Guppedantha Manasu March 7th Episode: కాలేజీలో వసుధార, మను పోస్టర్స్ రచ్చ - దేవయానికి ఎదురుతిరిగిన శైలేంద్ర
Guppedantha Manasu March 7th Episode: వసుధార, మను క్లోజ్‌గా ఉన్న ఫొటోలను కాలేజీ మొత్తం అంటిస్తాడు రాజీవ్. ఆ ఫొటోలను చూసి వసుధార షాకవుతుంది. ఈ ఫొటోలను మనునే అంటించాడని అందరిని నమ్మించే ప్రయత్నం చేస్తాడు శైలేంద్ర. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu March 7th Episode: మను అడ్డు తప్పించి వసుధారను తన సొంతం చేసుకోవడానికి మరో కొత్త ప్లాన్ వేస్తాడు రాజీవ్. వసుధార, మను క్లోజ్‌గా దిగిన ఫొటోలను డీబీఎస్‌టీ కాలేజీ మొత్తం అంటిస్తాడు.
కొత్త ప్రేమ జంట అంటూ ఆ ఫొటోలపై రాస్తాడు. పని పూర్తయిన విషయం శైలేంద్రకు చెప్పాలని ఫోన్ చేస్తాడు రాజీవ్. కానీ శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడు. రేపటితో నాకు పట్టిన శని వదలబోతుంది. నువ్వు నా సొంతం కాబోతున్నావని వసుధార మనసులో ఉహించుకొని రాజీవ్ ఆనందపడతాడు.
మిడ్‌నైట్ దొంగచాటుగా...
పోస్టర్స్ కాలేజీలో అంటించిన సంగతి శైలేంద్రకు చెప్పడానికి మిడ్‌నైట్ దొంగచాటుగా అతడి ఇంటికి వస్తాడు రాజీవ్. గాఢనిద్రలో ఉన్న శైలేంద్ర...రాజీవ్‌ను చూసి కంగారుపడి అరుస్తాడు. అతడి అరుపుకు ధరణి నిద్రనుంచి లేస్తుంది. ఏమైందని అడుగుతుంది.
ఎవరో ఇంట్లోకి వచ్చినట్లుగా తనకు అనిపించిందని ధరణి అనుమానపడుతుంది. ధరణికి కనిపించకుండా మంచం కింద దాక్కుంటాడు రాజీవ్. అనుకోకుండా రాజీవ్ చేతిని ధరణి తొక్కేస్తుంది. బాధతో రాజీవ్ అరుస్తాడు. ఆ అరుపు విని ధరణి కంగారు మరింత పెరుగుతుంది. మంచం కిందకు చూడబోతుంటే ఆమెను శైలేంద్ర ఆపేస్తాడు. టాపిక్ డైవర్ట్ చేసి ధరణిని బెడ్‌రూమ్ నుంచి బయటకు పంపిస్తాడు.
శైలేంద్ర సీరియస్...
ఈ టైమ్‌లో ఇంటికి ఎందుకొచ్చావని రాజీవ్‌పై శైలేంద్ర సీరియస్ అవుతాడు. కాలేజీలో నేను చేసిన పని గురించి నీకు చెప్పాలనే వచ్చానని అంటాడు. వసుధార, మను పోస్టర్స్ కాలేజీలో అంటించిన వీడియోను శైలేంద్రకు చూపిస్తాడు రాజీవ్. ఆ వీడియో చూసి శైలేంద్ర ఆనందపడతాడు. ఇప్పటివరకు మనం వేసిన ప్లాన్స్ ఓ ఎత్తు అయితే...ఈ ప్లాన్ మరో ఎత్తు. ఈ ప్లాన్ ఫెయిలయ్యే సమస్యే లేదని శైలేంద్రతో అంటాడు రాజీవ్. రేపు వసుధార నా సొంతం, ఎండీ సీట్ నీ సొంతం శైలేంద్రతో అంటాడు రాజీవ్. రాజీవ్ చేసిన పనికి గర్వంగా ఫీలవుతాడు శైలేంద్ర. అతడిని తెగ పొగుడుతాడు.
అద్భుతమైన సినిమా...
శైలేంద్ర బెడ్‌రూమ్‌లో కనిపించకపోవడంతో అతడి గురించి ధరణి వెతుకుంటుంది. అప్పుడే బయట నుంచి రూమ్‌లో అడుగుపెడుతూ శైలేంద్ర కనిపిస్తాడు. చాలా సంతోషంగా ఉంటాడు. రేపు నువ్వు కాలేజీకి రావాల్సిందేనని ధరణితో అంటాడు శైలేంద్ర. ఓ అద్భుతమైన సినిమా చూపిస్తా....ప్రేక్షకులకు నచ్చినా, నచ్చకపోయినా సినిమా చూడాల్సిందేనని ధరణికి చెబుతాడు. కాలేజీలో పోస్టర్స్ అంటించిన సంగతి మాత్రం ధరణికి దగ్గర దాచిపెడతాడు శైలేంద్ర.
