Guppedantha Manasu February 29th Episode: రిషి కోసం వ‌సు డెడ్‌లైన్‌ - ఇక నుంచి లెక్క వేర‌న్న మ‌ను -శైలేంద్ర‌కు వార్నింగ్-guppedantha manasu february 29th episode phanidra warns shailendra for badmouthing rishi ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu February 29th Episode: రిషి కోసం వ‌సు డెడ్‌లైన్‌ - ఇక నుంచి లెక్క వేర‌న్న మ‌ను -శైలేంద్ర‌కు వార్నింగ్

Guppedantha Manasu February 29th Episode: రిషి కోసం వ‌సు డెడ్‌లైన్‌ - ఇక నుంచి లెక్క వేర‌న్న మ‌ను -శైలేంద్ర‌కు వార్నింగ్

Nelki Naresh Kumar HT Telugu
Feb 29, 2024 10:42 AM IST

Guppedantha Manasu February 29th Episode: నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో రిషి బ‌తికే ఉన్నాడ‌ని అంటుంది వ‌సుధార‌. మూడు నెల‌ల్లో అత‌డిని తిరిగితీసుకొస్తాన‌ని కుటుంబ‌స‌భ్యుల‌తో ఛాలెంజ్ చేస్తుంది. రిషి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించ‌కుండా ఆపేస్తుంది.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu February 29th Episode: వ‌సుధార‌కు తెలియ‌కుండా రిషికి మ‌హేంద్ర చేత క‌ర్మ‌కాండ‌ల జ‌రిపిస్తుంటారు శైలేంద్ర‌, దేవ‌యాని. ఈ కార్య‌క్ర‌మం ద్వారా మ‌హేంద్ర‌, వ‌సుధార మ‌ధ్య గొడ‌వ‌లు సృష్టించాల‌ని ప్లాన్ చేస్తారు. రిషికి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిస్తున్న విష‌యం మ‌ను ద్వారా తెలుసుకుంటుంది వ‌సుధార‌. రిషి ప‌క్క‌న త‌న ఫొటో పెడుతుంది. త‌న‌కు క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించ‌మ‌ని మ‌హేంద్ర‌తో అంటుంది.

రిషి చ‌చ్చిపోయాడంటే ఈ వ‌సుధార కూడా చ‌నిపోయిన‌ట్లేన‌ని మామ‌య్య‌తో అంటుంది. మీరు నా న‌మ్మ‌కాన్ని చెరిపివేశారంటే నేను బ‌తికిలేన‌ట్లేన‌ని చెబుతుంది. రిషికి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిస్తున్న విష‌యం తండ్రి లాంటి మామ‌య్య త‌న ద‌గ్గ‌ర దాచిపెట్టిన‌ప్పుడే నేను చ‌నిపోయాన‌ని వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. మీరు త‌ప్పు చేశార‌ని మ‌హేంద్ర‌తో అంటుంది వ‌సుధార‌.

దేవ‌యాని ఆవేశం...

త‌మ ప్లాన్ చెడిపోవ‌డం చూసి దేవ‌యాని త‌ట్టుకోలేక‌పోతుంది. వ‌సుధార‌పై ఫైర్ అవుతుంది. రిషిపై నీకు ఒక్క‌దానికే ప్రేమ ఉన్న‌ట్లు మాట్లాడుతున్నావ‌ని కోప్ప‌డుతుంది. ఆమె మాట‌ల‌ను వ‌సుధార ప‌ట్టించుకోదు. మీ మాట‌ల‌ను ఆప‌మ‌ని చెబుతుంది.

మాట‌కు మాట‌...

వ‌సుధార గ‌ట్టిగా మాట్లాడ‌టం దేవ‌యాని స‌హించ‌లేక‌పోతుంది. నీకు రిషితో నాలుగైదేళ్ల ప‌రిచ‌యం మాత్ర‌మే ఉంది. కానీ రిషిని చిన్న‌త‌నం నుంచి పెంచింది నేను. నాకంటే ఎక్కువ బాధ ఉంటుందా నీకు. మ‌హేంద్ర‌, ఫ‌ణీంద్ర కంటే నీకు ఎక్కువ బాధ ఉంటుందా? అంటూ వ‌సుధార‌ను నిల‌దీస్తుంది దేవ‌యాని.

