Guppedantha Manasu February 21st Episode:శైలేంద్ర జాతకం చెప్పిన ధరణి - కొడుకుకు దేవయాని శిక్ష - రిషి చనిపోలేదా?
Guppedantha Manasu February 21st Episode: మను మంచివాడు కాదని వసుధార అనుమానపడుతుంది. మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకొని అతడు తమకు సాయం చేస్తున్నాడని ఫిక్సవుతుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu February 21st Episode: మనును కాలేజీ నుంచి పంపించేయడానికి అతడికి వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర. తనతో పెట్టుకున్న వాళ్లు ఎవరు భూమిపై లేరని భయపెడతాడు. కానీ అతడి బెదిరింపులకు మను భయపడడు. నోరుజారిన శైలేంద్ర చెంపలను వాయించేస్తాడు మను. నువ్వు ఎప్పటికీ ఎండీ సీట్‌లో కూర్చోలేవని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాలేజీలోనే కనిపించకుండాచేస్తానని శైలేంద్రకు రివర్స్ వార్నింగ్ ఇస్తాడు మను.
శైలేంద్ర కు అవమానం...
మను చేతిలో తనకు జరిగిన అవమానాన్ని శైలేంద్ర తట్టుకోలేకపోతాడు. బెల్టుతో తనను తాను కొట్టుకుంటాడు. దేవయాని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ శైలేంద్ర అందుకు ఒప్పుకోడు. తనను కొట్టమని తల్లి చేతికి బెల్ట్ ఇస్తాడు.కొడుకు ఎంతకు వినకపోవడంతో శైలేంద్ర చెప్పినట్టే చేస్తుంది దేవయాని. శైలేంద్రను దేవయాని బెల్ట్‌తో కొట్టడం చూసిన ధరణి తట్టుకోలేకపోతుంది. దేవయాని చేతిలోని బెల్ట్ తీసుకొని ఆమెను కొట్టడానికి ప్రయత్నిస్తుంది. ధరణిని దేవయాని అడ్డుకుంటుంది.
శైలేంద్ర ప్రస్టేషన్...
మీ ప్రస్ట్రేషన్‌కు కారణం ఏమిటని భర్తను అడుగుతుంది ధరణి. ఏదో ఒకటిలే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ధరణిని అడుగుతాడు. మీకు కాఫీ ఇవ్వడానికి వచ్చానని ధరణి ఆన్సర్ ఇస్తుంది. ఆమె చేతిలో కప్ లేకపోవడంతో కాఫీ ఏదని ప్రశ్నిస్తాడు శైలేంద్ర. మిమ్మల్ని అడిగి తీసుకొద్దామని రూమ్‌లోకి వచ్చానని ధరణి బదులిస్తుంది. ధరణి మాటలతో శైలేంద్ర చికాకు మరింత పెరుగుతుంది.
నా ఎమోషన్స్, ఫీలింగ్స్‌తో సంబంధం లేదా అని భార్యను నిలదీస్తాడు.. ఆ తర్వాత శైలేంద్రకు తగిలిన దెబ్బలకు వెన్నపూస రాయమని దేవయాని చెప్పడంతో ధరణి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆకులా ఉండే ధరణి మేకులా తయారైందని దేవయాని వాపోతుంది. తనను ఎక్కడ కొడుతుందో అని భయపడుతుంది.
బెల్టుతో కొట్టుకోవాలన్నంత ప్రస్ట్రేషన్ ఎందుకొచ్చిందని కొడుకును అడుగుతుంది దేవయాని. మనుకు వార్నింగ్ ఇవ్వబోతే తన చెంపచెల్లుమనిపించాడని అంటాడు. ఈ మధ్య శైలేంద్ర అనే జనాలకు భయం, భక్తి లేకుండా పోతున్నాయని, అందరికి నేనంటే ఏమిటో చూపిస్తా. నన్ను చూడగానే అందరూ భయంతో వణికిపోయేలా చేస్తానని శైలేంద్ర అంటాడు. నువ్వు ఇలా బెల్ట్‌తో కొట్టుకోవడం బాగాలేదని, ఇలాంటి పనులు చేస్తే ఈ తల్లి మనసు తట్టుకోలేదని దేవయాని అంటుంది.
మహేంద్ర అనుమానం...
మను తన క్యాబిన్‌లో కూర్చొని వర్క్ చేస్తుంటాడు. అతడి దగ్గరకు మహేంద్ర వస్తాడు. నీకు అనుపమ తెలుసా...ఆమెతో ఎన్నాళ్లుగా నీకు పరిచయం ఉందని అడుగుతాడు. అనుపమ నాకు తెలుసు అని మహేంద్రకు బదులిస్తాడు మను. అనుపమ గురించి తెలిసిన చాలా విషయాలు చెప్పలేకపోతున్నానని ఆలోచనలో పడతాడు. అనుపమ, జగతి, తాను క్లాస్‌మేట్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని మనుతో అంటాడు మహేంద్ర. మీ ఇద్దరిని చూస్తుంటే మీ మధ్య ఏదో గతం ఉన్నట్లుగా నాకు అనిపిస్తుందని మహేంద్ర అనుమానపడతాడు.
