Guppedantha Manasu Today Episode: శైలేంద్రను చెంపలు వాయించిన దేవయాని - మను తండ్రి మహేంద్రనా - ఇదేం ట్విస్ట్!
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో అనుపమ, మను మధ్య గొడవను సాల్వ్ చేసేందుకు మహేంద్ర ప్రయత్నిస్తుంటాడు. ఓ తండ్రిగా నన్ను భావించి మీ మధ్య ఏం జరిగిందో చెప్పమని మనును అడుగుగాడు. తండ్రి అనే పిలుపు వినగానే మను ఎమోషనల్ అవుతాడు.
మను తండ్రి ఎవరు? మంచివాడేనా...మిమ్మల్ని బాగా చూసుకుంటాడా అంటూ సెటైర్స్ వేస్తుంది. ఆ టాపిక్స్ వదిలేయమని అనుపమ చెబుతున్న దేవయాని మాత్రం తన మాటల ప్రవాహాన్ని కొనసాగిస్తుంది.
మను కుంతి పుత్రుడా....
నువ్వు ఇక్కడికి వచ్చి చాలా రోజులైన నీ భర్త కనిపించడం లేదంటే మను కుంతి పుత్రుడా అంటూ మాటలతో అనుపమను అవమానిస్తుంది దేవయాని. అనుపమ సీరియస్‌గా దేవయానిపై ఓ లుక్కేస్తుంది. నీకు ఓ కొడుకు ఉన్నప్పుడు...అతడి తండ్రి ఎవరు? నీ భర్త ఎవరని అడుగుతున్నాను.
దానికే అంత సీరియస్ గా లుక్ ఇవ్వాల్సిన అవసరం లేదని దెప్పిపొడుస్తుంది దేవయాని. కనీసం నీ కొడుకుకైనా వాడి తండ్రి ఎవరన్నది తెలుసా అంటూ అనుపమతో అంటుంది దేవయాని. నీ భర్త పేరు ఏమిటో చెప్పు. పేరు చెప్పడం ఇష్టం లేదంటే చిన్న క్లూ ఇవ్వమని అనుపమను పట్టుపడుతుంది దేవయాని.
వసుధార ఎంట్రీ...
అప్పుడే అక్కడికి వసుధార ఎంట్రీ ఇస్తుంది. దేవయానిని డిస్ట్రబ్ చేస్తుంది. నీది కరెక్ట్ టైమ్ ఎప్పుడూ మంచి టైమ్‌కు వస్తావని దేవయాని వ్యంగ్యంగా వసుధారపై పంచ్ వేస్తుంది. మీలాంటి వాళ్లు ఉన్నప్పుడు మాలాంటి వాళ్లు కరెక్ట్ టైమ్‌కు రావడమే మంచిదని వసుధార ఆన్సర్ ఇస్తుంది అనుపమను ఏదో గుచ్చిగుచ్చి అడుగుతున్నారు అదేమిటని దేవయానిని నిలదీస్తుంది వసుధార.
అనుపమకు ఓ కుటుంబం ఉందని, మను ఆమె కొడుకు అని తెలిసింది కదా...అతడి తండ్రి ఎవరు అని అనుపమను అడుగుతున్నానని అంటుంది. వారి కుటుంబాన్ని భోజనానికి పిలవాలని అనుకుంటున్నట్లు వసుధారతో చెబుతుంది దేవయాని.
ఎన్నో పాపాలు చేసిన చేయి తాకితే పచ్చగడ్డి కూడా భగ్గుమనట్లు మీచేతితో చీర పెట్టడం ఏమిటని దేవయానిపై వసుధార పంచ్ వేస్తుంది వసుధార. వసుధారపై ఫైర్ అవుతుంది దేవయాని. నేను మిమ్మల్ని అనలేదని, ఏదో సామెత చెప్పానని వసుధార మాటదాటేస్తుంది. అప్పుడే ఏంజెల్ రూమ్‌లోకి వస్తుంది.
ఏంజెల్‌పై ఎటాక్...
మీ మావయ్య పేరేమిటి? అతడు ఏం చేస్తాడన్నది మీ అత్తయ్య కనీసం నీకైనా చెప్పిందా అని ఏంజెల్‌ను అడుగుతుంది దేవయాని. ఏంజెల్ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది. ఏంజెల్ నీ మేనకోడలు కదా కనీసం ఆమెకైనా చెప్పొచ్చుగా. అంత సీక్రెట్‌గా ఎందుకు దాచావని మళ్లీ భర్త టాపిక్‌ను అనుపమ దగ్గర తీసుకొస్తుంది దేవయాని.
ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకూడదు...
పరామర్శించడానికి వచ్చినవాళ్లు పరామర్శించాలి. అంతే కానీ ప్రశ్నలతో ఇబ్బంది పెట్టకూడదని దేవయానికి ఇన్‌డైరెక్ట్‌గా వార్నింగ్ ఇస్తుంది వసుధార. మీకు అవసరం లేని విషయాలు తెలుసుకోవడానికి ఆరాలు తీయకండి. మీ అరోగ్యానికి మంచిది కాదని వసుధార అంటుంది. మీరు చెప్పకపోతే నేనే తెలసుకుంటానని వసుధార ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దేవయాని.
శైలేంద్ర ప్రస్టేషన్...
మను వార్నింగ్‌తో శైలేంద్ర ప్రస్టేషన్‌కు గురవుతాడు. దాని గురించే తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. తన మాటలతో అతడి చిరాకును మరింత పెంచేస్తుంది ధరణి. అనుపమ దగ్గరకు దేవయాని వెళ్లి చాలా టైమ్ అయినా ఆమె తిరిగి రాకపోవడంతో టెన్షన్‌గా ఎదురుచూస్తుంటాడు శైలేంద్ర. దేవయాని కనిపించగానే అనుపమను కలిశావా...అనుకున్న పని జరిగిందా అని ఎగ్జైటింగ్‌గా అడుగుతాడు శైలేంద్ర.
కోపంగా శైలేంద్ర చెంపపై గట్టిగా ఒక్కటిస్తుంది దేవయాని. ఇది వసుధార చెంపపై పడాల్సిన దెబ్బ నీ చెంపపై పడిందని అంటుంది. అక్కడ పడాల్సిన దెబ్బ ఇక్కడ పడితే ఏం ఉపయోగం ఉంటుందని నొప్పిని ఓర్చుకుంటూ బాధగా తల్లితో అంటాడు శైలేంద్ర. నా ప్రస్టేషన్ పోతుందని నిన్ను కొట్టానని అనుపమ బదులిస్తుంది.
అనుపమ ఆరాలు...
మనుకు అనుపమకు మధ్య మాటలు లేకపోవడానికి ఏదో బలమైన కారణం ఉందని, అదేమిటో నువ్వు కనిపెట్టమని శైలేంద్రతో అంటుంది దేవయాని. నేను కనిపెట్టేది అయితే నిన్ను అనుపమ దగ్గరకు ఎందుకు వెళ్లమని అంటానని తల్లితో అంటాడు శైలేంద్ర.
అనుపమను తాను చాలా ప్రశ్నలు అడిగానని, అన్నింటికి ఆమె మౌనంగానే ఉందని, సమాధాన చెప్పలేదని దేవయాని బదులిస్తుంది. నా మనసులో ఉన్న అనుమానాలపై క్లారిటీ రావడానికి కొంచెం టైమ్ పడుతుందని, అప్పటివరకు నువ్వు రిలాక్స్‌డ్‌గా ఉండమని కొడుకుతో అంటుంది దేవయాని.
అనుపమ జీవితంలో ఏం జరుగుతుందో తెలియక వసుధార, ఏంజెల్ కంగారు పడుతుంటారు. అనుపమ గతం గురించి తెలిసిన వాళ్లు ఎవరో ఒకరు ఉంటారని వసుధార అనుకుంటుంది. తమకు తెలియని అనుపమ స్నేహితులు ఎవరా అని ఆలోచిస్తుంటారు.
మను ఎమోషనల్...
మనును వెతుక్కుంటూ వస్తాడు మహేంద్ర. అనుపమను అమ్మ అని పిలవడానికి నువ్వు ఎందుకు సంకోచిస్తున్నావు. నిన్ను కొడుకుగా అనుపమ ఎందుకు ట్రీట్ చేయడానికి లేదని మనును అడుగుతాడు మహేంద్ర. మాట వరుసకైనా మీ మధ్య అమ్మ అనే పిలుపు కూడా రావడం లేదంటే మీ మధ్య ఎదో పెద్ద గొడవ జరిగి ఉంటుందని మహేంద్ర అనుమానం వ్యక్తం చేస్తాడు. మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదని, కొన్ని కారణాల వల్ల వేరు వేరుగా ఉంటున్నామని, ఆ కారణం మీతో చెప్పడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని మహేంద్రకు బదులిస్తాడు మను.
నీ తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నానని అనుకోమని , మీ మధ్య జరిగిన గొడవను నేను తీరుస్తానని మనుతో అంటాడు మహేంద్ర. తండ్రి అనే పేరు వినగానే మను ఎమోషనల్ అవుతాడు. మా సమస్య సాల్వ్ అయ్యేది కాదని, జీవితాంతం అది సమస్యగానే ఉండేదని మహేంద్రకు బదులిస్తాడు మను. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.