Guppedantha Manasu Today Episode: బావతో ఏంజెల్ సరదాలు- మనును ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న అనుపమ
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో అనుపమకు ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి వస్తాడు మను. మాటలతో కొడుకు మనుసు విరిగిపోయేలా చేస్తుంది అనుపమ. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని అంటుంది.
Guppedantha Manasu Today Episode: మను ఇంటికి రాకపోవడంతో అతడి కోసం కంగారుగా ఎదురుచూస్తుంటుంది పెద్దమ్మ. అప్పుడే అనుపమ ఆమెకు ఫోన్ చేస్తుంది. మను ఇంటికి రాలేదా అని అడుగుతుంది. ఇంకా రాలేదని పెద్దమ్మ బదులిస్తుంది. ఇంకా రాకపోవడం ఏమిటి? ఎక్కడికి వెళ్లి ఉంటాడని పెద్దమ్మను ప్రశ్నిస్తుంది అనుపమ.
ఎక్కడికి వెళ్లి ఉంటాడో తెలియదు. ఏ చెట్టుకు, పుట్టకు తన బాధను చెప్పుకుంటున్నాడో? మనుషులతో తన బాధను పంచుకోవడం ఎప్పుడో మర్చిపోయాడు మను. ఒంటరిగా ఎక్కడ బాధపడుతున్నాడోనని అనుపమతో అంటుంది పెద్దమ్మ.
మను గురించి పట్టించుకోవుగా...
మను గురించి నువ్వు పట్టించుకోవగా...అలాంటిది ఇంటికి వచ్చాడా? ఎక్కడికి వెళ్లాడు? అని కొత్తగా అడుగుతున్నావని అనుపమతో అంటుంది పెద్దమ్మ. అలోచించేలా మను చేస్తున్నాడని అనుపమ సీరియస్ అవుతుంది. . మనుకు నీకు మధ్య గొడవకు కారణం ఏమిటని ప్రతి ఒక్కరూ తనను నిలదీస్తున్నారని, నీ కొడుకుతో కలిసి ఉండొచ్చుగా అని సలహాలు ఇస్తున్నారని కోపంగా అంటుంది అనుపమ.
నేను ఎలా ఉండాలన్నది నా ఇష్టం అని అంటుంది. మను ఇక్కడికి రాకుండా ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావని అనుపమ చెబుతుంది. మను నాకు సమస్యగా మారాడని పెద్దమ్మతో కోపంగా మాట్లాడుతుంది అనుపమ.
కళ్ల ముందు ప్రాణం పోతుంటే...
మనును సమస్య అనుకున్నదానివి అతడిని ప్రాణాలకు నీ ప్రాణాలను ఎలా అడ్డువేశావని అనుపమను ప్రశ్నిస్తుంది పెద్దమ్మ. కళ్ల ముందు మనిషి ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకునేదానికి కాదని, అక్కడ మను కాకుండా ఎవరు ఉన్నా కాపాడేదానినని అనుపమ సమాధానమిస్తుంది.
మనును ఇంటికి తీసుకొచ్చిన మహేంద్ర...
అప్పుడే మనును తీసుకొని ఇంటికొస్తాడు మహేంద్ర. అనుపమను గట్టిగా పిలిచి...మను వచ్చాడని చెబుతాడు. మహేంద్ర మాటలు వినిపించినా వినబడనట్టుగా నటిస్తుంది అనుపమ. తల్లి కోసం మను ట్యాబ్లెట్స్ తీసుకొని వస్తాడు. మను మహేంద్ర మాట్లాడుతుండగా అక్కడికి ఏంజెల్ ఎంట్రీ ఇస్తుంది. మనును బావ అని పిలుస్తుంది. ఆ పిలుపు విని మను సీరియస్ అవుతాడు.
అతడి చూపులతోమనుగారు అంటూ మాట మారుస్తుంది. మనును బావ అని నువ్వు పిలవొచ్చని మహేంద్ర ఏంజెల్‌కు సర్ధిచెబుతాడు.బావ అని పిలవాలనే ఉంది కానీ అత్తయ్య ఏమనుకుంటుందోనని ఆగిపోతున్నానని ఏంజెల్ చెబుతుంది. అనుపమకు భయపడుతున్నావా అని ఏంజెల్‌తో అంటాడు మహేంద్ర. భయం అన్నది నా హిస్టరీలో లేదని ఏంజెల్ బదులుస్తుంది.
గొడవలు పక్కనపెట్టి...
అనుపమ కోసం తెచ్చిన ట్యాబ్లెట్స్‌కు ఆమెకు ఇవ్వమని మహేంద్ర చేతికి ఇస్తాడు మను. కానీ తాము ఇవ్వమని , ఆ ట్యాబ్లెట్స్ నువ్వే అనుపమకు ఇస్తే మంచిదని మనుతో అంటారు మహేంద్ర, వసుధార. మీ మధ్య ఉన్న గొడవలు పక్కనపెట్టి అనుపమ కోలుకునే వరకు ఆమె పక్కన నువ్వు ఉంటే బాగుంటుందని చెబుతారు. నేను పక్కనుండటం అమ్మకు ఇష్టం లేదని మను బదులిస్తాడు. మహేంద్ర, వసుధార బలవంత పెట్టడంతో అనుపమ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి ఆమె రూమ్‌లోకి వెళతాడు మను.
