Guppedantha Manasu February 27th Episode:రిషికి కర్మకాండలు - వసుధార దగ్గర నిజం దాచిన మహేంద్ర - ధరణికి షాక్
Guppedantha Manasu February 27th Episode: రిషి కర్మకాండలు జరిపించి మహేంద్ర, వసుధార మధ్య గొడవలు సృష్టించాలని శైలేంద్ర, దేవయాని అనుకుంటారు.వారి కుట్రల గురించి తెలిసినా ఆ విషయం వసుధారకు చెప్పలేకపోతాడు మహేంద్ర. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu February 27th Episode: రిషికి కర్మకాండలు జరిపించాలని ఫణీంద్ర నిర్ణయిస్తాడు. అన్నయ్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు మహేంద్ర. బలవంతంగా మహేంద్రను ఒప్పిస్తాడు ఫణీంద్ర. కానీ రిషికి కర్మకాండలు జరిపిస్తోన్న విషయాన్ని వసుధార దగ్గర దాచిపెడతాడు మహేంద్ర. ఫణీంద్రకు హెల్త్ బాగాలేదని, ఈ విషయమే మాట్లాడటానికి తనను పర్సనల్‌గా ఇంటికి పిలిపించాడని అబద్ధం చెబుతాడు.
షాకిచ్చిన శైలేంద్ర...
మహేంద్ర అబద్ధం ఆడుతున్నాడని వసుధార కనిపెడుతుంది. అక్కడ ఏదో జరిగిందని అనుమానపడుతుంది. నిజానిజాలు ఏమిటో తెలుసుకోవాలని ఫిక్సై ధరణికి ఫోన్ చేస్తుంది. కానీ కాలేజీలో ధరణి ఫోన్ రింగవడంతో వసుధార షాకవుతుంది. ధరణి ఫోన్ పట్టుకొని వసుధార పక్కన నిలబడతాడు శైలేంద్ర. ఇంతకీ మా అవిడకు ఎందుకు ఫోన్ చేశావని వసుధారను అడుగుతాడు.
ఏమైనా వంటింటి చిట్కాలు తెలుసుకుందామని ఫోన్ చేశావా...అవే అయితే ధరణి ఖచ్చితంగా చెబుతుంది అని వసుధారపై సెటైర్స్ వేస్తాడు శైలేంద్ర. ఇంట్లో రహస్యలు తెలుసుకోవడానికి ఫోన్ చేశావు కదా అని అసలు నిజం బయటపెట్టేస్తాడు శైలేంద్ర. అసలు ఇంట్లో ఏం జరిగిందో చెప్పనని వసుధారను చికాకు పెడతాడు. మళ్లీ ఏం ప్లాన్ చేస్తున్నారని శైలేంద్రను నిలదీస్తుంది వసుధార. ప్లాన్ అయితే బాబాయ్‌తో ఎందుకు డిస్కస్ చేస్తామని శైలేంద్ర బదులిస్తాడు.
వసుధార టెన్షన్...
ఇంతకీ ఎందుకు పిలిపించామో బాబాయ్ మరోసారి అడగలేకపోయావా అని వసుధారతో అంటాడు శైలేంద్ర. ఓ అడిగినా బాబాయ్ చెప్పడు కదా అని విషయం దాచిపెడుతూ వసుధార టెన్షన్ పెంచుతాడు. మళ్లీ ఎవరి ప్రాణాలను తీయాలని అనుకుంటున్నారు...మామయ్యను ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా అని శైలేంద్రను గట్టిగా అడుగుతుంది వసుధార. ప్రాణాలు పోయిన వాళ్ల గురించి ఆలోచిస్తాం కానీ ఉన్నవాళ్ల ప్రాణాలు తీయమని అసలు నిజం బయటపెట్టకుండా వసుధారను సస్పెన్స్‌లో పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు శైలేంద్ర.
తట్టుకోలేకపోయిన ధరణి...
