Guppedantha Manasu Today Episode: మనును అవమానించిన మహేంద్ర - దేవయాని శాడిజం - శైలేంద్ర ప్లాన్ సక్సెస్
Guppedantha Manasu Today Episode: నేటి గుప్పెడంత మనసు సీరియల్‌లో తండ్రి గురించిన టాపిక్ తీసుకొచ్చి మనును అవమానిస్తాడు శైలేంద్ర. తొందరపాటులో మహేంద్ర కూడా నోరు జారుతాడు. మహేంద్ర మాటలతో మను హర్ట్ అవుతాడు.
Guppedantha Manasu Today Episode:తండ్రి అనే బంధాన్ని అడ్డంపెట్టుకొని మనును అవమానిస్తాడు శైలేంద్ర. అతడి మాటలతో మను కోపం పట్టలేకపోతాడు.నీ తండ్రి ఎవరు అని మీ అమ్మను అడగొద్దా. అయితే మీ నాన్న ఎవరో నువ్వే చెప్పు. అప్పుడు నీ తల్లిని అడగాల్సిన పని ఉండదు అంటూ మనును నానా మాటలు అంటాడు శైలేంద్ర. మనును విసిగించకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోమని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తాడు మహేంద్ర.
మను లోపమే...
తండ్రి ఎవరో తెలియకపోవడం మను లోపమే అని నోరు జారుతాడు మహేంద్ర. అతడి మాటలతో మను హర్ట్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. తండ్రి ఎవరో తెలియకపోవడం నా లోపం కాదని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తనతో తప్పు చేయించావని శైలేంద్ర కాలర్ పట్టుకుంటాడు మహేంద్ర. నేను మామూలుగానే మను తండ్రి ఎవరో, ఏంటో అడిగాను.
మీరే లోపమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారని మహేంద్ర కోపాన్ని పట్టించుకోకుండా అతడిపై సెటైర్ వేస్తాడు శైలేంద్ర. నేనేం తప్పు చేయలేదని, మీరు అన్న మాటలకే మను బాధపడ్డాడని మహేంద్రతో అంటాడు శైలేంద్ర. మనును మీరే హర్ట్ చేసి పంపించారని తప్పును మహేంద్రపైనెట్టి వేస్తాడు శైలేంద్ర.
ఎందుకు ఈ శిక్ష...
శైలేంద్ర మాటలతో కోపంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన మను ఓ చోట ఆగుతాడు. శైలేంద్ర చేసిన అవమానం భరించలేకపోతాడు. నేనేం తప్పు చేశాను. నాకు ఎందుకు శిక్ష. ఒక్కొక్క మాట గుండెల్లో గుణపమై గుచ్చుకుంటుందని బాధపడతాడు. అనుపమ నా తల్లి అయితే మరి తండ్రి ఎవరు? ఈ ప్రశ్న నన్ను ఎన్నో ఏళ్లుగా వేధిస్తుందని ఆవేదనకు లోనవుతాడు. సమాధానం చెప్పాల్సిన అనుపమ మౌనంగా ఉండిపోయిందని, గట్టిగా నిలదీసినందుకు తనను వెలివేసిందని బాధపడతాడు.
ఇక ఈ బాధను భరించడం తన వల్ల కాదని అనుకుంటాడు. ప్రాణం పోతున్నట్లుగా ఫీలవుతాడు. అసలు నా తండ్రి ఎవరు అని గట్టిగా అరుస్తాడు.
శైలేంద్ర సంబరం...
మనుపై సాధించిన విజయంతో ఆనందంగా ఇంటికొస్తాడు శైలేంద్ర. వచ్చి రావడంతోనే తల్లిపై ప్రశంసలు కురిపిస్తాడు. ఈ రోజు ఎండీ సీట్ సాధించినంత గర్వంగా ఉందని అంటాడు. నీ ప్లాన్ వర్కవుట్ అయ్యిందని ఆనందంతో గంతులేస్తాడు. నువ్వు ఊహించినట్లుగానే మనుకు అతడి తండ్రి ఎవరో తెలియదని , తండ్రి గురించి అడిగి వాడిని రెచ్చగొట్టానని దేవయానితో అంటాడు శైలేంద్ర.
నేను చేసిన అవమానం తట్టుకోలేక తన చేతిని తానే గాయపరుచుకున్నాడని, బాబాయ్ నోటి నుంచే వాడిని హర్ట్ అయ్యేలా చేశానని చెప్పి సంబరపడతాడు శైలేంద్ర. ఇన్నాళ్లు పులిలా ఉన్న వాడు ఇక నుంచి పిల్లిలా అయిపోవడం ఖాయమని ఆనందంతో అంటాడు. మను వీక్‌నెస్‌ను నీ బలం చేసుకొని వాడిని కాలేజీ నుంచి వెళ్లగొట్టమని కొడుకు సలహా ఇస్తుంది దేవయాని. అప్పుడే డీబీఎస్‌టీ కాలేజీ ఎండీ సీట్ నీది అవుతుందని శైలేంద్రతో అంటుంది దేవయాని.
