Guppedantha Manasu April 4th Episode: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అనుపమ- దేవయాని ఆపరేషన్ డీఆర్ఎస్ - విలన్స్ ఈగో ఫైట్
Guppedantha Manasu April 4th Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో మను తండ్రి ఎవరో చెప్పమంటూ మహేంద్ర అడిగిన ప్రశ్నలను అనుపమ భరించలేకపోతుంది. ఇళ్లు వదిలివెళ్లిపోతుంది.
Guppedantha Manasu April 4th Episode: మను తండ్రి ఎవరో చెప్పమని అనుపమను నిలదీస్తాడు మహేంద్ర. ఎంత గట్టిగా అడిగినా అనుపమ మాత్రం సమాధానం చెప్పదు. తల్లిపై మహేంద్ర డామినేషన్‌ను మను సహించలేకపోతాడు. మహేంద్రపై ఫైర్ అవుతాడు. బలవంతంగా వసుధార అతడిని ఇంట్లో నుంచి పంపిచేస్తుంది.
మహేంద్ర బాధ...
వసుధార ఎంతగా వారించిన మహేంద్ర మాత్రం తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు. అనుపమపై ఫైర్ అవుతూనే ఉంటాడు. తనది ఆవేశం కాదు అని బాధ అని వసుధారతో అంటాడు మహేంద్ర. మనును శైలేంద్ర అడిగిన ప్రశ్నలు, అతడికి చేతికి అయిన గాయం చూస్తుంటే నా మనసు బాధతో విలవిలలాడిందని మహేంద్ర అంటాడు.
మనుకు ఎందుకు ఇలాంటి దుస్థితి, తను ఏం తప్పు చేశాడని అందరి ముందు తలదించుకొని బతకాలని వసుధారతో అంటాడు మహేంద్ర. సమాధానం తెలిసిన అనుపమ మన దగ్గర ఎందుకు ఈ రహస్యాన్ని దాస్తుందో ఈ రోజు తెలియాల్సిందేనని మహేంద్ర పట్టుపడతాడు.
దాపరికం ఎందుకు?
కొడుకుకు తన తండ్రి ఎవరో తెలియనంత దాపరికం ఎందుకు అని అంటాడు.వసుధార వద్దని చెప్పిన అనుపమపై మహేంద్ర ప్రశ్నల వర్షం కురిపిస్తూనే ఉంటాడు. వసుధారపై కూడా గట్టిగా అరుస్తాడు. మనును వెంటాడుతోన్న ప్రశ్నలకు ఈ రోజు నాకు సమాధానం కావాల్సిందేనని అంటాడు.
మను తండ్రి ఎక్కడ ఉంటే అక్కడికి తాను వెళతానని అంటాడు. అతడి మనసు మార్చి బతిమిలాడి ఇక్కడికి తీసుకొస్తానని అనుపమతో చెబుతాడు మహేంద్ర. ఇక నీ మౌనాన్ని భరించే శక్తి నాకు లేదని మహేంద్ర అంటాడు. మహేంద్ర ఎన్ని ప్రశ్నలు వేసినా, ఎంత గట్టిగా అడిగినా అనుపమ మాత్రం నోరు విప్పదు. సైలెంట్‌గా ఉండిపోతుంది.
అనుపమ వల్లే వేధింపులు...
అసలు లోపం ఉంది మను దగ్గర కాదు అనుపమ దగ్గర. మను పడే అవమానాలకు, మనం పడే బాధలకు అనుపమనే కారణం అని మాటల ధాటిని పెంచేస్తాడు మహేంద్ర. మన జీవితంలోకి అనుపమ వచ్చినప్పుడు ప్రశ్నలతో వేధించింది. ఇప్పుడు మౌనంతో వేధిస్తుంది. వేధించడానికే అనుపమ మన జీవితంలోకి వచ్చినట్లుందని అని మహేంద్ర కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
దేవయాని కొత్త ప్లాన్...
మిడ్‌నైట్‌లో రాజీవ్, శైలేంద్రలతో మీటింగ్ ఏర్పాటుచేస్తుంది దేవయాని. ఎన్ని ప్లాన్స్ వేసిన శైలేంద్రకు ఎండీ సీట్, రాజీవ్‌కు వసుధార దక్కకపోవడంతో ఈ సారి ప్లాన్ మార్చాలని దేవయాని ఫిక్స్ అవుతుంది. ఇక నుంచి తగ్గేదేలే అని దేవయాని ఛాలెంజ్ చేస్తుంది. ముగ్గురం కలిసి వసుధార, మను, అనుపమలను దెబ్బకొట్టడం కాకుండా విడివిడిగా ఒక్కొక్కరిని టార్గెట్ చేయాలని శైలేంద్ర, రాజీవ్‌లతో చెబుతుంది దేవయాని.
మను సంగతి శైలేంద్రదే...
ఇక నుంచి మను సంగతి శైలేంద్ర చూసుకుంటాడు. వసుధారను పని పట్టే పనిలో నువ్వు ఉండమని రాజీవ్‌తో చెబుతుంది దేవయాని. అనుపమ సంగతి తాను చూసుకుంటానని అంటుంది. ముగ్గురం వేర్వేరుగా పనిచేసిన మన అందరి టార్గెట్ ఒక్కటేనని దేవయాని అంటుంది.
ఇది ఆపరేషన్ డీఆర్ఎస్ అని తమ ప్లాన్‌కు కొత్త పేరు పెడుతుంది. తన కంటే రాజీవ్ పేరు ముందు ఉండటం శైలేంద్ర తట్టుకోలేకపోతాడు. ఈ ఆపరేషన్‌కు డీఎస్ఆర్ పెడదామని అంటాడు. అలా పెడితే సక్సెస్ అవుతుందని తన సిక్త్స్ సెన్స్ చెబుతుందని శైలేంద్ర బిల్డప్ ఇస్తాడు.
అతడి ప్లాన్‌ను రాజీవ్ కనిపెడతాడు. తన పేరు లాస్ట్‌లో ఉండటం తట్టుకోలేక శైలేంద్ర ఈ డ్రామాలు ఆడుతున్నాడని రాజీవ్ అంటాడు. ఇద్దరు గొడవ పడతారు. పేరు విషయంలోనే మనమధ్య ఐకమత్యం లేకపోతే మన టార్గెట్ ఎలా రీచ్ అవుతామని రాజీవ్, శైలేంద్రలకు క్లాస్ పీకుతుంది దేవయాని. మీరు ఇద్దరు కొట్టుకోవడం కాకుండా వసుధార, మనులను సంగతి చూడమని చెబుతుంది.
అనుపమ మిస్సింగ్...
అనుపమకు కాఫీ ఇచ్చేందుకు ఆమె రూమ్‌కు వెళుతుంది వసుధార. కానీ ఆమె రూమ్‌లో ఉండదు. ఇంట్లో మొత్తం వెతికినా ఎక్కడ కనిపించదు. అనుపమ కనిపించకపోవడంతో మహేంద్ర, వసుధార ఇద్దరు టెన్షన్ పడతారు. మిమ్మల్ని బాధపెట్టడం నాకు ఇష్టం లేదు.
మీరు సమస్యల్లో ఉన్నారని తెలిసి నేను మీ వద్దకు వచ్చాను. కానీ ఇప్పుడు నేనే మీకు సమస్యగా మారాను. అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని లెటర్ రాసి పెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది అనుపమ. ఆ లెటర్ చూసి వసుధార, మహేంద్ర షాకవుతారు. అనుపమకు ఫోన్ చేస్తారు. కానీ స్విఛాఫ్ అని వస్తుంది.
మీరు అన్న మాటలకు తట్టుకోలేక బాధతో అనుపమ ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఉంటుందని మహేంద్రతో అంటుంది వసుధార. మను దగ్గరికే అనుపమ వెళ్లిందని అనుకొని అతడి ఇంటికి వెళతారు. కానీ అక్కడికి కూడా అనుపమ రాలేదని మను చెబుతాడు.
మను కంగారు...
అనుపమ ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలిసి కూడా పెద్దమ్మ క్యాజువల్‌గా తీసుకుంటుంది. ఇది అనుపమకు కొత్తేం కాదని అంటుంది. అనుపమను తను అంటూ మను పిలుస్తాడు. మనుకు పెద్దమ్మ క్లాస్ ఇస్తుంది.
అనుపమ ఎక్కడికి వెళ్లిందో చెప్పమని పెద్దమ్మను గట్టిగా అడుగుతాడు మను. అనుపమకు ఆరోగ్యం బాగాలేదని, మెడిసిన్స్ తీసుకెళ్లకుండా ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని వసుధార కూడా కంగారు పడుతుంది.
అమ్మ ఎక్కడుందో చెప్పకపోతే నా మీద ఒట్టే అని పెద్దమ్మతో అంటాడు మను. ప్రామిస్‌కు భయపడి అనుపమ అడ్రెస్ చెబుతుంది పెద్దమ్మ. అనుపమ తన సీక్రెట్ ప్లేస్‌కు చేరుకుంటుంది. ఆమెను ఫాలో అవుతూ అక్కడికి దేవయాని వస్తుంది.