Guppedantha Manasu September 22nd Episode: ఏంజెల్‌ను పెళ్లిచేసుకోమని రిషిని కోరిన వసుధార - పాండ్యన్ డౌట్
Guppedantha Manasu September 22nd Episode: ఏంజెల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రిషికి పాండ్యన్ ఇంట్లో ఆశ్రయం కల్పిస్తుంది వసుధార. అతడు అక్కడ సౌకర్యంగా ఉండేలా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వసుధార ప్లాన్‌ను రిషి కనిపెడతాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే....
Guppedantha Manasu September 22nd Episode: రిషి అడ్డుతొలిగితేనే డీబీఎస్‌టీ కాలేజీ తన సొంతం అవుతుందని శైలేంద్ర భావిస్తాడు. రిషి ప్రాణాలు తీయాలని నిర్ణయించుకుంటాడు. మరోవైపు జగతి, మహేంద్రలపై భర్తకున్న కోపాన్ని మరింత పెంచేందుకు దేవయాని కొత్త నాటకం మొదలుపెడుతుంది. రిషి ఆచూకీ తెలిసినా కూడా జగతి, మహేంద్ర అతడిని తిరిగి ఇంటికి తీసుకురాలేకపోయారని కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా యాక్టింగ్ చేస్తుంది. రిషిని తాను వెళ్లి తీసుకొస్తానని అంటుంది.
కానీ ఎవరూ ఆమెను ఆపకపోవడంతో కళ్లు తిరిగిపడిపోయినట్లుగా నటిస్తుంది. శైలేంద్ర కూడా ఎమోషనల్ అయినట్లుగా ఓవర్ యాక్టింగ్ చేస్తూ తల్లి నాటకాన్ని మరింత రక్తికట్టిస్తాడు. రిషి కోసం నీ ప్రాణం మీదికి తెచ్చుకుంటావా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు.
దేవయాని నాటకాన్ని కనిపెట్టలేని భర్త ఫణీంద్ర ఆమెనే సపోర్ట్ చేస్తాడు. జగతి, మహేంద్రలను తప్పు పడతాడు. ఈ సమస్య వచ్చింది మీ వల్లే కాబట్టి దీనికి ఓ పరిష్కారం మీరే సూచించాలని ఇద్దరికి వార్నింగ్ ఇస్తాడు. దేవయాని కోసం రిషిని ఇంటికి తిరిగి తీసుకురావాలని చెబుతాడు.
వసుధార కంగారు...
ఏంజెల్ ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రిషికి అతడికే తెలియకుండా పాండ్యన్ ఇంట్లో ఆశ్రయం కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేస్తుంది వసుధార. రిషికి నచ్చినట్లుగా రూమ్‌ను డిజైన్ చేస్తుంది. అతడి కోసం ప్రత్యేకంగా వంటలు చేస్తుంది. వసుధారే ఇవన్నీ చేసిందని రిషి కనిపెడతాడు.
తానే ఈ ఏర్పాట్లు చేస్తోన్నట్లు రిషికి నిజం తెలిసిపోయిందని పాండ్యన్ ద్వారా విన్న వసుధార కంగారు పడుతుంది. అతడు అక్కడి నుంచి కూడా వెళ్లిపోతాడని భయపడుతుంది. కానీ రిషి ఇక్కడే ఉండటానికి ఒప్పుకున్నాడని వసుధారతో అంటాడు పాండ్యన్.
పాండ్యన్ డౌట్...
రిషి ఇష్టాలు, అభిరుచులు అన్ని వసుధారకు తెలియడంతో వారి బంధంపై పాండ్యన్‌కు అనుమానం వస్తుంది. మీ ఇద్దరిని చూస్తుంటే గతంలో పరిచయం ఉందని అనిపిస్తుందని వసుధారతో అంటాడు పాండ్యన్.
విష్ కాలేజీలోనే రిషితో తన పరిచయం మొదలైందని అబద్ధం ఆడుతుంది వసుధార. కానీ పాండ్యన్ ఆమె మాటలను నమ్మడు. మీరు చేసిన పనుల్ని రిషి సార్ ఈజీగా కనిపెడుతున్నాడని, కొద్ది రోజుల పరిచయంలో అది సాధ్యం కాదని అంటాడు. కానీ తెలివిగా టాపిక్ డైవర్ట్ చేసి నిజాన్ని బయటపడకుండా చేస్తుంది వసుధార.
వసుధార వంట...
రిషి కోసం దగ్గరుండి భోజనం ఏర్పాట్లు చేస్తాడు పాండ్యన్. ఆ ఫుడ్ టేస్ట్ చూసి వసుధార వంట చేసిందని రిషి కనిపెడతాడు. మీ మేడమ్ ఇక్కడ లేదని అబద్ధం చెప్పకుండా వెంటనే తన దగ్గరకు వసుధారను తీసుకురమ్మనిపాండ్యన్‌కు ఆర్డర్ వేస్తాడు.
రిషి దగ్గరకు వెళితే అతడు ఎలా రియాక్ట్ అవుతాడో అని వసుధార భయపడుతుంది. వెళ్లకపోతే కోప్పడుతాడని కంగారు పడుతుంది. చివరకు భయభయంగానే రిషి దగ్గరకు వెళుతుంది. కానీ రిషి మాత్రం ఆమెను ఒక్క మాట కూడా ఆనడు. భోజనం చేసి వెళ్లమని వసుధారతో చెబుతాడు. నాకు ఆకలిగా లేదని అబద్ధం ఆడుతుంది. తండ్రి తన కోసం ఎదురుచూస్తుంటాడని రిషితో అంటుంది.