మహేంద్ర గిల్టీ ఫీలింగ్....
మనుకు అతడి తండ్రి ఎవరో తెలియకపోవడం లోపమని అన్న మాటలకు శైలేంద్ర ఎంతో బాధపడతాడు. తాను ఆ మాట అనాల్సింది కాదని విలవిలలాడతాడు. తన మాటలతో మను చాలా హర్ట్ అయ్యాడని అనుకుంటాడు. మీరు ఫ్లోలో ఆ మాట అన్నారని, కావాలని అనలేదని మహేంద్రకు సర్ధిచెబుతుంది వసుధార. అయినా మహేంద్ర బాధ తగ్గదు. కొడుకుగా భావించే మనును అలాంటి మాట అనాల్సింది కాదని మహేంద్ర బాధపడతాడు. రిషి దూరమై కష్టాల్లో తమ కుటుంబానికి మను ఎంతో చేశాడని మహేంద్ర అంటాడు.
తొందరపాటులో...
శైలేంద్ర అడిగిన ప్రశ్నలకు ఆవేశం పట్టలేక తొందరపాటులో ఈ మాట అన్నానని మహేంద్ర వాపోతాడు.
ఈ రోజు శైలేంద్ర అందరికి ముందు మనును అవమానించాడు. రేపు మరొకరు అతడిని అవమానించరని గ్యారెంటీ ఏంటి? ఇలా జరగకుండా ఉండాలంటే మను తండ్రి ఎవరు అనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సిందేనని మహేంద్ర నిర్ణయించుకుంటాడు. ఈ ప్రశ్నకు అనుపమ నుంచి సమాధానం ఎలాగైనా రాబడతానని ఆవేశంగా అక్కడి నుంచి వెళతాడు. వసుధార వారిస్తున్నా వినడు.
పెద్దమ్మ ఓదార్పు...
చేతికి దెబ్బ తగిలి బాధపడుతోన్న మనును పెద్దమ్మ ఓదార్చుతుంది. రోడ్డు మీద పోయే వాళ్లు వంద అంటుంటారు. మొరిగే ప్రతి కుక్క మీదకు రాయి విసురుతూ పోతూ ఉంటే మన జీవితం అక్కడే ఆగిపోతుందని, ముందుకు వెళ్లలేమని మనుతో అంటుంది పెద్దమ్మ.
నన్ను ఏమన్న తాను పట్టించుకోనని, కానీ తన తండ్రిని గురించి అడిగి అవమానిస్తున్నారని, తండ్రి పేరు కూడా తెలియదని అవహేళన చేస్తున్నారని మను ఆవేశానికి లోనవుతాడు. తండ్రి ప్రస్తావన తీసుకొచ్చి తన తల్లి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడుతున్నారని మను కోపంగా అంటాడు. మనుషుల దగ్గర లేనిదాని గురించే మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందే మనుషుల తీరే అంత వారిని పట్టించుకోవద్దని మనుకు సర్ధిచెబుతుంది పెద్దమ్మ.
అయిన వాళ్లు కూడా తన లోపాన్ని ఎత్తి చూపడం తట్టుకోలేకపోతున్నానని మహేంద్ర మాటలను గుర్తుచేసుకొని మను కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ బాధలు, అవమానాలు భరించాలో తెలియడం లేదని, ఎందుకు నాకు ఈ బతుకు అని బాధపడతాడు. నేను పుట్టకపోతే ఈ కన్నీళ్లు, అవమానాలు ఉండేవి కావని పెద్దమ్మతో అంటాడు మను.
దేవయాని శాడిజం
తనలో శాడిజం బాగా తగ్గిపోయిందని దేవయాని అనుకుంటుంది. ఆ ఫీలింగ్ తగ్గాలంటే అనుపమకు ఫోన్ చేసి ఆమెను ఓ ఆట ఆడుకోవాలని ఫిక్సవుతుంది. అనుపమతో ప్రేమగా మాట్లాడుతుంది. ఆ తర్వాత అసలు విషయం బయటపెడుతుంది. మనుకు శైలేంద్ర చేసిన అవమానం గుర్తుచేస్తుంది. దేవయాని మాటలు విని అనుపమ తల్లడిల్లుతుంది.