Guppedantha Manasu Today Episode: మనుకు శిక్ష వేసిన ప్రశ్న - వసుకు అనుపమ కౌంటర్ - రిషి ఊసుకూడా ఎత్తడం లేదుగా!
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో తల్లి విధించిన శిక్షను తలచుకొని మను ఎమోషనల్ అవుతాడు. తన తండ్రి ఎవరో తెలియక పాతికేళ్లుగా తాను ఎంతో మనో వేదనను అనుభవిస్తున్నానని కన్నీళ్లు పెట్టుకుంటాడు.
నువ్వు అనుపమ కోసం బాధపడటం, అనుపమ నీ కోసం తల్లడిల్లడం బాగాలేదని మనుతో అంటాడు. మీ సమస్యను సాల్వ్ చేసుకొని సంతోషంగా ఉండమని సలహా ఇస్తాడు. కన్నవాళ్లకు ఏ కష్టం రాకుండా కంటికిరెప్పలా చూసుకోవాలని నాకు ఉంది. కానీ అది నా కల.
నా జీవితంలో అలాంటి రోజులు ఉండవేమోనని మను అంటాడు. అనుపమకు నాకు మధ్య ఉన్న సమస్య జీవితాంతం సమస్యగానే ఉండిపోతుంది. సాల్వ్ అయ్యేది కాదని ఎమోషనల్‌గా మహేంద్రకు బదులిస్తాడు మను.
అమ్మ అని పిలవొద్దని ఒట్టు వేయించుకుంది...
అనుపమ నా స్నేహితురాలు. నువ్వు తన కొడుకువి అని తెలియకముందే నీ వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డాను. మీరిద్దరు ఎదుటివాళ్ల మంచే ఎప్పుడు కోరుకుంటారు. అలాంటి మీరూ దూరంగా ఉండటం బాగాలేదని అంటాడు. అమ్మ అని పిలవద్దని అనుపమ నీతో ఎందుకు ఒట్టు వేయించుకుందని, కన్నతల్లి అలా చేసింది అంటే నమ్మకలేకపోతున్నానని మహేంద్ర అంటాడు. మీ మధ్య ఏం జరిగిందో చెప్పమని మనను ప్రాధేయపడతాడు మహేంద్ర.
ఒకే ఒక్క ప్రశ్న...
మా మధ్య దూరం పెరగడానికి ఒక్క ప్రశ్న కారణం. పాతికేళ్లుగా బాధ, వేదన భరిస్తున్నది ఆ ఒక్క ప్రశ్న వల్లే. ఆ ప్రశ్నకు సమాధానం దొరకదు. నా బాధకు విముక్తి కలగదని మను కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ ప్రశ్న ఏమిటని మనను అడుగుతాడు మహేంద్ర. కానీ అది మాత్రం మను చెప్పడు. ఇంతకుమించి నన్ను ఏం అగకూడదని చెప్పి వెళ్లిపోతాడు.
మను రాలేదా....
అనుపమ బెడ్‌పై లేచి వాకింగ్ చేస్తుంటుంది. అది చూసి వసుధార, ఏంజెల్ కంగారు పడతారు. మహేంద్ర రాలేదా అని వసుధారను అడుగుతుంది అనుపమ. మను రాలేదా అని మీరు అడుతారని అనుకున్నానని వసుధార అంటుంది. మను ఇక్కడికి ఎందుకొస్తాడు. రావాల్సిన అవసరం ఏముంటుంది అని అనుపమ బదులిస్తుంది.
మిమ్మల్ని చూడటానికి మను రాకూడదా...అతడికి హక్కు లేదా అని వసుధార అంటుంది. మీరు మాటల్లో రావద్దని మనుతో చెప్పిన...మీ మనసు మాత్రం మను రావాలని కోరుకుంటుందని అనుపమతో చెబుతుంది వసుధార.
ఆ స్టేజ్ దాటిపోయా...
మనుషులు దగ్గరగా ఉన్నప్పుడు సంతోషంగా ఫీలవ్వడం, దూరమైతే బాధపడటం ఇవన్నీ దాటుకునే వచ్చానని వసుధారకు రిప్లై ఇస్తుంది అనుపమ. ఒక్కసారి బంధం అంటూ ఏర్పడితే ప్రాణం పోయే వరకు మీ వెంటే వస్తుంది. దూరమైన, భారమైనా ఆ బంధం మిమ్మల్ని వదిలిపెట్టదని వసుధార అంటుంది.