ఇదే విషయం మీ ఫ్రెండ్‌ను అడిగితే బాగుండేదని మహేంద్రతో అంటాడు మను. ఈ విషయం గురించి అనుపమను అడిగానని, కానీ ఆమె సమాధానం చెప్పలేదని అంటాడు. తను సమాధానం చెప్పలేదంటే ఏం లేదని, అర్థం అలాంటప్పుడు నేను ఏం చెబుతాను అంటూ తెలివిగా మను తన సమాధానాన్ని దాటవేస్తాడు. మను లాజిక్‌గా సమాధానాన్ని దాటవేశాడని మహేంద్ర అర్థం చేసుకుంటాడు.
ఖచ్చితంగా అనుపమ, మను మధ్య ఏదో గతం ఉందని ఫిక్సవుతాడు. అదేమిటో తెలుసుకోవాలని అనుకుంటాడు. మనును తన ఇంటికి డిన్నర్‌కు ఇన్వైట్ చేస్తాడు. తొలుత మను రానని అంటాడు. కానీ మహేంద్ర పదే పదే రిక్వెస్ట్ చేయడంతో ఒప్పుకుంటాడు.
నమ్మకం నిజం కాదు...
మను మంచివాడని మహేంద్ర, ఫణీంద్ర నమ్ముతున్నారని, కానీ వాళ్ల నమ్మకం నిజం కాదని వసుధార మనసులో అనుకుంటుంది. మంచివాడిలా నటించి మా ప్రతి కదలికను పసిగట్టి తమను దెబ్బతీయాలని మను చూస్తున్నాడని వసుధార అనుమానపడుతుంది. గతంలో భద్ర కూడా ఇలాగే చేశాడని వసుధార అనుకుంటుంది.
భద్ర మాదిరిగానే మను మనసులో కూడా ఏదో కుట్ర ఉండి ఉంటుందని ఆలోచిస్తుంది. మా ఫ్యామిలీతో ఏ సంబంధం లేని అతడు యాభై కోట్లు ఎందుకిచ్చాడు? పదవులపై తనకు కాంక్ష లేదని చెప్పి ఇప్పుడు డైరెక్టర్‌గా ఎందుకు మారాడు అని వసుధార మనసులో అనుకుంటుంది. ఖచ్చితంగా మను మనసులో ఏదో దురుద్దేశం ఉందని వసుధాన నిశ్చయించుకుంటుంది.
రిషి పేరు చెబుతూ తనను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి మాట దాటేస్తున్నాడు. మను మంచివాడా, చెడ్డవాడా అన్నది తొందరగా తెలుసుకోవాలని వసుధార నిశ్చయించుకుంటుంది.
ధరణి జాతకం…
శైలేంద్ర దెబ్బలకు వెన్నపూస రాస్తుంటుంది ధరణి. మొన్న ఎవరో అప్పుల వాళ్ల నుంచి కాలేజీ సేవ్ చేశారటా, అతడు కాలేజీ డైరెక్టర్ కూడా అయ్యాడట. కాలేజీలో ఇన్ని జరుగుతుంటే నాకు ఎందుకు చెప్పలేదని భర్తపై అలుగుతుంది ధరణి. నేను చెప్పకపోయినా అన్నీ నీకే ముందే తెలుస్తాయిగా...ఆ రోజు నాకు ఎండీ సీట్ రాదని నాతో ఛాలెంజ్ చేశావు. అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగావని భార్యను అడుగుతాడు శైలేంద్ర.
నీకు జాతకం చూడటం తెలుసు అనుకుంటున్నానని భార్యతో అంటాడు శైలేంద్ర. తన జాతకం చూడమని చేయి చూపిస్తాడు. నేను ఎన్ని రోజులు బతుకుతానో చెప్పమని అడుగుతాడు. మీకు అయుష్షు గట్టిగా ఉంది. కానీ లైఫ్ మాత్రం దరిద్రంగా ఉందని భర్తపై సెటైర్ వేస్తుంది ధరణి. ఆ తర్వాత నా లైఫ్‌లో రిషి ఇంకా ఉన్నాడా? అతడు బతికే లేడా అని ధరణిని అడుగుతాడు శైలేంద్ర. రిషి బతికే ఉన్నాడని, మిమ్మల్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేది రిషి అని చేతి గీతల్లో రాసి పెట్టి ఉందని భర్తకు చెబుతుంది.