సమాధానం ఇవ్వని అనుపమ...
మనును చూసి కూడా చూడనట్లుగా ఉంటుంది అనుపమ. కూర్చోవచ్చా అని అనుపమను అడుగుతాడు మను. కానీ అనుపమ మాత్రం సమాధానం ఇవ్వదు. ఎలా ఉందని అమ్మను అడుగుతాడు మను. ఎందుకొచ్చావని అనుపమ అడుగుతుంది. మీకు ఇచ్చిన మాట ప్రకారం తొందరలోనే దూరంగా వెళ్లబోతున్నట్లు అనుపమతో అంటాడు మను. ఎక్కువ రోజులు ఇక్కడ ఉండాలని అనుకోవడం లేదని చెబుతాడు.
ప్రశ్నల వర్షం...
నువ్వు ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదని మనుతో అంటుంది అనుపమ. మిమ్మల్ని బాధపెట్టడానికి నేను ఇక్కడికి రాలేదని, డీబీఎస్‌టీ కాలేజీ కష్టాల్లో ఉందని తెలిసే వచ్చానని తల్లికి సమాధానమిస్తాడు. కాలేజీ సమస్యల గురించే ఆలోచించావు కానీ నేను సమస్యల్లో పడతానని ఊహించలేదా అని మనును నిలదీస్తుంది అనుపమ.
మీరిద్దరు ఎందుకు దూరంగా ఉంటున్నారు. మీ మధ్య గొడవలకు కారణమేంటి అంటూ ఒక్కొక్కరు తనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని, ఆ ప్రశ్నలన్నీ తనను బాధపెడుతున్నాయని అనుపమ అంటుంది. నన్ను పాతికేళ్లుగా ఓ ప్రశ్న ఇబ్బంది పెడుతుందుని, దానికి సమాధానం తెలియక ఎంతో వేదనకు గురవుతున్నానని మను అంటాడు.
మనును వెళ్లిపొమ్మన్న అనుపమ.
మనును అక్కడి నుంచి వెంటనే వెళ్లిపొమ్మని అనుపమ అంటుంది. అప్పుడే ఆ రూమ్‌లోపలికి మహేంద్ర, వసుధార ఎంట్రీ ఇస్తారు. మను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని అంటారు. మనును ఇంట్లోకి ఎందుకు రానివచ్చావు. ఎందుకు వచ్చాడని వసుధారపై కోప్పడుతుంది అనుపమ.
మీరు ఎలా ఉన్నారో, గాయం నుంచి కోలుకున్నారో లేదో చూడటానికి వచ్చాడని వసుధార బదులిస్తుంది. మను చేసిన గాయం కంటే పెద్దదేమి కాదని అనుపమ బదులిస్తుంది. మనుకు మీ దగ్గరకు వచ్చే హక్కు, స్వేచ్చ ఉన్నాయని అనుపమతో అంటుంది వసుధార. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసిన మనును మీ దగ్గరకు రాకుండా ఆపలేరని అంటుంది. ఢిల్లీకి రాజైన తల్లికి ఓ బిడ్డే నని అంటారు. మను ఎంత ఎత్తుకు ఎదిగిన అతడు మీ బిడ్డేనని అనుపమతో చెబుతుంది వసుధార.
మర్చిపోవడానికి మీ మధ్య ఉన్నది పరిచయం కాదు బంధం. తల్లికొడుకుల అనుబంధం అని చెబుతుంది. ఆ అనుబంధాన్ని చెరిపివేసే హక్కు ఏ దేవుడికి కూడా లేదని వసుధార అంటుంది. చిన్న వయసులోనే బంధాలు, అనుబంధాల గురించి గొప్పగా చెప్పేవని, కొందరికి వయసు పెరిగిన వాటి విలువ అర్థం కాదని అనుపమపై సెటైర్ వేస్తాడు మహేంద్ర. అతడిపై కోప్పడుతుంది అనుపమ.
అనుపమ అబద్ధం...
ఏంజెల్ భోజనానికి అన్ని సిద్ధం చేస్తుంది. కానీ తాను తినడానికి రానని, ఆకలిగా లేదని అనుపమ అబద్ధం ఆడుతుంది. నేను ఉంటే అమ్మ భోజనం చేయదని, తాను వెళ్లిపోతానని మను అంటాడు. అతడిని మహేంద్ర వారిస్తాడు. నువ్వు మాతో పాటు కలిసి భోజనం చేయాల్సిందేనని అంటాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు ఎపిసోడ్ ముగిసింది.