ఆ బంధం వల్లే మను ప్రాణాలకు మీ ప్రాణాలను అడ్డువేశారని , అతడిని కాపాడారని వసుధార అంటుంది. నిజంగా మీరు అన్ని వదిలేసి ఉంటే అలా చేసుండేవారు కాదని వసుధార చెబుతుంది. వసుధార, ఏంజెల్ ఎంత సర్దిచెప్పిన మనుతో కలిసి ఉండేది లేదని తెగేసి చెబుతుంది అనుపమ. మీ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదని కఠినంగా ఇద్దరికి సమాధానం చెబుతుంది.
మను ఎమోషనల్...
అనుపమ ఫొటోను ఫోన్‌లో చూస్తూ నేను ఏం పాపం చేశాను. నీ కొడుకుగా పుట్టడమే నేను చేసిన నేరమా. నాకే ఎందుకు ఈ శిక్ష అని మను ఎమోషనల్ అవుతాడు. ప్రతి ఒక్కరికి తండ్రి వేలుపట్టుకొని నడక నేర్పిస్తుంటాడు. భుజాలపై ప్రపంచాన్ని చూపిస్తుంటాడు. నాకు ఆ అదృష్టం లేదు.
పాతికేళ్లు అయినా ఇంకా నాకు నా తండ్రి ఎవరన్నది తెలియదు. కనీసం అతడి పేరు కూడా తెలియదు. నా తండ్రిని చూడాలని, అతడితో మనసు విప్పి మాట్లాడాలని నాకు ఉంటుంది కదా అని మను మనసులో అనుకుంటాడు.
నీ తండ్రి ఎవరు అని ఎవరైనా అడిగిన ప్రతిసారి నా గుండె ముక్కలైపోతుంది. అసలు ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెబుతావా...లేదంటే అడ్రస్ లేనివాడిలా జీవితాంతం నేను ఒంటరిగా ఉండిపోవాల్సిందేనా అని మను కన్నీళ్లు పెట్టుకుంటాడు.
మహేంద్ర ఆవేశం...
మను దగ్గర తనకు కావాల్సిన సమాధానం దొరక్కపోవడంతో ఆవేశంగా ఇంటికొస్తాడు మహేంద్ర. వచ్చిరావడంతోనే అనుపమపై విరుచుకుపడతాడు. కన్నకొడుకుపై నీకు ఎందుకు అంత పంతం. మనును అలా చూడటం నాకే బాధగా ఉంది. కన్నతల్లివైనా నీ మనసు కరగడం లేదా. ఇలా ఉండి నువ్వు ఏం సాధిస్తావని ఫైర్ అవుతాడు. నిజాన్ని మీ మధ్య ఇలా సమాధి చేసుకుంటే పరిష్కారం ఎలా దొరుకుతుంది అని కొప్పడుతాడు మహేంద్ర.
మనుకు నీకు మధ్య దూరం పెంచిన ఆ ఒక్క ప్రశ్న ఏమిటని అనుపమను నిలదీస్తాడు మహేంద్ర. ఆ ప్రశ్న ఏమిటో నేను చెప్పనా...తన తండ్రి ఎవరని మను నిన్ను అడిగి ఉంటాడు. అంతే కదా అని అనుపమతో అంటాడు డ్రామా. ఈ ప్రశ్నే కదా మీ ఇద్దరి మధ్య గొడవకు కారణమని అనుపమతో చెబుతాడు మహేంద్ర. నిన్ను నిలదీసినందుకు మనుకు ఇలాంటి శిక్ష వేయడంలో న్యాయం లేదని మహేంద్ర అంటాడు.
మను బాధపడకూడదు.
నా జీవితంలో సంతోషానికి కారణమైన మను బాధపడకూడదు. అతడిని సంతోషంగా ఉంచడం నా బాధ్యత అని మహేంద్ర అంటాడు. మను తండ్రి ఎవరనే ప్రశ్నకు సమాధానం చెప్పేవరకు నేను ఇక్కడి నుంచి కదలనని చెబుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వసుధార...అనుపమను ఇప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని మహేంద్రతో చెబుతుంది.
దేవయాని ప్రశ్నలు...
దేవయాని కూడా ఇంత వరకు మను తండ్రి ఎవరు అనే ప్రశ్నలతో అనుపమను బాధపెట్టిందని, ఇప్పుడు మీరు కూడా అవే ప్రశ్నలు అడిగి ఇబ్బంది పెడుతున్నారని మహేంద్రతో అంటుంది వసుధార. ఆమె హెల్త్ కండీషన్ మరింత దిగజారుతుందని చెబుతుంది. వసుధార మాటలతో మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.