ధరణి. అసలు నేను ఎండీ అవుతానా లేదా. ఎండీ సీట్ గురించి చేతి గీతల్లో ఏం రాసిపెట్టి ఉందని భార్యను అడుగుతాడు శైలేంద్ర. మీకు జన్మలో ఎండీ పదవి దక్కే భాగ్యం లేదని, గీతలు అవే చెబుతున్నాయని ధరణి అంటుంది. నీకు కనికరం లేదా...నా కోసమైన అబద్ధం చెప్పొచ్చుగా అని భార్యతో అంటాడు శైలేంద్ర. అప్పుడే రాజీవ్ మెసేజ్ చేయడంతో శైలేంద్ర ఆ టాపిక్ ఆపేస్తాడు.
పెద్దమ్మపై ఫైర్...
పెద్దమ్మకు ఫోన్ చేసి మనును కాలేజీకి ఎందుకు పంపించావని క్లాస్ పీకుతుంది అనుపమ. మనుకు తాను సమస్య గురించి మాత్రమే వివరించానని కానీ కాలేజీకి వెళ్లమని చెప్పలేదని అనుపమకు బదులిస్తుంది పెద్దమ్మ. . అందులో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదని అనుపమను కన్వీన్స్ చేయడానికి పెద్దమ్మ ప్రయత్నిస్తుంది. మను ఇక్కడికి వచ్చి మమ్మల్ని చాలా ఇరిటేట్ చేశాడని పెద్దమ్మపై అనుపమ ఫైర్ అవుతుంది. వాడు ఇరిటేట్ చేస్తున్నాడా...మీరు ఇరిటేట్ అవుతున్నారా...ముందు ఈ విషయం చెప్పమని పెద్దమ్మ అంటుంది.
రాజీవ్ ప్రశ్నలు...
తక్కువ టైమ్‌లో మను కాలేజీ డైరెక్టర్ కావడం మంచి విషయం అని అతడిని వెనకేసుకువస్తుంది పెద్దమ్మ. మను ఇంట్లో ఉన్నాడా అని పెద్దమ్మను అడుగుతుంది అనుపమ. ఎవరో భోజనానికి పిలిచారటా...వాళ్ల దగ్గరకు వెళుతున్నాడని పెద్దమ్మ సమాధానం చెబుతుంది. మనును ఇక్కడ భోజనానికి పిలిచేది ఎవరు? అక్కడే ఉండమని చెప్పు. మళ్లీ ఇక్కడికి రావోద్దని చెప్పమని కోపంగా ఫోన్ కట్ చేస్తుంది అనుపమ.
శైలేంద్ర ఒంటిపై ఉన్న దెబ్బలు చూసిన రాజీవ్ ...మనునిన్ను కొట్టాడా అని శైలేంద్రను అడుగుతాడు. అవునని శైలేంద్ర అతడికి సమాధానం చెబుతాడు. ఈ బెల్టు దెబ్బలు మాత్రం మను కొట్టినవి కాదని, నేనే ప్రస్టేషన్‌లో నేనే కొట్టుకున్నానని అంటాడు శైలేంద్ర. ఈ ప్రస్ట్రేషన్‌కు మనోనే కారణమని చెబుతాడు.
మొన్న యాభై లక్షలు ఇచ్చి కాలేజీని కాపాడి ఎండీ సీట్‌ను నాకు దూరం చేశాడు. ఈ రోజు కాలేజీలో డైరెక్టర్‌గా జాయినయ్యాడు అని రాజీవ్‌తో అంటాడు శైలేంద్ర. మొన్న లాస్ట్ మినట్‌లో వాడు రాకపోయి ఉంటే ఈ పాటికి ఎండీ సీట్ నాకు, వసుధార నీకు దక్కేది. కానీ మను వచ్చి మన ప్లాన్ మొత్తం చెడగొట్టాడని శైలేంద్ర చెబుతాడు.
రెచ్చిపోయిన రాజీవ్...
వసుధారను దక్కించే ప్రయత్నాలు నువ్వే ఒంటరిగా చెయమని రాజీవ్‌ను రెచ్చగొడతాడు శైలేంద్ర. నువ్వేదో పెద్ద పోటుగాడివని మా మమ్మీ నీ గురించి గొప్పలు చెప్పిందని అదంతా వట్టిదేనా, వసుధారను తీసుకెళ్లడం నీకు చేతకాదా అని రాజీవ్‌తో అంటాడు శైలేంద్ర. అతడి మాటలతో కోపంతో ఉగిపోతాడు రాజీవ్. ఈ రోజే ఇప్పుడే వెళ్లి నా వసుధారను నేను తెచ్చుకుంటానని అంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.