Guppedantha Manasu February 17th Episode: మను దెబ్బకు ఏడ్చేసిన శైలేంద్ర- సాయంపై వసు డౌట్ - దేవయానిపై ధరణి పంచ్‌లు
Guppedantha Manasu February 17th Episode: రిషి అప్పు తీసుకున్నట్లుగా బినామీ మనుషులతో కలిసి శైలేంద్ర చేసిన మోసాన్ని మను కనిపెడతాడు. రెడ్‌హ్యాండెడ్‌గా ముగ్గురిని పట్టుకుంటాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu February 17th Episode: మనుతో తనకు అనుబంధం ఉన్నా ఆ నిజాన్ని మహేంద్ర, వసుధార దగ్గర దాచిపెడుతుంది అనుపమ. మను గురించి మహేంద్ర తనను అడిగితే తడబడుతుంది. మను చేసిన సాయం వెనుక ఏదైనా కుట్ర, మర్మం ఉండి ఉంటుందని వసుధార అనుమానపడుతుంది. ఇప్పటికే చాలా మందిని మంచివాళ్లుగా నమ్మి మోసపోయామని మహేంద్రతో అంటుంది వసుధార.
భద్ర చాలా నమ్మామని, కానీ అతడు శైలేంద్రతో చేతులు కలిపి మన రహస్యాల్ని అతడికి చేరవేశాడని వసుధార అంటుంది. మను కూడా అలాంటివాడేమోనని సంశయం వ్యక్తం చేస్తుంది. కానీ భద్ర, శైలేంద్రను చూసి అందరూ అలాంటివాళ్లే ఉంటారని పొరపడటం సరికాదని, సమాజంలో చెడ్డవాళ్లతో పాటు మంచివాళ్లు ఉంటారని వసుధారకు సర్ధిచెబుతాడు మహేంద్ర.
యాభై కోట్లు ఎందుకిచ్చాడు?
మనును చెడ్డవాడు అని ఫిక్స్ కావడం కరెక్ట్ కాదని అంటాడు. అతడు ఇచ్చింది యాభై కోట్లు. ఏ సంబంధం లేకుండా ముక్కుమొహం తెలియని వారికి యాభై కోట్లు ఎందుకు ఇచ్చాడు. అది కూడా సాయం అనుకోవద్దు అప్పు అనుకోమని చెప్పాడు. డబ్బులు ఉన్నప్పుడే ఇవ్వమని అన్నాడు. దేవుడు కూడా అడిగితేనే వరాలు ఇస్తాడు. కానీ మను మాత్రం ఏం అడగకుండానే వరాలు ఇచ్చాడని వసుధార తన మనసులో ఉన్న అనుమానాలు మొత్తం మహేంద్ర ముందు బయటపెట్టేస్తుంది.
మను ఎవరు?
మను ఎవరు? అతడిని ఎవరు ఇక్కడికి పంపించారు? అతడి అమ్మనాన్నలు ఎవరు అని అడిగితే అవసరం వచ్చినప్పుడు అన్ని మీకే తెలుస్తాయని అతడు చెప్పిన సమాధానం మహేంద్రకు గుర్తుచేస్తుంది వసుధార. రిషినే నన్ను ఇక్కడికి పంపించాడని అనుకోమని అన్నాడంటే రిషితో అతడికి ఇంతకుముందు నుంచే పరిచయం ఉండి ఉంటుందని, అదే నిజమైతే మను విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని వసుధార అంటుంది. వసుధార ఎంత చెప్పినా మను ఫ్రాడ్ అంటే నమ్మకం కలగడం లేదని మహేంద్ర అంటాడు. అయినా వసుధార అతడి మాటలకు కన్వీన్స్ కాదు.
అనుపమ కంగారు...
వసుధార, మహేంద్ర మాటలు విని అనుపమ టెన్షన్ పడుతుంటుంది. కానీ ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉంటుంది. ఆమెలోని కంగారును వసుధార, మహేంద్ర కనిపెడతారు. ప్రతి విషయంలో మీరు మాకు ఎన్నో సలహాలు ఇస్తుంటారు.
