున్నందుకు మనుకు థాంక్స్ చెబుతుంది ఏంజెల్. రిషి, వసుధారల ప్రేమ కథ గురించి మనుకు చెబుతుంటుంది ఏంజెల్. వాళ్లిద్దరు ఆనందంగా మాట్లాడుకోవడం చూసి అనుపమ కంగారు పడుతుంది. మను తన గతం ఎక్కడ బయటపెడతాడో అని గాభరా పడుతుంది.
మను ఆరాలు...
అనుపమను అత్తయ్య అని ఎందుకు పిలిచారని ఏంజెల్‌ను అడుగుతాడు మను. తను నాకు మేనత్త అవుతుందని మనుకు బదులిస్తుంది ఏంజెల్. ఏంజెల్ ఫ్యామిలీ గురించి మను ఆరాలు తీస్తాడు. తన తాతయ్య పేరును మనుకు ఏంజెల్ చెబుతోండగా అనుపమ వచ్చి అడ్డుకుంటుంది. టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఏంజెల్‌ను పంపించేస్తుంది. అనుపమ కావాలనే ఇదంతా చేసిందని మను అర్థం చేసుకుంటుంది.
శైలేంద్ర కోపం...
శైలేంద్రను కలుస్తాడు రాజీవ్. మను తమ కలలకు అడ్డుగా నిలవడం ఇద్దరు తట్టుకోలేకపోతారు. మను తమకు శనిగా దాపరించాడని, ఇద్దరికి చుక్కలు చూపిస్తున్నాడని రాజీవ్ అసహనం వ్యక్తం చేస్తాడు. శైలేంద్ర ఆవేశానికి లోనవుతాడు. కారును గట్టిగా కొడతాడు. వసుధార కోసం వెధవలా మారిపోయాను. తనను దక్కించుకోవడం కోసం నాకు అడ్డుగా ఉన్న భార్యను కూడా చంపేశానని శైలేంద్రతో అంటాడు రాజీవ్. అతడి మాటలు వినగానే శైలేంద్ర షాకవుతాడు.
తాము చేసిన వెధవ పనుల గురించి ఇద్దరు మాట్లాడుకుంటారు. మనును ఎదుర్కొనడానికి విడివిడిగా కాకుండా కలిసికట్టుగా పనిచేయాలని శైలేంద్ర, రాజీవ్ ఫిక్సవుతారు. ఇక నుంచి వసుధారను నేను ఎలా దక్కించుకోవాలో నువ్వు ఐడియా ఇవ్వు. నీకు ఎండీ సీట్ ఎలా దక్కుతుందో నేను ఐడియా ఇస్తానని శైలేంద్రకు సలహా ఇస్తాడు రాజీవ్. శైలేంద్ర అందుకు ఒప్పుకుంటాడు.
కాలేజీ నుంచి వసుధార ఇంటికి వెళుతోండగా ఆమె కారు రిపేర్ అవుతుంది. అప్పుడే మను అక్కడికి వస్తాడు. కారు రిపేర్ తాను చేస్తానని అంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.