Guppedantha Manasu Today Episode: మను తండ్రి ఎవరు?- అండర్‌గ్రౌండ్‌లోకి శైలేంద్ర - జగతిని గుర్తుచేస్తోన్న అనుపమ
Guppedantha Manasu Today Episode: మను, అనుపమ మధ్య దూరం తగ్గించి తల్లీకొడుకులను ఒక్కటి చేయాలని వసుధార ప్లాన్ వేస్తుంది. మరోవైపు తన ఎటాక్ ప్లాన్ మిస్సవ్వడంతో శైలేంద్ర భయపడిపోతాడు. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu Today Episode: అనుపమను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తారు. ఆమెను తమ ఇంటికి తీసుకెళ్తానని ఏంజెల్ పట్టుపడుతుంది. మహేంద్ర వద్దని వారిస్తాడు. అనుపమ బాధ్యత తమదేనని అంటాడు. చివరకు మహేంద్ర పంతమే నెగ్గుతుంది. అనుపమను తన ఇంటికే తీసుకొస్తాడు మహేంద్ర. అనుపమ మెడిసిన్స్ కారులోనే ఉండిపోతాయి. వాటిని తీసుకురావడానికి ఏంజెల్ వెళ్లబోతుంది.
కానీ ఆమెను వసుధార ఆపేస్తుంది. మనునే ఆ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి అనుపమకు ఇవ్వాలని అంటుంది వసుధార. మను అనుపమ మధ్య దూరం తగ్గించేందుకు ఈ ప్లాన్ వేస్తుంది. మను చేతనే అనుపమ ట్యాబ్లెట్స్ వేసుకునేలా చేస్తుంది. వసుధార తెలివితేటలు చూసి మహేంద్ర మురిసిపోతాడు.
అవసరం రాదు...
మను బతిమిలాడటంతో అనుపమ ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది. తాను ఇంటికి వెళ్లిపోతున్నట్లు, ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని అనుపమకు చెబుతాడు మను. ఆ అవసరం రాదని అనుపమ కఠినంగా బదులిస్తుంది. ఆమె మాటలతో హర్ట్ అయిన మను కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వసుధార పిలుస్తున్నా పట్టించుకోడు.
మను ఎమోషనల్...
ప్రాణాలు కాపాడిన తల్లి బాగోగులను ఆమె పక్కనుండి చూసుకునే అవకాశం తనకు లేకపోవడంతో మను ఎమోషనల్ అవుతాడు. ఏం నేరం చేశానని అనుపమ తనను దూరం పెట్టిందని ఆవేదనకు లోనవుతాడు. నేను చేసిన తప్పు ఏమిటో చెబితే సరిపోతుంది కదా అని మనసులో అనుకుంటాడు. అనుపమ ఎందుకు హర్ట్ అయ్యిందోనని అనుకుంటాడు. అమ్మతో కలిసి మనస్ఫూర్తిగా మాట్లాడే రోజు, సంతోషంగా కలిసుండే రోజు ఎప్పుడోస్తుందోనని తల్లడిల్లిపోతాడు. తన ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు దొరుకుతుందో అని అనుకుంటాడు.
మహేంద్ర షాక్...
తనకు చెప్పకుండా మను ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో మహేంద్ర షాకవుతాడు. మనును అలా ఎలా పంపిస్తావు అంటూ అనుపమపై ఫైర్ అవుతాడు మహేంద్ర. ఇన్నాళ్లు అతడు పరాయివాడు అనుకున్నాం. అందుకే నువ్వు అతడితో ఎంత కఠినంగా ఉన్న పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నీ కొడుకు అని తెలిసింది. మా కళ్ల ముందే నువ్వు అతడిని బాధపెట్టడం బాగాలేదని మహేంద్ర సలహా ఇస్తాడు.
ఒకప్పుడు రిషి కూడా తల్లికి దూరంగా ఉంటూ ఇలాంటి బాధనే అనుభవించాడు. తల్లీకొడుకులు పరిచయం లేనివాళ్లుగా ఉంటున్నారంటే మీ మధ్య ఏదో జరిగింది. ఆ నిజం ఏమిటో చెప్పమని అనుపమను నిలదీస్తాడు మహేంద్ర. నీ ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవని అనుపమ బదులిస్తుంది.
అందరితో మంచిగా ఉండే మీరు కన్న కొడుకు విషయంలో ఎందుకు అంత కఠినంగా ఉంటున్నారని వసుధార కూడా అనుపమ నుంచి నిజాన్ని బయటపెట్టించాలని ప్రయత్నిస్తుంది. కానీ ఎవరు ఎంత అన్న అనుపమ మాత్రం నిజం చెప్పదు.