చక్రపాణికి ఫోన్...
వసుధార తండ్రి చక్రపాణికి రిషి ఫోన్ చేస్తాడు. వసుధార రాలేదని కంగారు పడాల్సిన పనిలేదని, తన దగ్గరే ఉందని, ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నామని చెబుతాడు. రిషి మాటలతో చక్రపాణి సంతోషపడతాడు. మీరు ఇలా ఫోన్ చేసి మాట్లాడితే తండ్రిలో మన ఇద్దరి పట్ల ఇంకా ఆశలు పెరుగుతాయని రిషితో అంటుంది వసుధార.
ఆయనలో నిరాశ తగ్గడానికే నేను మాట్లాడానని వసుధారకు బదులిస్తాడు రిషి. నా బాధ నేను మోయగలను. మీ బాధ మీరు మోయగలరు. కానీ మన కోసం ఆయన ఎందుకు బాధపడాలని వసుధారకు సర్ధిచెబుతాడు రిషి. ఏనాటికైనా మనం కలుస్తామనే ఆశలో ఆయన ఉన్నాడు. అలాగే ఉండనివ్వమని వసుధాకు చెబుతాడు రిషి. నేను కూడా అదే ఆశతో ఉన్నానని వసుధార అంటుంది. కానీ ఆ కోరిక తీరదని రిషి వెంటనే బదులిస్తాడు.
పాండ్యన్ ఇంటికి ఏంజెల్...
రిషిని వెతుక్కుంటూ పాండ్యన్ ఇంటికి వస్తుంది ఏంజెల్. ఆమెతో పాటు వసుధార కనిపిస్తుంది. వసుధారనే ఏంజెల్‌ను ఇక్కడికి తీసుకొచ్చిందని రిషి అర్థం చేసుకుంటాడు. నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని రిషితో అంటుంది ఏంజెల్. నువ్వు ఎక్కడికి వెళ్లావో తెలియక ఎంతో టెన్షన్ పడ్డానని, కానీ వసుధార చెప్పడంతోనే నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిసిందని రిషితో అంటుంది ఏంజెల్.
ఫ్రెండ్‌షిప్ కు గుడ్‌బై
రిషిని తిరిగి తన ఇంటికి రమ్మని కోరుతుంది ఏంజెల్. కానీ రిషి అందుకు నిరాకరిస్తాడు. నాకు ఇక్కడ సౌకర్యంగానే ఉందని అంటాడు. పరిస్థితులు మారాయి అందుకే రాలేకపోతున్నానని చెబుతాడు. రిషి మాటలతో ఏంజెల్ హర్ట్ అవుతుంది. మన ఫ్రెండ్‌షిప్‌కు కూడా ముగింపు చెప్పేశావా...నిన్ను చూస్తుంటే అలాగే అనిపిస్తుందని బాధపడుతుంది.
అలాంటిదేమీ లేదని ఇప్పుడు...ఇప్పుడు...ఎప్పటికీ మనం బెస్ట్ ఫ్రెండ్స్ ఏంజెల్‌కు సర్ధిచెబుతాడు రిషి. నీకు ఇష్టం లేని పనిచేశానని మన ఫ్రెండ్‌షిన్‌ను కట్ చేయద్దని రిషిని వేడుకుంటుంది ఏంజెల్.విశ్వనాథం సార్‌ను జాగ్రత్తగా చూసుకోమని ఏంజెల్‌కు సలహా ఇస్తాడు. నీ పెళ్లి ఆయన చేతుల మీదుగా జరగాలని, అప్పుడే ఆయన సంతోషపడతాడని ఏంజెల్‌తో అంటాడురిషి. నీ భార్య ఎవరో నేను పెట్టిన డెడ్‌లైన్‌లోను చెబితేనే తాను మరొకరిని పెళ్లి చేసుకుంటానని, చెప్పకపోతే నువ్వే నన్ను పెళ్లిచేసుకోవాలని రిషికి వార్నింగ్ ఇస్తుంది ఏంజెల్. ఇదే కండీషన్ పెట్టానని వసుధారతో కూడా రిషికి గుర్తు చేయిస్తుంది ఏంజెల్.
వసుధారపై సీరియస్...
ఏంజెల్ వెళ్లిపోయిన తర్వాత ఆమెను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని వసుధారపై ఫైర్ అవుతాడు. ఎందుకు ప్రతి విషయంలో నన్ను ఇరికిస్తున్నావని సీరియస్ అవుతాడు. నేను ఉన్న చోటు ఏంజెల్‌కు తెలియకూడదని జాగ్రత్త పడితే నువ్వు ఏకంగా తనను ఇంటికే తీసుకొచ్చావని కోప్పడుతాడు. ఏంజెల్ ఇక్కడికి వస్తే ఏంటి ప్రాబ్లెమ్. మీరేందుకు ఆమెను చూసి దాక్కోవాలని రిషిని నిలదీస్తుంది వసుధార.
రేపు మీ భార్య ఎవరిని ఏంజెల్ అడిగితే ఎవరిని చూపిస్తారు...నేనే మీ భార్య అని చెబుతారా అని రిషితో అంటుంది వసుధార. ఒకవేళ సమాధానం చెప్పకపోతే ఏంజెల్‌ను పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నిస్తుంది. వసుధార మాటలతో ఆమెపై కోపంగా అరుస్తాడు రిషి. ఆమెను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని అంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.