మేము వెనకడుగు వేసిన ప్రతిసారి మాకు ధైర్యం చెబుతుంటారు. కానీ మను విషయంలో మీరు సైలెంట్‌గా ఉంటున్నారు ఎందుకని అని అనుపమను అడుగుతుంది వసుధార. మను మంచివాడా చెడ్డవాడా? అతడిని నమ్మొచ్చా అని అనుపమను ప్రశ్నిస్తుంది వసుధార. మీరు ఏదంటే అదే అని అనుపమ సమాధానం దాటవేస్తుంది.
బినామీ మనుషుల మోసం...
మను విషయంలో వసుధార, మహేంద్రలకు తనపై అనుమానం కలగడం చూసి అనుపమలో టెన్షన్ పెరిగిపోతుంది. మను గురించి ఎట్టి పరిస్థితుల్లో మహేంద్ర, వసుధారలకు నిజం తెలియకూడదని మనసులో నిశ్చయించుకుంటుంది. రిషి తమ దగ్గర కాలేజీని తాకట్టు పెట్టాడని వచ్చిన వ్యక్తులు మోసం చేశారని మను పీఏ ఇన్వేస్టిగేషన్‌లో తేలుతుంది. వాళ్లు మోసగాళ్లు అని తెలిసినా బ్యాంకులో చెక్ వేసుకోవమని బినామీ మనుషులకు చెబుతాడు మను.
శైలేంద్ర కన్నీళ్లు...
ఎండీ సీట్ వచ్చినట్లే వచ్చి చేజారిపోవడం శైలేంద్ర తట్టుకోలేకపోతాడు. చివరి నిమిషంలో ఫ్లాన్ ఫెయిలవ్వడంతో రూమ్‌లో ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ సీన్ చూసి దేవయాని షాక్. నువ్వు శైలేంద్రవి. మనం ఒకరిని ఏడిపించాలి తప్పితే నువ్వు ఏడవకూడదని కొడుకును ఓదార్చుతుంది. కాలేజీ నా సొంతమవుతుందని అనుకున్న ప్రతిసారి చివరి నిమిషంలో ఎవడో ఒకడు వస్తున్నాడని, కాలేజీని తనకు కాకుండా చేస్తున్నాడని శైలేంద్ర బోరున ఏడుస్తాడు.
బాండ్ పేపర్‌పై బోర్డ్ మెంబర్స్ మొత్తం సంతకాలు పెట్టాడని, వసుధార సంతకం పెట్టబోతుండగా వాయుగుండంలో వచ్చిన మను తన ప్లాన్ రచ్చ రచ్చ చేశాడు. వసుధార సంతకం పెట్టకుండా ఆపేసి యాభైకోట్లు ఇచ్చాడని దేవయానితో చెబుతాడు శైలేంద్ర. వాడు ఎవరు అని కొడుకును అడుగుతుంది దేవయాని. వాడు ఎవడో తెలియక పిచ్చెక్కిపోతుందని శైలేంద్ర బదులిస్తాడు.
తెలిసిన వాడు కాదు...
వసుధారకు తెలిసినవాడు, కావాల్సిన వాడు కాదు. అయినా యాభై కోట్లు ఇచ్చాడని, మను డబ్బు ఇవ్వడం చూసి వసుధార, మహేంద్ర కూడా షాకయ్యారని దేవయానితో అంటాడు శైలేంద్ర. డబ్బులు ఇవ్వడమే కాకుండా కాలేజీ కూడా తనకు అవసరం లేదని, వసుధారనే రన్ చేయమన్నాడనే నిజం కూడా తల్లికి చెబుతాడు శైలేంద్ర. తాను ఇచ్చిన డబ్బులకు వడ్డీ కూడా కట్టనవసరం లేదని అన్నాడని శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు.
దేవుడికి కనికరం లేదు...
తన మీద దేవుడికి కొంచెం కూడా కనికరం లేదని శైలేంద్ర వాపోతాడు. దేవుడికి నేను గిట్టానా...నేను అంత రాక్షసుడినా అని శైలేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. ధరణి అన్నట్లుగా ఆ ఎండీ సీట్ నాకు రాసిపెట్టి లేదోమోనని కంగారుపడతాడు. ధరణితో చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చి వణికిపోతాడు. ధరణిని ఎలా ఫేస్ చేయాలో తెలియడం లేదని, కళ్లతోనే భయపెడుతుందని అంటాడు. ధరణిని అంత సీన్ లేదని, నువ్వు భయపడవద్దనొ కొడుకుకు ధైర్యం చెబుతుంది దేవయాని. అప్పుడే లోపలికి ఎంట్రీ ధరణి...దేవయాని, శైలేంద్రను ఆట ఆడేసుకుంటుంది.
వసుధార ప్లాన్...
మనును కలిసి అతడు ఎందుకు డబ్బు ఇచ్చాడో తెలుసుకోవాలని అనుకుంటుంది వసుధార. అతడిని నేరుగా కలిసి నిజాలు రాబట్టాలని అనుకుంటుంది. మనుకు ఫోన్ చేసి కలవాలని అంటుంది. ఏ విషయంలో నన్ను కలవాలని అనుకుంటున్నారని వసుధారను అడుగుతాడు మను. కలిసిన తర్వాతే ఆ విషయం గురించి చెబుతానని మనుతో అంటుంది వసుధార. అందుకు మను ఒప్పుకుంటాడు.
శైలేంద్ర డీల్...
మను దగ్గర తీసుకన్న యాభై కోట్ల చెక్ తీసుకొని శైలేంద్ర దగ్గరకు వస్తారు బినామీ మనుషులు. వారి వాటాగా కోటి రూపాయలు ఇస్తానని శైలేంద్ర అంటాడు. యాభై కోట్లు వచ్చేలా చేస్తే కోటి ఇస్తానని అంటున్నారని, కరెక్ట్‌గా సెట్ చేయమని వాళ్లు శైలేంద్రను రిక్వెస్ట్ చేస్తుంటారు. నేను సెట్ చేయనా అని మను అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసి ముగ్గురు షాకవుతారు. కాలేజీని సొంతం చేసుకునే వాళ్లతో మీరు ఎందుకు మాట్లాడుతున్నారని శైలేంద్రను అడుగుతాడు మను. మరోసారి కాలేజీ వైపు రావద్దని వాళ్లకు వార్నింగ్ ఇస్తున్నానని మనుతో అబద్ధం ఆడుతాడు శైలేంద్ర.
చెక్ చింపేసిన మను...
శైలేంద్ర చేతిలో తాను ఇచ్చిన చెక్ ఉండటం చూసి మను అనుమానపడతాడు. వాళ్ల చేతిలో ఉండాల్సిన చెక్ నీ చేతులో ఎందుకు ఉందని శైలేంద్రను నిలదీస్తాడు మను. డేట్, ఎమౌంట్ సరిగా ఉన్నాయో లేదో చెక్ చేస్తున్నానని శైలేంద్ర అంటాడు. తాను కూడా ఓసారి చెక్ చేస్తానని చెప్పి శైలేంద్ర చేతిలోని చెక్‌ను తీసుకొని చింపేస్తాడు. మను చెక్ చింపడం చూసి శైలేంద్రతో పాటు అతడి బినామీ మనుషులు కంగారు పడతారు.
బినామీ మనుషుల మోసాన్ని మను బయటపెడతాడు. వీళ్ల వెనుక ఉన్నది నువ్వేనని నా నిఘాలో తెలిందని శైలేంద్రతో అంటాడు మను. నాకు వీళ్లతో ఎలాంటి సంబంధం లేదని మనుతో వాదిస్తాడు శైలేంద్ర. చెక్ చింపడంతో మాకు ఇవ్వాల్సిన అప్పు కోసం కోర్టుకు వెళతామని బినామీ మనుషులు మనుపై ఫైర్ అవుతారు.
రిషి సంతకాలు ఫోర్జరీ...
కోర్టుకు మీతో పాటు నేను వస్తానని, ఇప్పుడే వెళ్దామని మను అనడంతో బినామీ మనుషులు కంగారు పడతారు. మా ఇన్వేస్టిగేషన్‌లో మీ డాక్యుమెంట్స్ మొత్తం ఫేక్ అని తేలాయని, అందులో ఉన్న రిషి సంతకాలు ఫోర్జరీ చేశారని తెలిసిపోయిందని మను పీఏ చెబుతాడు. డీబీఎస్‌టీ కాలేజీ మీద ఎలాంటి అప్పు, లోను లేదని మా ఎంక్వైరీలో తేలిందని అంటాడు. మీ బండారం మొత్తం బయటపెడతానని మను అనడంతో శైలేంద్రతో పాటు ఆ బినామీ మనుషులు కంగారు పడతారు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.