రిషిని తాము ఎంతో ప్రేమించామ‌ని, చాలా బాగా చూసుకున్నామ‌ని డ్రామాలు ఆడుతుంది. దేవ‌యాని మాట‌ల‌తో వ‌సుధార కోపం ప‌ట్ట‌లేక‌పోతుంది. మీరు ఇంకో మాట మాట్లాడితే బాగుండ‌ద‌ని దేవ‌యానికి వార్నింగ్ ఇస్తుంది. వ‌య‌సు పెరిగినంత మాత్రాన స‌రిపోదు బుద్ది కూడా పెర‌గాలి అంటూ ఫైర్ అవుతుంది.

శైలేంద్ర వాద‌న‌...

ఫ‌ణీంద్ర జోక్యం చేసుకొని దేవ‌యాని మాట‌ల దాటిని ఆపేస్తాడు. ఇందులో మ‌హేంద్ర త‌ప్పేం లేదు. నువ్వు బాధ‌ప‌డ‌తావ‌ని తెలిసే నీకు చెప్ప‌కుండా మ‌హేంద్ర చేత తానే ఈ క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిస్తున్న‌ట్లు చెబుతాడు. రిషి బ‌తికి ఉన్నాడ‌ని నేను న‌మ్ముతున్నాను...అలాంట‌ప్పుడు నా న‌మ్మ‌కాన్ని ఎలా తీసిపారేస్తార‌ని ఫ‌ణీంద్ర‌తో అంటుంది వ‌సుధార‌.

రిషి చ‌నిపోయాడ‌ని పోలీసులు నిర్ధారించారు క‌దా, డీఎన్ఏ టెస్ట్‌ల‌లో అలాగే రిపోర్ట్ వ‌చ్చింద‌ని వ‌సుధార‌తో వాదిస్తాడు శైలేంద్ర‌. రిషి బ‌తికే ఉన్నాడ‌ని నా మ‌న‌సు చెబుతుంది అని వ‌సుధార అత‌డికి బ‌దులిస్తుంది. నేను బ‌తికి ఉన్నానంటే రిషి బ‌తికే ఉన్నాడ‌ని చెబుతుంది.

మ‌ను లాజిక్స్‌..

రిషి చ‌నిపోయింది ఎవ‌రు చూడ‌లేదు? క‌నీసం అత‌డి డెడ్‌బాడీ కూడా క‌నిపించ‌లేద‌ని ఫ‌ణీంద్ర‌తో అంటాడు మ‌ను. అలాంట‌ప్పుడు చ‌నిపోయింది రిషి అని ఎలా క‌న్ఫామ్ అవుతార‌ని మ‌ను అడుగుతాడు. ఒక‌వేళ రిషి బ‌తికివ‌స్తే అత‌డికి మీరు క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించిన విష‌యం తెలిసి అత‌డు ఎంత బాధ‌ప‌డ‌తాడు? నేను బ‌తికి ఉన్నాన‌ని వ‌సుధార చెప్పినా ఎందుకు న‌మ్మ‌లేద‌ని రిషి అడిగితే ఏమ‌ని స‌మాధానం చెబుతార‌ని మ‌ను అంద‌రిని అడుగుతాడు.

వ‌సుధార న‌మ్మ‌కాన్ని గౌర‌వించి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించ‌క‌పోతే ఏమ‌వుతుంద‌ని మ‌హేంద్ర‌, ఫ‌ణీంద్ర‌ల‌తో చెబుతాడు మ‌ను. మ‌ను లాజిక్స్ చూసి శైలేంద్ర బిత్త‌ర‌పోతాడు.

ఫ్యామిలీకి కీడు...