దేవయాని సెటైర్స్....
కాలేజీకి వెళ్లాలనే ఆత్రుతతో తొందరగా రెడీ అవుతాడు శైలేంద్ర. చాలా సంతోషంగా కనిపిస్తున్నావు...కారణం ఏమిటో చెబితే నేను హ్యాపీగా ఫీలవుతానని దేవయాని అంటుంది. కానీ విషయం ఏమిటన్నది తల్లి దగ్గర కూడా దాచిపెడతాడు. శైలేంద్రతో పాటు ధరణి కాలేజీకి వెళ్లడం చూసి దేవయాని షాకవుతుంది. ధరణిని కాలేజీకి తీసుకెళ్లడం నమ్మశక్యంగా లేదని అంటుంది.
నా భార్య ను కాలేజీకి తీసుకెళుతున్నానంటే నమ్మశక్యంగా లేదని ఎలా అంటావని తల్లిపై ఫైర్ అవుతాడు శైలేంద్ర. సినిమాకు, పార్టీకి కాకుండా కాలేజీకే ఎందుకు తీసుకెళుతున్నావని కొడుకును ప్రశ్నిస్తుంది దేవయాని. కాలేజీలో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని, ఆ సెలబ్రేషన్స్ ఏమిటో మేము వచ్చిన తర్వాత నీకే అర్థమవుతాయని తెలివిగా సమాధానం చెబుతాడు.
తల్లి ఆశీర్వాదం తీసుకొని కాలేజీకి బయలుదేరుతాడు. దేవయాని కాలేజీకి వస్తానని చెప్పిన శైలేంద్ర వద్దని వారిస్తాడు.
శైలేంద్ర హర్ట్...
ధరణిపై సెటైర్స్ వేస్తుంది దేవయాని. ఆమె మాటలతో శైలేంద్ర హర్ట్ అవుతాడు. దేవయానిపై సీరియస్ అవుతాడు. నువ్వు చాలా మారిపోయావ్. తల్లిని దూరం పెడుతున్నావు, నా మాట లెక్కచేయడం లేదని శైలేంద్రపై కోపగించుకుంటుంది దేవయాని. ఎంత చెప్పిన దేవయానిని కాలేజీకి తీసుకెళ్లే ప్రసక్తే లేదని శైలేంద్ర బదులిస్తాడు. శైలేంద్రది నాటకం అని తెలియక నిజంగానే అతడు మారిపోయాడేమోనని దేవయాని కంగారు పడుతుంది.
పోస్టర్స్ రచ్చ...
రాజీవ్ అంటించిన పోస్టర్స్ కాలేజీలో రచ్చ లేపుతాయి. ఆ పోస్టర్స్ చుట్టూ స్టూడెంట్స్ గుమిగూడి రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. వసుధార, మను... కొత్త ప్రేమ జంట అంటూ పోస్టర్స్‌పై శైలేంద్ర కామెంట్స్ చేస్తాడు. అతడిపై అనుపమ ఫైర్ అవుతుంది. అప్పుడే కాలేజీకి వచ్చిన వసుధార ఆ పోస్టర్స్ చూసి షాకవుతుంది.
మహేంద్ర ఆవేశం...
కావాలనే మనపై కక్ష గట్టి ఎవరో ఈ పోస్టర్స్ అంటించారని మహేంద్ర ఆవేశానికి లోనవుతాడు. పోస్టర్స్ చించబోతాడు. అతడిని శైలేంద్ర అడ్డుకుంటాడు. ఒక్క పోస్టర్ చించేయడం వల్ల ఉపయోగం లేదని, కాలేజీ మొత్తం ఈ పోస్టర్స్ అంటించారని అంటాడు. అప్పుడే మను కాలేజీలోకి అడుగుపెడతాడు.
అతడు కూడా పోస్టర్స్ చూసి షాకవుతాడు. ఈ పోస్టర్స్ మనునే అంటించాడని స్టూడెంట్స్, లెక్చరర్స్‌ను నమ్మించే ప్రయత్నం చేస్తాడు శైలేంద్ర. అందరూ అతడినే నిలదీస్తారు. అనుపమ కూడా అదే నిజమని నమ్ముతుంది. తాను ఈ పోస్టర్స్ తాను అంటించలేదని మను సమాధానమిస్తాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.