అమ్మ అని పిలవొద్దు…
అమ్మ అని పిలవొద్దని మను దగ్గర నువ్వే మాట తీసుకుంటున్నావటగా అని అనుపమతో అంటాడు మహేంద్ర. అలా ఎందుకు మాట తీసుకున్నావో చెప్పమని అనుపమను గట్టిగా అడుగుతాడు మహేంద్ర. మను ప్రాణాలను కాపాడిన నువ్వే అతడిని కొడుకుగా ఎందుకు ట్రీట్ చేయలేదో చెప్పాలని నిలదీస్తాడు. మహేంద్ర మాటలతో అనుపమ ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లు పెట్టుకుంటుంది. దాంతో మహేంద్ర ప్రశ్నల వర్షాన్ని వసుధార అడ్డుకుంటుంది.
శైలేంద్ర భయం...
రాజీవ్‌ను కలుస్తాడు శైలేంద్ర. మనును చంపేందుకు ప్లాన్ చేసినా ఆ ఎటాక్ నుంచి వాడు మిస్సయ్యాడని రాజీవ్‌తో చెబుతాడు శైలేంద్ర. అనుపమ ప్రాణాలతో బయటపడటంతో ఆమె నోరు తెరిస్తే తన పనైపోతుందని శైలేంద్ర భయపడతాడు. ఇంతకుముందు రిషిపై ఎటాక్ చేసిన రౌడీనే మనును చంపేందుకు నియమించానని, వాడిని అనుపమ గుర్తుపట్టిందని అంటాడు. ఈ ఎటాక్‌పై ఎంక్వైరీ చేస్తే మనం దొరికిపోతామని జాగ్రత్తగా ఉండమని రాజీవ్‌కు సలహా ఇస్తాడు శైలేంద్ర. మనం కాదు నువ్వు అంటూ శైలేంద్రపై సెటైర్ వేస్తాడు రాజీవ్. నేను దొరికితే నువ్వు దొరికినట్లేనని శైలేంద్ర బదులిస్తాడు.
ఎంక్వైరీలు జరిగిన మనును దెబ్బకొట్టేందుకు ఈ కుట్రలను ఆపనని శైలేంద్రతో చెబుతాడు రాజీవ్. ఫోన్ చేసి బెదిరించడాలు, పోస్టర్స్ వేయడాలు ఉండవు. ఇక నుంచి డైరెక్ట్ ఎటాక్‌లే చేస్తానని శైలేంద్రతో చెప్పి రాజీవ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. రాజీవ్ మాటలతో శైలేంద్ర భయం మరింత పెరుగుతుంది. ఏ మాత్రం తేడా కొట్టిన రాజీవ్‌తో పాటు తాను దొరికిపోవడం ఖాయమని కంగారు పడతాడు.
వసుధార బాధ
పోస్టర్స్ విషయంలో మనును అపార్థం చేసుకున్నందుకు వసుధార బాధపడుతుంది. మనుకు సారీ చెప్పందుకు అతడి క్యాబిన్‌కు వస్తుంది. కానీ క్యాబిన్ లాక్ చేసి ఉంటుంది. మను కాలేజీకి రాలేదని అటెండర్ చెబుతాడు. మనుకు ఫోన్ చేస్తుంది వసుధార. కానీ ఫోన్ స్విఛాఫ్ లో ఉంటుంది.
మహేంద్ర ప్రశ్నలు
వసుధార కాలేజీకి వెళ్లగానే మరోసారి అనుపమ దగ్గరకు వస్తాడు మహేంద్ర. మను నీ కొడుకు అనే విషయం మా దగ్గర ఎందుకు దాచావని అనుపమను అడుగుతాడు. నీ జీవితానికి సంబంధించిన రహస్యాలను మా దగ్గర దాచిపెట్టి మమ్మల్ని పరాయివాళ్లను చేస్తున్నావని అంటాడు. మను విషయంలో నేను దాచిన రహస్యం నా అనుకున్న వాళ్లను బాధపెడుతుంది.
నాకు తెలిసిన వాళ్లను ఇబ్బందిపెడుతుందని అందుకే ఎవరికి చెప్పలేదని అనుపమ బదులిస్తుంది. ఎంత దగ్గరవాళ్లయినా, ఆత్మీయులైనా కొన్ని విషయాలను వారితో పంచుకోలేం. కొన్నింటిని గుండెల్లో దాచుకోవాలని మహేంద్రతో అంటుంది అనుపమ. నా గురించి నీకు అన్ని తెలియాలని లేదని అంటుంది. నువ్వు మను తల్లికి అయితే మను తండ్రి ఎవరని అనుపమను అడుగుతాడు మహేంద్ర. ఆ ప్రశ్నకు అనుపమ షాకవుతుంది. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.