మ‌ను మాట‌ల‌ను దేవ‌యాని కొట్టిప‌డేస్తుంది. ఆచారాల ప్ర‌కారం రిషికి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించ‌క‌పోతే త‌మ ఇంటికి కీడు జ‌రుగుతుంద‌ని అంటుంది. ఇప్ప‌టికే రోజుకో క‌ష్టం, న‌ష్టం త‌మ ఫ్యామిలీకి ఎదుర‌వుతున్నాయ‌ని దేవ‌యాని చెబుతుంది. క‌ర్మ‌కాండ‌లు జ‌రిపించ‌క‌పోతే రిషి ఆత్మ శాంతించ‌ద‌ని చెబుతుంది. ఆచారాలు, న‌మ్మ‌కాల అంత‌గా ప‌ట్టించుకున్న‌ప్పుడు రిషి బ‌తికి ఉన్నాడ‌నే నా న‌మ్మ‌కాన్ని ఎందుకు గౌర‌వించ‌డం లేద‌ని దేవ‌యానిని ప్ర‌శ్నిస్తుంది వ‌సుధార‌.

వ‌సుధార‌ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక‌పోతుంది దేవ‌యాని. క‌ర్మ‌కాండ‌ల‌ను వ‌సుధార చేయ‌నివ్వ‌దు. మ‌ధ్య‌లో ఆపితే ఇంకా ఎంత అరిష్టం జ‌రుగుతుందో ఏమో అంటూ అంద‌రి ముందు వ‌సుధార‌ను దోషిని చేస్తుంది.

రిషి బ‌తికే ఉన్నాడు...

రిషి బ‌తికి ఉన్నాడ‌ని తాను నిరూపిస్తాన‌ని ఫ‌ణీంద్ర‌, మ‌హేంద్ర‌ల‌తో చెబుతుంది వ‌సుధార‌. నిరూపించ‌డం కాదు మూడు నెల‌ల్లోనే రిషిని అంద‌రి ముందుకు తీసుకొస్తాన‌ని ఛాలెంజ్ చేస్తుంది. రిషి రాడు అంటూ శైలేంద్ర ఆవేశ‌ప‌డ‌తాడు. అదే మాట గ‌ట్టిగా చెబుతాడు. వ‌సుధార ఆవేశం ప‌ట్ట‌లేక అత‌డిని కొట్ట‌బోతుంది. కానీ ఆ ప‌నిని ఫ‌ణీంద్ర చేస్తాడు. శైలేంద్ర చెంప‌పై గ‌ట్టిగా ఒక్క‌టిస్తాడు.

రిషి బ‌తికి ఉన్నాడ‌ని వ‌సుధార బ‌లంగా న‌మ్ముతుంద‌ని, త‌న మాట నిజ‌మైతే అంత‌కంటే ఆనందం ఏమి ఉండ‌ద‌ని శైలేంద్ర‌తో అంటాడు ఫ‌ణీంద్ర‌. నిజంగానే రిషిని వ‌సుధార తీసుకొస్తుంద‌ని అనిపిస్తుంద‌ని చెబుతాడు. అస‌లు రిషి బ‌తికి లేడ‌ని తండ్రితో అంటాడు శైలేంద్ర‌. అత‌డి మాట‌ల‌తో శైలేంద్ర‌పై మ‌రోసారి ఫైర్ అవుతాడు ఫ‌ణీంద్ర‌.

శైలేంద్ర కుట్ర‌లు వెల్ల‌డి...

రిషికి క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిద్దామ‌నే ఐడియా ఇచ్చింది నువ్వే క‌దా అని శైలేంద్ర కుట్ర‌ల‌ను అంద‌రి ముందు బ‌య‌ట‌పెడ‌తాడు. అప్పుడు నువ్వు చెప్పింది క‌రెక్ట్ అనిపించింది. ఇప్పుడు వ‌సుధార చెప్పింది స‌రైంది అనిపిస్తుంది. వ‌సుధార మాట‌లు నిజ‌మ‌ని అంద‌రూ న‌మ్మి తీరాల్సిందేన‌ని తీర్పు ఇస్తాడు ఫ‌ణీంద్ర‌.