మహేంద్ర, వసుధార మధ్య మనస్పర్థలు సృష్టించడానికి దేవయాని, శైలేంద్ర చేస్తోన్న కుట్రలను ధరణి తట్టుకోలేకపోతుంది. రిషి కర్మకాండలు జరిగితే వసుధార, మహేంద్ర మధ్య గొడవలు జరగడం ఖాయమని భయపడుతుంది. వసుధారకు ఈ విషయం చెప్పాలని అనుకున్నా తన దగ్గర ఫోన్ లేకపోవడంతో కుదరదు. దేవయాని ఫోన్ హాల్‌లో కనిపిస్తుంది. దేవయాని ఫోన్ తీసుకొని వసుధారకు అన్ని విషయాల చెప్పాలని ధరణి అనుకుంటుంది. ఫోన్‌లో నంబర్ డయల్ చేయబోతుండగా సడెన్‌గా దేవయాని అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ధరణి చేతులోని ఫోన్ లాక్కుంటుంది.
దేవయాని వార్నింగ్...
నువ్వు దొంగచాటుగా వసుధారకు ఫోన్ చేస్తావని నాకు తెలుసు. అందుకే ఫోన్ ఇక్కడ పెట్టానని చెబుతుంది. నీకు కొంచెం కూడా భయం లేదా? మా మాట అంటే లెక్కలేదా అని కోడలికి వార్నింగ్ ఇస్తుంది. రిషికి కర్మకాండలు జరిపిస్తే వసుధార తట్టుకోలేదని, చాలా గొడవలు అవుతాయని దేవయానికి సర్ధిచెప్పాలని చూస్తుంది ధరణి. గొడవలు జరగాలనే మేము ఇదంతా చేస్తున్నామని తమ ప్లాన్‌ను దేవయాని భయటపెడుతుంది.
అప్పుడే మా ఆశయం నెరవేరుతుందని అంటుంది. రిషి కోసమే వసుధార బతుకుతుందని, అతడి కర్మకాండలు జరిపిస్తే వసుధార గుండె పగిలిపోతుందని ధరణి ఎమోషనల్ అవుతుంది.రిషి కర్మకాండలు జరిపించకుండా చేయడానికి దేవయానిని చాలా బతిమిలాడుతుంది ధరణి. కానీ దేవయాని మాత్రం తన పట్టువీడదు. ఈ దెబ్బతో వసుధార ఛాప్టర్ క్లోజ్ కావడం ఖాయమని సంబరపడుతుంది.
దేవయాని ఫైర్...
దేవయాని కుట్రలు విని ధరణి తట్టుకోలేకపోతుంది. అత్తయ్యపై ఫైర్ అవుతుంది. ధరణి నోరు పెరగడం చూసి దేవయాని రెచ్చిపోతుంది. నోరు ఎత్తావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలియదు. నా కొడుకు కోసం నువ్వు ఎన్ని వెటకారాలు అడినా నిన్ను భరిస్తున్నానని చెబుతుంది. దేవయాని ఒక్కసారి కన్నెర్ర చేసింది అంటే భస్మమైపోతావు. ఇక నుంచి అయినా ఒళ్లు దగ్గర పెట్టుకొని ఉండమని ధరణికి వార్నింగ్ ఇస్తుంది దేవయాని. హద్దు మీరి మా విషయంలో జోక్యం చేసుకుంటే కోడలివి అని కూడా చూడనని హెచ్చరిస్తుంది. దేవయాని వార్నింగ్‌తో ధరణి భయంతో వెనకడుగు వేస్తుంది.
మహేంద్ర సంఘర్షణ...
ఫణీంద్ర చెప్పిన మాటలు పదే పదే గుర్తురావడంతో మహేంద్ర మనో వేదనకు గురవుతుంటాడు. రిషికి కర్మకాండలు జరిపించాలని ఫణీంద్ర తీసుకున్న నిర్ణయాన్ని వద్దనలేక, వసుధారకు అసలు నిజం చెప్పలేక సంఘర్షణ పడుతుంటాడు. ఫణీంద్ర ఇంటికి వెళ్లినప్పటి నుంచి మీలో మార్పు కనిపిస్తుందని మహేంద్రతో అంటుంది వసుధార. మీరు దేని గురించి బాధపడుతున్నారని, భయపడుతున్నారని, ఆ నిజం ఏమిటో నాకు తెలియాలని అంటుంది. నాకు తెలిస్తే నేను ఏమైపోతాననో మీరు కంగారు పడుతున్నారని, తనకేం కాదని వసుధార అంటుంది. ఎంత అడిగినా మహేంద్ర మాత్రం నిజం చెప్పడు.
ఇరికించిన శైలేంద్ర...
శైలేంద్ర తన దగ్గర వాగిన అన్ని విషయాల్ని మహేంద్రతో చెబుతుంది వసుధార. ఏం లేకపోతే శైలేంద్ర అలా ఎందుకు మాట్లాడాడని మహేంద్రను నిలదీస్తుంది. శైలేంద్ర తనను కావాలనే ఇరికించాడని మహేంద్ర అనుకుంటాడు. నీకు, నాకు మధ్య మనస్పర్థలు రావాలని, గొడవలు జరగాలని శైలేంద్ర నాటకాలు ఆడుతున్నాడని, నేను ఏం చేసినా అది నీ కోసం రిషి కోసం...అది నువ్వు నమ్మితే చాలని వసుధారతో అంటాడు మహేంద్ర.
ఫణీంద్ర ఎమోషనల్...
మహేంద్ర తన దగ్గర ఏదో దాస్తున్నాడని, శైలేంద్ర మళ్లీ ఏదో కుట్ర చేస్తున్నాడని వసుధార మనసులో అనుకుంటుంది. మహేంద్ర తన దగ్గర దాస్తోన్న ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకుంటుంది.
రిషి కర్మకాండలను సవ్యంగా పూర్తిచేయాలని దేవయానితో చెబుతాడు ఫణీంద్ర. ఆ ఏర్పాట్లు అన్ని దగ్గరుండి చూసుకోమని అంటాడు. ఫణీంద్ర ఎమోషనల్ అవుతాడు. పిల్లపాపలతో సంతోషంగా కళకళలాడాల్సిన ఇళ్లు...ఇలా శోకంలో మునిగిపోయిందని అంటాడు. రిషి మన ఫ్యామిలీకి అండ. సమాజంలో మన కుటుంబానికి పేరుప్రఖ్యాతుల ఉండటానికి, డీబీఎస్‌టీ కాలేజీ ఈ స్థాయికి చేరుకోవడానికి రిషి చేసిన కృషి కారణమని దేవయాని, శైలేంద్రలతో చెబుతాడు ఫణీంద్ర.
రిషి ఎంతో మంది స్టూడెంట్స్‌కు బంగారు భవిష్యత్తు కల్పించాడు. ఎన్నో మంచి పనులు చేశాడని రిషి గొప్పతనం గుర్తుచేసుకుంటాడు ఫణీంద్ర. రిషి లేడనే బెంగతో తాను ఏదో ఒక రోజు ఈ లోకాన్ని వదిలిపెట్టడం ఖాయమని అంటాడు. తాను ఇంకా బతికి ఉంది ఇవి చూడటానికేనా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ధరణి నిజాలు...
ఇదే కరెక్ట్ టైమ్ అని భావించిన ధరణి...రిషి చావుకు శైలేంద్ర, దేవయాని కారణమని చెప్పాలని అనుకుంటుంది. కానీ దేవయాని ఆమె ప్లాన్‌ను అడ్డుకుంటుంది. రిషి పోయిన దగ్గర నుంచి నా బాధ మొత్తం ధరణి దగ్గర వెళ్లగక్కుకున్నానని, ఆ విషయమే మీతో చెప్పాలనిధరణి అనుకుంటుందని టాపిక్ డైవర్ట్ చేస్తుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.