Guppedantha Manasu February 23rd Episode:శైలేంద్రకు ఎదురుతిరిగిన రాజీవ్ - హీరోలా వసును సేవ్ చేసిన మను - అనుపమ హర్ట్
Guppedantha Manasu February 23rd Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో మహేంద్ర ఇంట్లో డిన్నర్ చేస్తోండగా మనుకు పొలమారుతుంది. కంగారు పడిన అనుపమ తానే స్వయంగా మనుకు నీళ్లు తాగిస్తుంది. అనుపమ, మను అనుబంధం చూసి మహేంద్ర షాకవుతాడు.
Guppedantha Manasu February 23rd Episode: శైలేంద్ర రెచ్చగొట్టడంతో ఆవేశపడిన రాజీవ్ వసుధారను ఎత్తుకొచ్చేయాలని ఆమె ఇంటికి వస్తాడు. కానీ అక్కడ మను ఉండటంతో అతడి ప్లాన్ ఫెయిలవుతుంది. మను దెబ్బకు భయపడిపోయిన రాజీవ్ మాట మార్చేస్తాడు. డీబీఎస్‌టీ కాలేజీకి మీరు డైరెక్టర్ అయ్యారని తెలిసింది. కంగ్రాట్స్ చెబుతామని వచ్చానని ప్లేట్ ఫిరాయిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోకపోతే ఈ సారి గన్ కాదు బుల్లెట్ చూపిస్తానని రాజీవ్‌కు వార్నింగ్ ఇస్తాడు మను.
ఎవరు అడ్డొచ్చిన ఎత్తుకెళుతా...
రాజీవ్ వెళ్లబోతూ మళ్లీ కలుస్తానని వసుధారతో చెబుతాడు రాజీవ్. ఇప్పుడు వీళ్లందరిని చూసుకొని ఎగిరిపడుతున్నావేమో...వీళ్లంతా మధ్యలో వచ్చిన వాళ్లు...మధ్యలోనే వెళ్లిపోతారు. నేను నీ బావను. నీ అక్క మొగుడిని. నువ్వు నేను ఒకటి. ఇప్పుడు నిన్ను తీసుకెళ్లడం కుదరడం లేదు. మళ్లీ వస్తా. అప్పుడు మాత్రం వదలిపెట్టను. ఎవరు అడ్డొచ్చిన నిన్ను తీసుకెళతానని వసుధారకు వార్నింగ్ ఇస్తాడు రాజీవ్. తన జేబులో నుంచి తాళి తీస్తాడు. ఈ తాళి మాత్రం నీ మెడలో పడాల్సిందే. అది నేను కట్టాల్సిందేనని చెబుతాడు.
మను ఆవేశం...
రాజీవ్ మాటలతో మను ఆవేశపడతాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోమని రాజీవ్‌కు గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. నిన్న గాక మొన్న వచ్చిన నువ్వు కూడా నాకు వార్నింగ్ ఇస్తున్నావు. మొన్న అంటే చేతిలో గన్ను ఉందని వెనక్కి తగ్గా. ప్రతిసారి అలా తగ్గను. నా టైమ్ వస్తుంది. అప్పుడు ఈ రాజీవ్ అంటే ఏమిటో చూపిస్తా. నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అంటూ మనును భయపెట్టాలని చూస్తాడు రాజీవ్. తగ్గకపోతే ఎలా ఉంటుందో నేను చూస్తానని రాజీవ్‌తో రివర్స్ ఛాలెంజ్ చేస్తాడు మను.
శైలేంద్ర టెన్షన్...
వసుధారను ఎత్తుకొస్తానని వెళ్లిన రాజీవ్ అనుకున్న పని సక్సెస్ చేశాడో లేదో అని శైలేంద్ర టెన్షన్ పడుతుంటాడు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫోన్ చేస్తాడు. తన ప్లాన్ ఫెయిలైన చిరాకులో ఉన్న రాజీవ్...శైలేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మళ్లీమళ్లీ ఫోన్ చేస్తూనే ఉంటాడు శైలేంద్ర. చివరకు రాజీవ్ ఫోన్ ఎత్తగానే అతడిపై శైలేంద్ర ఫైర్ అవుతాడు. కానీ రాజీవ్ రివర్స్ అవుతాడు. శైలేంద్రకు మాటమాట సమాధానమిస్తాడు. అవసరం తనది కాబట్టి శైలేంద్ర తగ్గుతాడు. కూల్‌గా మాట్లాడుతూ వసుధార ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటాడు.
కామన్ శత్రువు...
వసుధారను ఎత్తుకెళ్లడానికి ఆమె ఇంటికి వెళ్లావు. ఏమైంది అని రాజీవ్‌ను అడుగుతాడు శైలేంద్ర. నీకు నాకు కామన్ శత్రువు ఒకడు ఉన్నాడు కదా. వాడే వసుధారను నేను తీసుకురాకుండా అడ్డుకున్నాడని రాజీవ్ బదులిస్తాడు. రిషి కంటే మను డేంజర్‌లా ఉన్నాడు. రిషి అయితే వార్నింగ్ ఇచ్చి వదిలేసేవాడు. కానీ మనును చూస్తేనే భయమేస్తుంది. ఏం చేయాలో కూడా తెలియక వెనకడుగు వేసి వచ్చానని శైలేంద్రతో అంటాడు రాజీవ్.
శైలేంద్ర ఫైర్...
మనును ఏదో ఒకటి చేసి వసుధారను తీసుకురావాలి గదా. అసలు నీకు బుద్ది ఉందా అని రాజీవ్‌పై ఫైర్ అవుతాడు శైలేంద్ర. అసలు నీ బుద్ధి ఏమైంది. నువ్వు ఎందుకు మనును ఏం చేయడం లేదు. వాడిని తప్పిస్తే నీకు నాకు టెన్షన్ ఉండదు. నువ్వు ఎందుకు మనుకు భయపడుతున్నావని శైలేంద్రను అడుగుతాడు రాజీవ్. అతడి మాటలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక శైలేంద్ర తడబడిపోతాడు. నువ్వు ఎందుకు అలా చేయకుండా ఆగిపోయావో నేను అందుకే ఆ పని చేయలేకపోయానని చెబుతాడు.
వసును పెళ్లిచేసుకోవాలన్నది తన ఆశయం అని శైలేంద్రతో అంటాడు రాజీవ్. వసును ఎలాగైనా ఇక్కడి నుంచి దూరంగా తీసుకుపోతానని చెబుతాడు. త్వరలోనే నీకు తీపి వార్త చెబుతానని ఫోన్ కట్ చేస్తాడు రాజీవ్. శైలేంద్ర ఏదో మాట్లాడాలని అనుకున్నా వినడు.
మరో కొత్త ప్లాన్...
మను ఎవరు? వసుధార ఫ్యామిలీతో అతడికి ఉన్న సంబంధం ఏమిటి అని ఆలోచించడం కూడా టైమ్ వేస్ట్ అని శైలేంద్ర అనుకుంటాడు. ఎండీ సీట్‌పై మాత్రమే ఫోకస్ పెట్టాలని అనుకుంటాడు. వసుధార తనంతట తానుగా కాలేజీ నుంచి వెళ్లిపోయేలా చేయాలని మరో ప్లాన్ వేస్తాడు.
భయపడి మారాల్సిన అవసరం లేదు...
మహేంద్ర, మను, వసుధార, అనుపమ డిన్నర్ చేయడానికి రెడీ అవుతారు. మను తనకు తానే వడ్డించుకోవడానికి సిద్ధమవుతాడు. అతడిని మహేంద్ర ఆపుతాడు. మనుకు అనుపమను వడ్డించమని చెబుతాడు. ఇవన్నీ నీ ఫేవరేట్ కర్రీస్ కదా మొహమాటపడకుండా తినమని అంటాడు.
నిన్ను చూడగానే రాజీవ్ ఎందుకు అలా వణికిపోయాడని మనును అడుగుతాడు మహేంద్ర. ఇంతకుముందు నన్ను రాజీవ్ ఏడిపించబోతే మను వార్నింగ్ ఇచ్చాడని వసుధార చెబుతుంది. గన్ తీసి బెదిరించిన సంగతిని మను కూడా చెబుతాడు. రాజీవ్ విషయంలో జాగ్రత్తగా ఉండమని వసుధారకు చెబుతాడు మహేంద్ర. ఎవరికో భయపడి వసుధార మారాల్సిన అవసరం లేదని, తను ఎప్పటిలానే ఉండొచ్చని మహేంద్రకు మను బదులిస్తాడు.
అనుపమ కంగారు...
మను మాట్లాడుతోండగా పొలమారుతుంది. దాంతో అనుపమ కంగారు పడుతుంది. ఛైర్‌లో నుంచి లేచి మను తలపై తడుతుంది. అతడికి తానే స్వయంగా వాటర్ తాగిస్తుంది. అన్నంతినేముందు మాట్లాడకూడదని తెలియదా. చూడు ఎంతలా పొలమారిందో అంటూ మనుపై ప్రేమను కురిపిస్తుంది. వారిద్దరిని చూసి మహేంద్ర, వసుధార షాకవుతారు. తనకు పొలమారితే నువ్వెందుకు కంగారు పడుతున్నావు. ఏదో సొంత మనిషికి ఇబ్బంది ఎదురైనట్లు అని అనుపమను అడుగుతాడు మహేంద్ర. అనుపమ సమాధానం చెప్పకుండా సైలెంట్‌గా ఉండిపోతుంది.
మను ఒంటరి...
అంతలా పొలమారిందంటే నిన్ను ఎవరు తలచుకొని ఉంటారని మనును అడుగుతాడు మహేంద్ర. నన్ను తలచుకునేవాళ్లు ఎవరు లేరని మను సమాధానమిస్తాడు. అతడి మాటలతో అనుపమ ఎమోషనల్ అవుతుంది. అన్నం కూడా తినకుండా ఆగిపోతుంది. ఇంకెప్పుడూ అలా అనకు మను. నీకు మేము ఉన్నామని మనుకు మాటిస్తాడు మహేంద్ర. ఇలా అందరితో కలిసి ఎప్పుడూ తినలేదని, రోజు ఒంటరిగానే భోజనం చేస్తుంటానని మహేంద్రతో చెబుతాడు మను.
పెద్దమ్మపై కోపం...
అనుపమ ఇంటికి మను డిన్నర్ కోసం వెళ్లిన సంగతి తెలిసి ఆమె దగ్గర దాచిపెడుతుంది పెద్దమ్మ. దాంతో పెద్దమ్మపై అనుపమ ఫైర్ అవుతుంది. తనకు ఎందుకు చెప్పలేదంటూ కోప్పడుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.