వ‌సుధార నిజంగానే రిషిని తిరిగి తీసుకొస్తుంద‌ని అనిపిస్తుంద‌ని చెబుతాడు. క‌ర్మ‌కాండ‌లు మ‌ధ్య‌లోనే ఆపేయ‌మ‌ని పంతుల‌తో చెబుతాడు ఫ‌ణీంద్ర‌. దేవ‌యాని క‌లుగ‌జేసుకొని మ‌ధ్య‌లో క‌ర్మ‌కాండ‌లు ఆపితే అరిష్టం అని అంటుంది. అలాంటిదేమీ లేద‌ని, శాంతి పూజ జ‌రిపిస్తే స‌రిపోతుంద‌ని పంతులు అంటాడు.

ఇక నుంచి రిషి బ‌తికి ఉన్నాడ‌ని అంద‌రం న‌మ్ముదామ‌ని ఫ‌ణీంద్ర అంటాడు. రిషి చ‌నిపోయాడ‌ని త‌న‌ మ‌న‌సును మ‌రోసారి మార్చే ప్ర‌య‌త్నం చేయ‌వ‌ద్ద‌ని అంటాడు. మ‌హేంద్ర‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతాడు ఫ‌ణీంద్ర‌. నువ్వు వ‌ద్ద‌ని అన్న నేను బ‌ల‌వంతంగా క‌ర్మ‌కాండ‌లు జ‌రిపిద్దామ‌ని అన్నాన‌ని అంటాడు.

మ‌నుపై కోపం...

త‌న ప్లాన్ చెడిపోవ‌డానికి కార‌ణ‌మైన మ‌నుపై కోపంతో ర‌గిలిపోతాడు శైలేంద్ర‌. మ‌ను వెళ్లిపోతుండ‌గా అత‌డిని ఆపేస్తాడు. నా ఫ్యామిలీ విష‌యంలో నీ జోక్యం ఎక్కువైంది. ఇక‌పై రెచ్చిపోతే ఊరుకోన‌ని హెచ్చ‌రిస్తాడు. ఇక నీ కార్య‌క్ర‌మాలు బంద్ అయిపోవాలి. లేదంటే బొంద పెట్టేస్తాన‌ని మ‌నుకు వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర‌.

త‌న త‌ల‌పై ఉన్న వెంట్రుక‌లు పీకి శైలేంద్ర చేతులో పెట్టేస్తాడు మ‌ను. ఏం చేస్తావ‌ని శైలేంద్ర‌తో అంటాడు మ‌ను. నేను ఏం చేస్తానో తెలుసుకునే లోగా నువ్వు ఉండ‌వ‌ని శైలేంద్ర బ‌దులిస్తాడు. నువ్వుం ఏం చేస్తావో చేసుకో..నేను చేసేది చేస్తాను. కుక్క మోరిగింద‌ని నా ప‌నులు ఆపుకోన‌ని శైలేంద్ర‌ను అవ‌మానిస్తాడు మ‌ను.

నువ్వే నా టార్గెట్‌...

ఇక నుంచి నీ విష‌యంలో ఆగేది లేదు. త‌గ్గేది లేదు. ఈ క్ష‌ణం నుంచి నా టార్గెట్ నువ్వే. ఎలా చ‌నిపోయావో తెలుసుకునే లోపే నీ ప్రాణాలు గాలిలో క‌లిపేస్తానున‌ని మ‌నుకు భ‌య‌పెట్టాల‌ని చూస్తాడు శైలేంద్ర‌. రిషి ఫొటో చూపించి నా త‌మ్ముడికి నా గురించి పూర్తిగా తెలియ‌దు. తెలుసుకునేలోపు వాడి ప్రాణాలు గాలిలో క‌లిసిపోయాయ‌ని మ‌నుతో అంటాడు శైలేంద్ర‌.

నువ్వు ఇంత‌కుముందు ఎన్ని వెధ‌వ‌వేషాలువేశావో నాకు అవ‌స‌రం . అప్పుడు నేను లేను. ఇప్పుడు నేను వ‌చ్చాను. నువ్వు ఏ మాత్రం తోక జాడించిన లెక్క‌వేరుగా ఉంటుంద‌ని శైలేంద్ర‌కు రివ‌ర్స్ వార్నింగ్ ఇస్తాడు. ఇక నుంచి చూసుకుందామ‌ని శైలేంద్ర‌తో అంటాడు మ‌ను. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner