Guppedantha Manasu Today Episode: దేవయాని లెక్కలు తేలుస్తానన్న వసుధార - కొడుకు కాలర్ పట్టుకున్న అనుపమ
Guppedantha Manasu Today Episode: అనుపమను అవమానించాలని దేవయాని స్కెచ్ వేస్తుంది. ఆమె ప్లాన్‌ను మహేంద్ర, వసుధార చెడగొడతారు. దేవయానికి వసుధార వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగిందంటే?
Guppedantha Manasu Today Episode: మను తండ్రి ఎవరో చెప్పాలని అనుపమను గట్టిగా ప్రశ్నిస్తాడు మహేంద్ర. ఎంత అడిగిన అనుపమ మాత్రం సమాధానం చెప్పదు. మౌనంగా ఉంటుంది. నువ్వే మాకు ఓ సమస్యగా మారావని, మమ్మల్ని ఇలా ఎందుకు వేధిస్తున్నావని అనుపమపై ఫైర్ అవుతాడు మహేంద్ర. అతడి మాటలతో హర్ట్ అయిన అనుపమ ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోతుంది.
దేవయాని ఎంట్రీ...
మహేంద్ర ఇంట్లో నుంచి ఓ సీక్రెట్ ప్లేస్‌కు వెళుతుంది అనుపమ. ఆమె అడ్రెస్ కనిపెట్టిన దేవయాని...అనుపమ కంటే ముందే అక్కడికి వస్తుంది. దేవయానిని చూడగానే ఏం పని మీద వచ్చారని అనుపమ అడుగుతుంది. నిన్ను ఫాలో అవ్వడమే నా పని అంటూ దేవయాని సమాధానమిస్తుంది. ఎక్కడికి పారిపోతున్నావని అనుపమను అడుగుతుంది దేవయాని. తాను పారిపోవడం లేదని, వెళ్లిపోతున్నానని అనుపమ బదులిస్తుంది. పైకి వెళుతున్నావా అంటూ దేవయాని సెటైర్ వేస్తుంది.
దేవయాని ప్రశ్నలు...
నీ గతంలో ఏం జరిగింది? మను తండ్రి ఎవరు? అసలు నీకు పెళ్లి కాలేదా? అదే నిజం అయితే మను ఎవరు? నిజంగా నీ కొన్న కొడుకేనా అంటూ అనుపమపై దేవయాని ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. దేవయాని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇవన్నీ అడగటానికి మీరెవరూ అంటూ ఫైర్ అవుతుంది అనుపమ. బెదిరింపులను దేవయాని తేలిగ్గా తీసుకుంటుంది.
తప్పు చేసిన వాళ్లే పారిపోతారు...
జనరల్‌గా తప్పు చేసినవాళ్లు పారిపోతారు. మరి నువ్వు ఎందుకు పారిపోతున్నావు. అంటే నువ్వు తప్పు చేశావా...అందుకు సాక్ష్యమేనా అంటూ నోరుజారబోతుంది దేవయాని. అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన మహేంద్ర దేవయానికి వార్నింగ్ ఇస్తాడు. ఇంకో మాట మాట్లాడితే బాగుండదని అంటాడు. మీ స్థానంలో మరొకరు అంటే ఏం జరిగేదో నాకే తెలియదని వార్నింగ్ ఇస్తాడు.
మహేంద్ర ఫైర్...
అనుపమ ఎక్కడికో వెళ్లిపోతుంటే ఆపడానికి వచ్చానని ప్లేట్ ఫిరాయిస్తుంది దేవయాని. మీ డ్రామాలు ఆపమని దేవయానితో అంటాడు మహేంద్ర. మీ నాటకాలు అందరికి తెలుసునని చెబుతాడు. మీతో మాట్లాడాలంటేనే చిరాకుగా ఉందని అంటాడు. మనుకు సాయం చేయాలని తాను ఇక్కడికి వచ్చానని, తండ్రి ఎవరో తెలియక అతడు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నాడని, అతడి బాధను చూడలేక అనుపమను నిలదీయడానికి వచ్చానని మహేంద్రతో అంటుంది దేవయాని. నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదని మను అంటాడు.
వసుధార వార్నింగ్...
మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళితే మంచిదని దేవయానికి వార్నింగ్ ఇస్తుంది వసుధార. వెళ్లకపోతే ఏం చేస్తావని దేవయాని బదులిస్తుంది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఇప్పుడే ఫణీంద్రకు ఫోన్ చేస్తానని వసుధార అంటుంది. భర్త పేరు వినగానే దేవయాని వెనక్కితగ్గుతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
సమస్యపై ఫైట్ చేయాలి...
దేవయాని వెళ్లిపోగానే అనుపమపై ఫైర్ అవుతాడు మహేంద్ర. నువ్వు మాకు సమస్య అయ్యావని మేము ఎప్పుడైనా అన్నామా, చెప్పకుండా వెళ్లడం ఏంటి అని అనుపమపై ఫైర్ అవుతాడు మహేంద్ర. మాకు దూరంగా వెళితే నీ సమస్య తీరిపోతుందా అని క్లాస్ ఇస్తాడు.
సమస్య ఎదురైతే దానితో ఫైట్ చేయాలని కానీ దూరంగా పారిపోకూడదని అనుపమకు సర్ధిచెబుతుంది వసుధార. నువ్వు వెళ్లిపోతే...తప్పు చేసిన వాళ్లు పారిపోతారని దేవయాని అన్న మాటలు నిజమవుతాయని, ఒక్క ప్రశ్నకు పారిపోతే...నువ్వు వెళ్లే చోట వంద ప్రశ్నలు ఎదురవుతాయని మహేంద్ర కూడా అనుపమకు సర్ధిచెప్పబోతాడు.
హక్కు లేదన్న మను...
అమ్మను ఇక్కడే ఉండమని చెప్పమని మనుతో అంటాడు మహేంద్ర. ఆ హక్కు నీకు ఉందని అంటాడు. నాకు బాధలు, కష్టాలు మోయడం తప్పు ఎవరిపై ఏ హక్కు లేదని మను సమాధానమిస్తాడు. నువ్వు వెళ్లిపోయి ఆనందంగా ఉంటావు. ఆ తర్వాత మనును ఎంత మంది ఎన్ని రకాలుగా అవమానిస్తారో, అతడిని ఎన్నెన్ని ప్రశ్నలు అడుగుతారో ఆలోచించవా అని అనుపమకు క్లాస్ ఇస్తాడు మహేంద్ర. తండ్రి ఎవరో చెప్పకుండా ఇంకా తనను బాధపెట్టాలని చూస్తున్నావా అని అడుగుతాడు.
మను కాలర్ పట్టుకున్న అనుపమ...
మహేంద్రకు సమాధానం చెప్పకుండా ఆవేశంగా మను కాలర్ పట్టుకుంటుంది అనుపమ. నిన్ను ఇక్కడికి రావొద్దని చెప్పానుగా...నీవల్లే ఈ సమస్యలు, కష్టాలు అంటూ కోప్పడుతుంది. కన్న తల్లి దగ్గరకు కొడుకు రావద్దని అనడం విడ్డూరంగా ఉందని అనుపమ ఎమోషన్‌ను కొట్టిపడేస్తాడు మహేంద్ర.
మీరు అవమానాలు ఎదుర్కొంటుంది నీ వల్లేనని, కానీ నువ్వు మాత్రం కొడుకును శత్రువుగా చూస్తున్నావని, అతడి వల్లే ఈ కష్టాలన్నీ అని పొరపడుతున్నావని అనుపమతో అంటాడు మహేంద్ర.ఈ గొడవలన్నీ పక్కనపెట్టి ఇంటికి తిరిగి వచ్చేయమని అనుపమను రిక్వెస్ట్ చేస్తుంది వసుధార.
మహేంద్ర ప్రశ్నలు అడిగిన తీరును మను తప్పు పడతాడు. మీరు ప్రశ్నలు అనుపమను బాధపెడుతున్నాయని, ఇంకోసారి ఈ టాపిక్ ఆమె దగ్గర తీయోద్దని, ఇంకెప్పుడూ ఆమెను ప్రశ్నించవద్దని మహేంద్రను కోరుతాడు. ఇంకోసారి అనుపమను ఎలాంటి ప్రశ్నలు అడగనని మనుకు మాటిస్తాడు మహేంద్ర. వసుధార బలవంతపెట్టడంతో ఆమె వెంట మహేంద్ర ఇంటికి బయలుదేరుతుంది అనుపమ.
దేవయాని డిసపాయింట్...
అనుపమ నుంచి ఆమె భర్త పేరు రాబట్టాలనే తన ప్లాన్ ఫాయిల్ అవ్వడంతో దేవయాని డిసపాయింట్ అవుతుంది. నన్ను అనుపమ దగ్గరకు ఎందుకు తీసుకెళ్లలేదని, ఒంటరిగా ఎందుకు వెళ్లావని తల్లితో అంటాడు శైలేంద్ర. నిన్ను తీసుకెళ్లితే ప్లాన్ మొదట్లోనే ఫెయిలయ్యేదని, ఈ మధ్య నువ్వు అవసరమైన టాపిక్‌లపై ఫోకస్ పెడుతూ నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నావని కొడుకుతో అంటుంది దేవయాని. తల్లి కూడా తనను తక్కువ చేయడం శైలేంద్ర తట్టుకోలేకపోతాడు.
శైలేంద్ర ఈగో...
తల్లి ప్లానింగ్ సరిగా లేదంటూ దేవయానిపైనే రివర్స్‌గా ఫైర్ అవుతాడు. కాలేజీ సొంతం చేసుకోవడానికి సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లుగా చెబుతాడు. అతడు సీరియస్‌గా ఆలోచిస్తుంది డీఆర్ఎస్...కంటే డీఎస్ఆర్ అనే పేరు తమ గ్రూప్‌కు సెట్టవుతుందనే విషయం గురించి అని తెలిసి దేవయాని చిరాకు మరింత పెరుగుతుంది. పేర్ల దగ్గర నీకు ఈగోలు ఎందుకు అంటూ కొడుక్కి క్లాస్ పీకుతుంది. తల్లి మాటలతో ఆ టాపిక్ వదిలిపెడతాడు శైలేంద్ర. మనుపై దెబ్బకొట్టేందుకు కొత్త ప్లాన్ వేస్తాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.